Telugu

Idli: తెల్లటి ఇడ్లీ కాదు.. హెల్దీగా పాలకూర ఇడ్లీ, ఎలా చేయాలో తెలుసా?

Telugu

పాలకూర ఇడ్లీ తయారీకి కావాల్సినవి..

ఈ పాలకూర ఇడ్లీ తయారీకి 1 కప్పు రవ్వ, తాజా పాలకూర ప్యూరీ, పెరుగు, ఉప్పు, అల్లం, పచ్చి మిర్చీపేస్టు , 1 చెంచా ఈనో 

Image credits: Facebook
Telugu

ఇడ్లీ తయారీ చేసే విధానం..

ముందుగా ఒక పాన్‌లో రవ్వను మాడిపోకుండా, రంగు మారకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించిన రవ్వతో ఇడ్లీలు మృదువుగా వస్తాయి.

Image credits: Facebook
Telugu

పిండిని సిద్ధం చేసుకోండి

వేయించిన రవ్వలో పాలకూర ప్యూరీ, పెరుగు, ఉప్పు, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు నాననివ్వాలి.

Image credits: Facebook
Telugu

ఆవిరిపై ఉడికించాలి

పిండి నానిన తర్వాత, అందులో ఈనో (Eno) వేసి కలపాలి. నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లలో పిండిని వేసి, 15-20 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికిస్తే.. వేడివేడి పాలక్ రవ్వ ఇడ్లీ రెడీ!

Image credits: Facebook

Green Chillies: పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!

Bitter Gourd: కాకరకాయతో ఈ 7 లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!

Cucumber: కీరదోస తొక్కతో సహా తింటే ఏమౌతుంది?

Soft Chapati: పిండిలో ఇదొక్కటి కలిపితే.. చపాతీలు మెత్తగా వస్తాయి