- Home
- Life
- Food
- Mutton Health Risks: మీరు తినే మటన్‌లో ఈ పార్ట్స్ ఉన్నాయా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే
Mutton Health Risks: మీరు తినే మటన్‌లో ఈ పార్ట్స్ ఉన్నాయా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే
Mutton Health Risks: మటన్ ఆరోగ్యానికి మంచిది. మటన్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన అనేక రకాలు పోషకాలు అందుతాయి. అయితే, మటన్ లోని కొన్ని భాగాలు తింటే మాత్రం తీవ్ర అనారోగ్యం తప్పదు. అసలు మటన్ లోని ఏ భాగాలను తినకుండా దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్‌లో ఈ 7 భాగాలను టచ్ చేస్తే అంతే సంగతులు
నాన్‌వెజ్ ప్రియులకు వీకెండ్ వస్తే చాలు.. ప్లేట్‌లో మటన్ ముక్క పడాల్సిందే. గొర్రె లేదా మేక మాంసం మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, ఐరన్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఇది హెల్త్‌కు చాలా మంచిదే అయినప్పటికీ, మేక శరీరంలోని కొన్ని నిర్దిష్ట భాగాలను తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీటిలో బ్యాక్టీరియా, టాక్సిన్స్ ఎక్కువగా ఉండటంతో పాటు, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మటన్ తినేటప్పుడు ఏ భాగాలు తినకూడదో కచ్చితంగా తెలుసుకోవాలి. మేక శరీరంలో మనం అస్సలు ముట్టుకోకూడదని 7 ముఖ్యమైన భాగాల గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
1. యానిమల్ గ్లాండ్స్ (గొంతు దగ్గరి గ్రంథులు)
మేక మెడ లేదా గొంతు భాగంలో ఉండే లింఫ్ గ్రంథులు శరీరంలోకి వచ్చే క్రిములను, బ్యాక్టీరియాను ఫిల్టర్ చేస్తుంటాయి. అంటే ఇవి ఒక రకంగా మేక శరీరంలోని వ్యర్థాలను ఆపే రక్షణ కవచాలు అన్నమాట. వీటిని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు, ఆ గ్రంథుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్లు నేరుగా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల మనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
2. ఇంటర్నల్ ఆర్గాన్ ఫ్యాట్ (పేగుల చుట్టూ ఉండే కొవ్వు)
చాలామంది మటన్ వండేటప్పుడు టేస్ట్ కోసం మేక పేగులు, పొట్ట భాగాల చుట్టూ ఉండే కొవ్వును కూడా కలిపి వండుతుంటారు. కానీ, ఈ భాగంలో శాచురేటెడ్ ఫ్యాట్ అంటే శరీరానికి హాని చేసే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన బ్యాడ్ ఫ్యాట్ మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను విపరీతంగా పెంచేస్తుంది. అంతేకాదు, ఇది రక్తనాళాల్లో పేరుకుపోయి, రక్తం సరఫరాకు అడ్డంకులు సృష్టిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
3. ఊపిరితిత్తులు
మనుషుల లాగే మేకలు కూడా శ్వాస తీసుకునేటప్పుడు గాలిలోని ధూళి, కాలుష్య కారకాలను లోపలికి పీల్చుకుంటాయి. మేక ఊపిరితిత్తులు ఈ కాలుష్య కణాలను, మైక్రోబ్స్‌ను ఫిల్టర్ చేసి లోపలే ట్రాప్ చేస్తాయి. అందువల్ల ఊపిరితిత్తుల భాగంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ భాగాలను మనం తింటే, ఆ కాలుష్య కారకాలు మన శరీరంలోకి చేరి శ్వాసకోస సంబంధిత ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.
4. పేగులు
మేక చిన్న పేగులు, పెద్ద పేగులు అనేవి జీర్ణవ్యవస్థలో భాగం. సహజంగానే వీటిలో జంతువుల మలమూత్ర వ్యర్థాలు, సగం అరిగిన ఆహార పదార్థాలు ఉంటాయి. ఒకవేళ వీటిని తినాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి నీళ్లు, పసుపు వేసి చాలా పర్‌ఫెక్ట్‌గా క్లీన్ చేయకపోతే, వాటిలో ఉండే ప్రమాదకర క్రిములు మన పొట్టలోకి చేరతాయి. దీనివల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అవ్వడమే కాకుండా, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
5. మెదడు, వెన్నెముక, పచ్చి రక్తం
- మేక మెదడు: మేక మెదడులో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, నెమరువేసే జంతువులలో వచ్చే కొన్ని రకాల ప్రమాదకరమైన మెదడు వ్యాధులు ఈ కణజాలం ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఉంది.
- వెన్నెముక: మెదడు లాగే వెన్నెముక కూడా నరాల కణజాలంతో కూడుకున్నది. జంతువులకు ఉండే కొన్ని రకాల వ్యాధులు ఈ వెన్నెముక భాగంలో ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని కూడా తినకుండా దూరంగా ఉంచడమే సేఫ్.
- పచ్చి రక్తం: సరిగ్గా ఉడకని రక్తం లేదా గడ్డకట్టిన పచ్చి రక్తంలో అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ సేఫ్టీ పరంగా మేజర్ హెల్త్ రిస్క్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మటన్ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే నమ్మకమైన దుకాణం నుంచి మాత్రమే ఫ్రెష్‌గా ఉండే షోల్డర్, వెనుక కాలు లేదా రిబ్స్ వంటి సురక్షితమైన భాగాలను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

