- Home
- Life
- Food
- Mutton : బోటీని అంత తేలిగ్గా తీసిపారేయకండి.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే లొట్టలేసుకుని తింటారు
Mutton : బోటీని అంత తేలిగ్గా తీసిపారేయకండి.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే లొట్టలేసుకుని తింటారు
Mutton : సంక్రాంతి వచ్చిందంటే చాలు చికెన్, మటన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే బోటీని తినేందుకు చాలామంది ఇష్టపడరు కాబట్టి ధర తక్కువగా ఉంటుంది. కానీ బోటీ తినడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బోటీతో ఇన్ని ప్రయోజనాలా..!
Goat Boti : సండే వచ్చిందంటే చాలు కొందరికి ముక్క లేకుంటే ముద్ద దిగదు... అందుకే చాలాఇళ్లలో తప్పకుండా మాంసం వండుతుంటారు. ఇక తెలంగాణ ప్రాంతంలో శుభకార్యమే కాదు అశుభ కార్యాలకు కూడా యాట తెగాల్సిందే. పండగలు, పర్వదినాలకు కూడా చికెన్ లేదంటే మేక, గొర్రె మాంసంతో స్పెషల్ వంటకాలే... గ్రామ దేవతలకు కూడా చికెన్, మటన్ నైవేధ్యంగా పెడతారంటేనే ఇక్కడి ఫుడ్ కల్చర్ అర్థం చేసుకోవచ్చు.
అయితే మటన్ ఇష్టంగా తినే చాలామంది బోటి (మేక లేదా గొర్రె పేగులు, లివర్ వంటివి) ని ఇష్టపడరు. వాటిని తినకూడని వేస్ట్ పదార్థాలుగా భావిస్తుంటారు... అందుకే మటన్ కంటే బోటి ధర తక్కువగా ఉంటుంది. జంతువుల విసర్జకాలు ఉంటాయని చులకనగా చూసే బోటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి... వీటిగురించి తెలిస్తే వద్దువద్దనే వాళ్లుకూడా లొట్టలేసుకుని తింటారు. మరి మేక/గొర్రె బోటీ వల్ల లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బోటీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
సాధారణంగా మేకలు లేదా గొర్రెలు ఆకులు, గడ్డిని మాత్రమే తింటాయి... కాబట్టి ఈ చెట్లలోని పోషకాలన్ని వాటిలో ఉంటాయి. ముఖ్యంగా వీటి పేగులు అంటే బోటీగా పిలుచుకునే మాంసంలో మంచి పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. శుభ్రంగా కడుక్కుని బోటీ కూర వండితే మటన్ కంటే అద్భుతంగా ఉంటుందని దీన్ని ఇష్టపడేవాళ్లు చెబుతుంటారు... ఇలా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
రోగ నిరోధక శక్తి
మేక పేగులు, లివర్ వంటి వాటిలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి. బోటిలో జింక్, సెలీనియం వంటివి పుష్కలంగా ఉంటాయి... అందుకే అనారోగ్యంతో ఉన్నవారు ఇది తింటే వెంటనే నయం అవుతుంది.
రక్తహీనత నివారణ
శరీరంలో తగినంత ఎర్రరక్తకణాలు, హిమోగ్లోబిన్ లేకపోవడమే రక్తహీనత... ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రుతుస్రావం, గర్భధారణ, ప్రసవం సమయంలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపంవల్ల ఈ సమస్య వస్తుంది. అయితే బోటీలో ఐరన్ ఉంటుంది... ఇది ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. తద్వారా రక్తహీనత సమస్య తగ్గుతుంది.
కండరాలు, ఎముకలకు బలం
మటన్ లో కంటే బోటీలో కండరాలు, ఎముకలను బలంగా మార్చే పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. కొల్లాజెన్ అనే ప్రోటీన్ వల్ల కీళ్లు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బోటీలోని మరికొన్ని ప్రోటీన్స్ కండరాల శక్తిని పెంచుతాయి. ఇలా బోటీ తినడంవల్ల కీళ్లు, కండరాల నొప్పులు మాయం అవుతాయి.
చర్మం, జుట్టు, నాడీ వ్యవస్థ, జీర్ణక్రియకు...
బోటీ తినడంవల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే నేచురల్ ఫైబర్ మలబద్దకం వంటి సమస్యల నుండి పరిష్కారం కల్పిస్తుంది.
బోటీలో ఉండే విటమిన్ B12 నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇదే విటమిన్ చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది... అంటే అందంగా కనిపించడానికి కూడా బోటీ ఉపయోగపడుతుంది. అలాగే మనిషికి కావాల్సిన శక్తిని ఇస్తుంది.
బరువు తగ్గడానికి..
బోటీ బరువు కూడా తగ్గిస్తుందట. ఇది తక్కువగా తిన్నా కడుపు నిండుగా ఉంటుంది... ఇదే సమయంలో అన్ని పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. కాబట్టి తక్కువ ఆహారం తినడంవల్ల బరువు తగ్గే అవకాశాలుంటాయి... ఆరోగ్యం కూడా బాగుంటుంది.

