MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Ugadi Special Dishes: ఉగాది పండక్కి ఈ వంటలు మీ ఇంట్లో చేస్తారా!

Ugadi Special Dishes: ఉగాది పండక్కి ఈ వంటలు మీ ఇంట్లో చేస్తారా!

Ugadi Special Dishes: తెలుగు వారి ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. కొత్త సంవత్సరానికి శ్రీకారం కూడా. ఈ ఉగాది పర్వదినాన ఇంటింటా సంప్రదాయ వంటకాల సందడి కనిపిస్తుంది. ఈ రోజు చేసే కొన్ని ప్రత్యేక వంటకాలు పండుగకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 13 2026, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉగాది పచ్చడి
Image Credit : our own

ఉగాది పచ్చడి

మొట్టమొదటి స్పెషల్, ఉగాది పండుగకు అర్థం తీసుకొచ్చే ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం. వేపపువ్వు, బెల్లం, చింతపండు, మామిడి ముక్కలు, కారం, ఉప్పు కలిపి చేసే ఈ పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. జీవితం కూడా సుఖం, దుఃఖం, కోపం, భయం, ఆనందం వంటి అనుభవాలతో నిండి ఉంటుందని సూచిస్తుంది. అందుకే ఉగాది రోజు ప్రతి ఇంట్లో ఈ పచ్చడిని తప్పకుండా తయారు చేస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బొబ్బట్లు, పాయసం
Image Credit : Getty

బొబ్బట్లు, పాయసం

రెండోది బొబ్బట్లు, ఒక్కచోట దీన్ని ఓలిగలు, పోలీలు, భక్ష్యాలు అంటారు. పేరు ఏదైనా రుచి మాత్రం ఆహా అద్భుతహః. నెయ్యితో చేసే ఈ బొబ్బట్లు నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి. పండుగ రోజు కుటుంబసభ్యులందరూ కలిసి ఆస్వాదించే వంటకం. వేడివేడిగా ఒకరు వేస్తుంటే..మరొకరు పక్కనుంచే లాగించేస్తుంటారు. అంత రుచింగా ఉంటుంది.

పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో పరమాన్నం చేస్తారు. పండుగలో తప్పనిసరిగా ఉండాల్సిందే. దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు. తీపి రుచితో ఈ వంటకం పండుగకు మరింత ఆనందాన్ని జోడిస్తుంది.

35
పులిహోర
Image Credit : our own

పులిహోర

ఇక పులిహోర. ఏ పండుగైనా సరే నేనున్నా అని ముందుంటుంది. నిమ్మకాయ, చింతపండుతో చేస్తారు. పూజల సమయంలో దీన్ని నేవేద్యంగా పెడతారు. పండుగరోజు అంతా ఓచోట చేరి ఆరగిస్తారు. కోవెలల్లో కూడా ఇది మహాప్రసాదంగా పెడతారు. ఈ పులిహోర చేయడంతో ఒక్కొక్కరి చేతి రుచి ఒక్కోలా ఉంటుంది.

45
మామిడికాయ పప్పు.
Image Credit : Getty

మామిడికాయ పప్పు.

ఉగాది అంటే మామిడికాయల సందడి. వాటితో చేసే మామిడి పప్పు ఉగాది పండుగలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే...ఆ కమ్మని రుచికి నోట్లో నుంచి నీళ్లు రావాల్సిందే. 

55
గారెలు
Image Credit : our own

గారెలు

మినపప్పుతో చేసే గారెలు కూడా ఉగాది రోజు ఎక్కువగా తయారు చేస్తారు. బయటకు క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ గారెలు పండుగ భోజనంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

ఉగాది పండుగంటే కొత్త ఏడాదికి ఆరంభం మాత్రమే కాదు...సంప్రదాయాలు, రుచులు, కుటుంబ బంధాల పండు. ఈ ఉగాది రోజున ఈ స్పెషల్ వంటకాలను చేసి కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తే పండుగ ఆనందం మరింత పెరుగుతుంది. మరి ఈ ఉగాదికి మీ ఇంట్లో ఈ వంటలు చేస్తున్నారా? 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఉగాది
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Ugadi 2026: పరాభవనామ ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే శుభమో తెలుసా?
Recommended image2
Ugadi Beauty Tip: ఉగాది రోజు స్పెషల్ గా కనిపించాలా? ఇదొక్కటి ముఖానికి రాస్తే చాలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved