Winter Health Tips: చలికాలంలో అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే! తింటే ఏమవుతుందో తెలుసా?
చలికాలంలో శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్స్ పై శ్రద్ధ పెట్టడం అవసరం. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. నిపుణుల ప్రకారం చలికాలంలో అస్సలు తినకూడని ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

చలికాలంలో తినకూడని ఫుడ్స్..
చలికాలంలో మనం తీసుకునే ఆహారం.. ఆరోగ్యం, ఇమ్యూనిటీ, జీర్ణక్రియ, శరీర ఉష్ణోగ్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి చలికాలంలో ఏ ఆహారాలను తినకూడదో తెలుసుకోవడం ముఖ్యం. జలుబు, దగ్గు, ఇతర వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే ఏ ఫుడ్స్ కి దూరంగా ఉండాలో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఫ్రిజ్ లో పెట్టిన ఫుడ్స్
చలికాలంలో ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రిజ్ లో పెట్టిన తేనె, పాలు, పాల పదార్థాల వంటివి జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. దానివల్ల శరీరంలో చల్లని ప్రభావం పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే చక్కెర, స్వీట్లు, బేకరీ పదార్థాలను కూడా చలికాలంలో తగ్గించాలి.
డ్రింక్స్
చలికాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటి వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదు. వీటిని తినడం వల్ల శరీరం వేడిని కోల్పోతుంది. జీర్ణక్రియ స్లో అవుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు సమస్యలు పెరుగుతాయి. చిన్నారులు, వృద్ధులు ఈ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు. కాబట్టి చలికాలంలో ఇలాంటి చల్లని ఫుడ్స్‌కి దూరంగా ఉండటం మంచిది.
ఫాస్ట్ ఫుడ్స్
చలికాలంలో ఫాస్ట్ ఫుడ్, చిప్స్, పాపడ్స్ వంటివి తినడం తగ్గించుకోవాలి. వీటిలో ఉప్పు, మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వాపు, జీర్ణ సమస్యలు రావచ్చు. అలాగే పిజ్జా, బర్గర్ వంటి హై కేలరీ ఫుడ్స్ ని కూడా చలికాలంలో తక్కువగా తినడం మంచిది.
ప్రాసెస్డ్ ఫుడ్స్
చలికాలంలో అస్సలు తినకూడని ఫుడ్స్‌లో ప్రాసెస్‌డ్, గ్యాస్డ్, కాంపౌండ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఆల్కహాల్, సోడా వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, రక్త ప్రవాహం మందగిస్తుంది. జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పూర్తిగా దూరం పెట్టడం మంచిది.
ఇవి తినడం మేలు
చలికాలంలో ఆరోగ్యం బాగుండాలంటే.. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన మాంసం, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు, చల్లని డ్రింక్స్, బేకరీ ఐటెమ్స్ వంటి వాటిని తగ్గించి.. వేడి సూపులు, సిట్రస్ పండ్లు, వేడి డ్రింక్స్, న్యూట్రిషియస్ స్నాక్స్ తినడం మంచిది. వీటి ద్వారా శక్తి, ఇమ్యూనిటీ రెండూ పెరుగుతాయి.

