MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • Health Tips: టమాటాలు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త..!

Health Tips: టమాటాలు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త..!

రోజువారీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ టమాట. ఇది రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టమాటాలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే మంచిదనుకుంటారు. కానీ ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు 

2 Min read
Author : Kavitha G
Published : Dec 15 2025, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టమాటాలు ఎక్కువగా తింటే ఏమవుతుంది?
Image Credit : Getty

టమాటాలు ఎక్కువగా తింటే ఏమవుతుంది?

టమాటాలను కూరలు, చట్నీలు, సూపులు, సలాడ్లు, సాస్‌లు ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటాం. టమాటాల్లో విటమిన్ C, విటమిన్ A, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే టమాటాలను అతిగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి టమాటాలు ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
గ్యాస్ సమస్యలు
Image Credit : Getty

గ్యాస్ సమస్యలు

టమాటాల్లో సహజంగా ఆమ్ల గుణం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపులో మంట, ఛాతీలో మంట, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గ్యాస్ట్రిక్ అల్సర్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారు టమాటాలను మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. 

Related Articles

Related image1
Hair Growth: జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలంటే.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Related image2
Mineral Water: మినరల్ వాటర్‌ను వేడిచేసి తాగడం మంచిదా? కాదా? తాగితే ఏమవుతుంది?
37
కీళ్ల సమస్యలు
Image Credit : Getty

కీళ్ల సమస్యలు

టమాటాల్లో సోలానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి ఎక్కువగా చేరితే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు టమాటాలు ఎక్కువగా తింటే నొప్పులు ఎక్కువైనట్లు అనిపించవచ్చని చెబుతున్నారు. 

47
కిడ్నీ సమస్యలు
Image Credit : Getty

కిడ్నీ సమస్యలు

టమాటాలను అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై కూడా భారం పడే అవకాశం ఉంది. టమాటాల్లో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది ఆరోగ్యానికి మంచిదే అయినా, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో అధిక పొటాషియం స్థాయి ప్రమాదకరంగా మారవచ్చు. కిడ్నీలు సరిగ్గా పనిచేయని పరిస్థితుల్లో శరీరంలో పొటాషియం నిల్వ ఉంటే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. 

57
చర్మ సమస్యలు
Image Credit : Getty

చర్మ సమస్యలు

సాధారణంగా టమాటాలు చర్మానికి మేలు చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో టమాటాల్లో ఉండే హిస్టమిన్ అనే పదార్థం కొందరిలో అలెర్జీ లక్షణాలను ప్రేరేపించవచ్చు. దానివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, చర్మం ఎర్రగా మారడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. 

67
పంటి ఎనామిల్
Image Credit : Getty

పంటి ఎనామిల్

టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పంటి ఎనామెల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. టమాటాల్లోని ఆమ్ల గుణం వల్ల పళ్లపై ఉన్న రక్షణ పొర క్రమంగా బలహీనపడుతుంది. ఫలితంగా చల్లటి లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు పంటి నొప్పి వస్తుంది. ముఖ్యంగా టమాట జ్యూస్, టమాట సాస్‌లను ఎక్కువగా తీసుకునేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

77
ఇతర కూరగాయలతో కలిపి..
Image Credit : Getty

ఇతర కూరగాయలతో కలిపి..

నిపుణుల ప్రకారం… టమాటాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ సరైన మోతాదు ముఖ్యం. రోజూ అధిక మోతాదులో టమాటాలను తీసుకోవడం కంటే, మితంగా తీసుకోవడం ఉత్తమం. ఇతర కూరగాయలతో కలిపి టమాటాలను వండుకుని తినడం వల్ల వాటి ఆమ్ల గుణం కొంత తగ్గుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Hair Growth: జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలంటే.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Recommended image2
Mineral Water: మినరల్ వాటర్‌ను వేడిచేసి తాగడం మంచిదా? కాదా? తాగితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved