MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Automobile
  • Cars
  • Worlds Cheapest Electric Car: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు

Worlds Cheapest Electric Car: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు

Worlds Cheapest Electric Car: బడ్జెట్ ధరలో మైండ్ బ్లోయింగ్ రేంజ్ తో ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు మార్కెట్ ను షేక్ చేస్తోంది. చైనాకు చెందిన వులింగ్ సంస్థ కేవలం రూ. 5.2 లక్షల ప్రారంభ ధరతో 301 కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారును తెచ్చింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 10 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
₹5 లక్షలకే 301 కిమీ మైలేజ్ ఇచ్చే బుజ్జి ఎలక్ట్రిక్ కార్
Image Credit : X/DriveGreen80167

₹5 లక్షలకే 301 కిమీ మైలేజ్ ఇచ్చే బుజ్జి ఎలక్ట్రిక్ కార్

పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తేనే వాహనం కొనాలనుకునే వారి గుండెల్లో గుబులు మొదలవుతుంది. దీనికి తోడు కార్ల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో మన బడ్జెట్‌లో ఒక సూపర్ ఎలక్ట్రిక్ కార్ దొరికితే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే చైనాకు చెందిన వులింగ్ సంస్థ ఒక క్రేజీ గుడ్ న్యూస్ మోసుకొచ్చింది.

గ్లోబల్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ, ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందిన 'వులింగ్ హాంగ్‌ గ్వాంగ్ మినీ ఈవీ' (Wuling Hongguang Mini EV) ఇప్పుడు ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేస్తోంది. రోజువారీ నగర ప్రయాణాలకు, చిన్న కుటుంబాలకు విపరీతంగా నచ్చేస్తున్న ఈ బుజ్జి కార్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వీల్స్‌పై నడిచే స్మార్ట్‌ఫోన్.. మెయింటెనెన్స్ పరంగా అల్టిమేట్
Image Credit : X/DriveGreen80167

వీల్స్‌పై నడిచే స్మార్ట్‌ఫోన్.. మెయింటెనెన్స్ పరంగా అల్టిమేట్

ఈ కారును చూస్తే అచ్చం వీల్స్‌పై నడిచే ఒక పెద్ద స్మార్ట్‌ఫోన్ లాగా అనిపిస్తుంది. మన మొబైల్‌ను ఎలాగైతే రోజూ రాత్రి ఇంట్లో ప్లగ్ పెట్టి ఛార్జ్ చేసుకుంటామో.. ఈ కారును కూడా మన ఇంట్లోని నార్మల్ వాల్ అవుట్‌లెట్‌కు కనెక్ట్ చేసి చాలా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టేషన్ల చుట్టూ తిరిగే తిప్పలు, పెట్రోల్ బిల్లుల భారం అస్సలు ఉండదు. మరి దీనివల్ల ఎంత డబ్బు ఆదా అవుతుందో ఒక చిన్న లెక్క చూద్దాం.

సాధారణంగా ఒక పెట్రోల్ కార్ 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 8 లీటర్ల ఇంధనాన్ని వాడుకుంటుంది. ఒక లీటర్ ధర సుమారు 1.50 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 125) అనుకుంటే, 100 కిలోమీటర్లకు అయ్యే ఖర్చు 12 డాలర్లు (సుమారు రూ. 1,000). కానీ, ఈ వులింగ్ మినీ ఈవీ కేవలం 10 kWh విద్యుత్‌తోనే 100 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఒక యూనిట్ కరెంట్ ధర 0.15 డాలర్లు (సుమారు రూ. 12.50) అని వేసుకున్నా, 100 కిలోమీటర్ల లాంగ్ డ్రైవ్‌కు అయ్యే ఖర్చు కేవలం 1.50 డాలర్లు (దాదాపు రూ. 125) మాత్రమే. ఈ లెక్కన పెట్రోల్ కారుతో పోలిస్తే దాదాపు ఎనిమిది రెట్లు డబ్బు ఆదా అవుతుంది.

35
తక్కువ ధర.. అదిరిపోయే పవర్, రేంజ్
Image Credit : X/DriveGreen80167

తక్కువ ధర.. అదిరిపోయే పవర్, రేంజ్

ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన ఈ సరికొత్త లేటెస్ట్ వెర్షన్ ధరలు RMB 44,800 నుండి RMB 54,800 వరకు ఉన్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 5.2 లక్షల నుండి రూ. 6.4 లక్షల బడ్జెట్లోనే ఈ కారు లభిస్తోంది. ఇంత తక్కువ ధర ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో తగ్గేదేలే అంటోంది ఈ కార్. ఇందులో పవర్‌ఫుల్ 30 kW పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది 42 హార్స్‌ పవర్ శక్తిని జనరేట్ చేస్తుంది.

సిటీ ట్రాఫిక్‌లో చకచకా దూసుకెళ్లేందుకు వీలుగా కేవలం 4.5 సెకన్లలోనే 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని స్పెషాలిటీ. ఇక రేంజ్ విషయానికొస్తే, కస్టమర్ల అవసరాల కోసం ఇది 205 కిలోమీటర్లు, 301 కిలోమీటర్లు అనే రెండు వేర్వేరు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పైగా ఇందులో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీని సాయంతో కేవలం 35 నిమిషాల్లోనే బ్యాటరీని 30 శాతం నుండి 80 శాతానికి నింపవచ్చు.

45
కాంపాక్ట్ సైజ్.. ప్రీమియం ఫీచర్లు
Image Credit : X/DriveGreen80167

కాంపాక్ట్ సైజ్.. ప్రీమియం ఫీచర్లు

మెట్రో సిటీస్ లో ఉండే పెద్ద తలనొప్పి పార్కింగ్. పెద్ద పెద్ద కార్లు పట్టని ఇరుకైన సందుల్లో కూడా ఈ వులింగ్ మినీ ఈవీని చాలా ఈజీగా పార్క్ చేసేయొచ్చు. దీని టర్నింగ్ రేడియస్ కేవలం 4.5 మీటర్లు మాత్రమే కావడంతో షార్ప్ టర్నింగ్స్ లో కూడా సులభంగా డ్రైవ్ చేయొచ్చు. బయటికి చిన్నగా కనిపించినా, కారు లోపల మాత్రం నలుగురు వ్యక్తులు హ్యాపీగా, కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు.

అలాగే ఇందులో రైడింగ్‌ను ఎంజాయ్ చేయడానికి 10.1 అంగుళాల బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిమోట్ ఏసీ కంట్రోల్, పవర్ విండోస్, పార్కింగ్‌ను మరింత సులువుగా మార్చే బ్యాకప్ కెమెరా వంటి ఎన్నో మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. లుక్ పరంగా చూస్తే, గుండ్రటి ఎల్ఈడీ హెడ్‌లైట్లతో వింటేజ్, రెట్రో వైబ్స్ ఇస్తూ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది.

55
చిన్న కారే.. కానీ సేఫ్టీలో తోపు
Image Credit : X/DriveGreen80167

చిన్న కారే.. కానీ సేఫ్టీలో తోపు

చాలామంది చిన్న కార్లు అనగానే సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలేమో అని భయపడతారు. కానీ వులింగ్ సంస్థ ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంది. ఈ కారు బాడీని 67 శాతం హై స్ట్రెంగ్త్ స్టీల్‌తో తయారు చేశారు. ప్రమాదాల సమయంలో ప్రయాణికులను కాపాడటానికి ముందు భాగంలో ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేకింగ్ కంట్రోల్ కోసం డిస్క్ బ్రేకులు, ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చేలా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను అందించారు. అందుకే, సాధారణ ప్రజల బడ్జెట్‌కు తగినట్లుగా ఉంటూ.. గ్రీన్ ఎనర్జీని, సేఫ్ డ్రైవింగ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఈ వులింగ్ మినీ ఈవీ ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki: మారుతి నుంచి మైండ్ బ్లాకింగ్ కారు.. రూ. 5 లక్షలకే 34KM మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్
Recommended image2
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image3
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Related Stories
Recommended image1
Water Powered Scooter: పెట్రోల్ తో పనిలేదు.. ఛార్జింగ్ అవసరం లేదు.. నీటితో నడిచే క్రేజీ స్కూటర్ వచ్చేసింది !
Recommended image2
Best Selling Cars: భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే.. నంబర్ 1 స్థానంలో టాటా పంచ్.. టాప్ 5 కార్లు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved