MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?

Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?

Earthquake Alert: విశాఖలో ఆదివారం తెల్లవారుజామున 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర భూకంప ముప్పు ఉన్న ప్రాంతాలు ఏవి? భూకంపాలు వచ్చే ఛాన్స్ ఎక్కువున్న ప్రాంతాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 12 2026, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైజాగ్ లో తెల్లవారుజామున భూప్రకంపనలు
Image Credit : Gemini

వైజాగ్ లో తెల్లవారుజామున భూప్రకంపనలు

Vizag Earthquake: ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గాఢ నిద్రలో ఉన్న నగరవాసులకు ఒక్కసారిగా బెడ్లు, ఇళ్లలోని వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొందరు నిద్ర మత్తులో నుంచి లేస్తుండగా, మరికొందరు అప్పుడే మార్నింగ్ వాక్ కోసం బయలుదేరుతుండగా భూమి కంపించింది.

దీంతో ప్రాణభయంతో జనాలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. నగరంలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, అప్పుఘర్, మాధవధార, పెద వాల్తేరు, ఎంవీపి కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్ బీ కాలనీ లాంటి మేజర్ ఏరియాల్లో ఈ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని సెకన్ల పాటు జరిగిన ఈ కుదుపు జనాల్లో తీవ్ర ఆందోళన నింపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు భూకంప కేంద్రం ఎక్కడ? సైంటిస్టులు ఏం చెప్తున్నారు?
Image Credit : Getty

అసలు భూకంప కేంద్రం ఎక్కడ? సైంటిస్టులు ఏం చెప్తున్నారు?

ఈ భూప్రకంపనల పై నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) అధికారిక ప్రకటన విడుదల చేసింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైందని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున సరిగ్గా 5:05 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చింది. కాకినాడకు తూర్పున సుమారు 227 కిలోమీటర్ల దూరంలో, బంగాళాఖాతం సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్లే వైజాగ్ సిటీలో దీని ప్రభావం కనిపించిందని అధికారులు వెల్లడించారు.

Related Articles

Related image1
Team India: ఇంగ్లాండ్ లో టీమిండియా అట్టర్ ప్లాప్.. భారత్ ఓటమికి మెయిన్ రీజన్స్ ఇవే
Related image2
Worlds Cheapest Electric Car: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు
35
సముద్ర గర్భంలో షాలో ఎర్త్ క్వేక్ అంటే ఏంటి?
Image Credit : Getty

సముద్ర గర్భంలో షాలో ఎర్త్ క్వేక్ అంటే ఏంటి?

ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ప్రకంపనలతో పోలిస్తే దీని తీవ్రత కాస్త ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. సముద్రంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఇది జరగడం వల్ల దీనిని ‘షాలో ఎర్త్ క్వేక్’ అంటారని చెబుతున్నారు. బంగాళాఖాతంలో కొన్ని ఫాల్ట్ జోన్స్ ఉన్నాయని, వాటిలో జరిగిన అంతర్గత కదలికల వల్లే ఈ ప్రకంపనలు వచ్చాయని పేర్కొన్నారు.

45
ఆంధ్రప్రదేశ్‌లో భూకంప ముప్పు ఉన్న ఏరియాలు ఇవే
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్‌లో భూకంప ముప్పు ఉన్న ఏరియాలు ఇవే

వైజాగ్ భూ ప్రకంపనల తర్వాత అసలు మన ఏరియా సేఫేనా అనే డౌట్ అందరిలోనూ స్టార్ట్ అయింది. ఇండియాను భూకంప తీవ్రత ఆధారంగా జోన్-2 నుంచి జోన్-5 వరకు వర్గీకరించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు జోన్-2, జోన్-3 పరిధిలోకి వస్తాయి.

  • కోస్తా తీర ప్రాంతాలు: బంగాళాఖాతానికి ఆనుకుని ఉండే విశాఖపట్నం, కాకినాడ, పరిసర తీర ప్రాంతాలు భూకంప ముప్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి మీడియం రిస్క్ ఉండే జోన్ కిందకు వస్తాయి. సముద్రంలో వచ్చే మార్పుల ఎఫెక్ట్ వీటిపై పడుతుంది.
  • రాయలసీమ రీజియన్: రాయలసీమ ప్రాంతంలో భూమి అంతర్గతంగా చాలా స్థిరంగా ఉంటుంది. కానీ, కొన్ని స్పెసిఫిక్ ఏరియాల్లో అప్పుడప్పుడు చాలా చిన్న స్థాయి ప్రకంపనలు మాత్రమే నమోదవుతుంటాయి.
55
తెలంగాణలో భూకంప డేంజర్ జోన్స్ ఏవి?
Image Credit : Gemini

తెలంగాణలో భూకంప డేంజర్ జోన్స్ ఏవి?

తెలంగాణ విషయానికి వస్తే, మెజారిటీ రాష్ట్రమంతా భూకంపాల పరంగా అత్యంత సురక్షితమైన జోన్ లోనే ఉంది. అయితే, అక్కడక్కడ చాలా చిన్న మొత్తంలో ప్రకంపనలు వస్తుంటాయి.

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణలో భూకంప ముప్పు ఉన్న ఏకైక మేజర్ ఏరియా భద్రాచలం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే. ఇక్కడ భూగర్భ పొరల్లో ఉండే కదలికల వల్ల అప్పుడప్పుడు చిన్నపాటి లోకల్ ప్రకంపనలు వస్తుంటాయి.
  • హైదరాబాద్ అండ్ అదర్ ఏరియాస్: రాజధాని హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని మిగిలిన జిల్లాలన్నీ భూకంపాల పరంగా పూర్తిగా సేఫ్ జోన్ లో ఉన్నాయి.

ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ ల్యాండ్ అంతా జోన్-2 అంటే చాలా తక్కువ ప్రమాదం, జోన్-3 మధ్యస్థ ప్రమాదం పరిధిలోనే ఉంది కాబట్టి, భారీ భూకంపాలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vietnam Boat Accident: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో విషాదం. అసలేం జరిగిందంటే.?
Recommended image2
Corona In AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. మ‌ర‌ణాల‌తో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం.
Recommended image3
Malla Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను టార్గెట్ చేసిన మ‌ల్లారెడ్డి.. తిరుప‌తిలో చ‌క్రం తిప్పేందుకు పెద్ద స్కెచ్
Related Stories
Recommended image1
Team India: ఇంగ్లాండ్ లో టీమిండియా అట్టర్ ప్లాప్.. భారత్ ఓటమికి మెయిన్ రీజన్స్ ఇవే
Recommended image2
Worlds Cheapest Electric Car: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved