Mutton Lovers Psychology: మటన్ ఎక్కువగా తినేవారి గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా?
చాలామంది మటన్ ని ఇష్టంగా తింటుంటారు. కొందరు వారానికి 1, 2 సార్లు తింటే.. మరికొందరికి రోజూ తిన్నా మటన్ మీద ఇష్టం తగ్గదు. మనం తినే ఫుడ్, శరీరంపైనే కాదు చాలా అంశాలపై ప్రభావం చూపుతుందని చెప్తోంది సైకాలజీ. మరి మటన్ లవర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూద్దామా..

Mutton Lovers Psychology
సైకాలజీ ప్రకారం ఆహారం కేవలం శరీర పోషణకే కాదు.. మన మనస్తత్వం, అలవాట్లు, భావోద్వేగాలు, సామాజిక ప్రవర్తనతో కూడా బలమైన సంబంధం కలిగి ఉంటుంది. మటన్ లేదా చికెన్ ఎక్కువగా తినేవారిలో కనిపించే కొన్ని ప్రత్యేకమైన లక్షణాల గురించి సైకాలజీ విశ్లేషణలు ఏం చెబుతున్నాయో ఇక్కడ చూద్దాం.
ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల..
సైకాలజీ ప్రకారం మాంసాహారం తినేవారు శక్తి, తృప్తి, సంతృప్తి భావాలు ఎక్కువగా అనుభూతి చెందే అవకాశం ఉంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం.. మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి ఫీల్ గుడ్ రసాయనాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్, మటన్ తిన్న తర్వాత కొందరికి ఉత్సాహం, ఫోకస్, పెరిగినట్లు అనిపించవచ్చు. ఈ కారణంగా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునేవారు తమను తాము ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా భావించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రాక్టికల్ ఆలోచనా విధానం..
అంతేకాదు నాన్ వెజ్ ఎక్కువగా తినేవారిలో ప్రాక్టికల్ ఆలోచనా విధానం కనిపించవచ్చు. వారు పరిస్థితులను భావోద్వేగాల కన్నా వాస్తవికంగా చూసే అలవాటు కలిగి ఉండవచ్చని సైకాలజీ విశ్లేషణలు చెబుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జీవన శైలి కూడా నాన్ వెజ్ పై ఇష్టం పెరిగేలా చేస్తుందని సైకాలజీ చెప్తోంది. శారీరకంగా కష్టపడి పనులు చేసే వారు లేదా స్పోర్ట్స్‌లో చురుకుగా ఉండేవారికి సాధారణంగా ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
అది కరెక్ట్ కాదు..
సైకాలజీ ప్రకారం చికెన్ లేదా మటన్ ఎక్కువగా తినేవారిని అగ్రెసివ్‌గా లేదా హింసాత్మకంగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. ఆహారం ఒక్కటే మనిషి ప్రవర్తనను నిర్ణయించదు. కుటుంబ వాతావరణం, పెంపకం, సమాజం, ఒత్తిడి స్థాయి, వ్యక్తిగత అనుభవాలు వంటివి మనిషి స్వభావాన్ని నిర్మిస్తాయి. మాంసాహారం తినేవాళ్లు కూడా సున్నితమైన మనస్తత్వం, దయ, సానుభూతి కలిగి ఉండవచ్చు. అదే విధంగా పూర్తిగా శాకాహారం తినేవారిలో కూడా కోపం లేదా కఠినత్వం ఉండవచ్చు.
ఎమోషనల్ ఈటింగ్
సైకాలజీ నిపుణుల ప్రకారం కొంతమంది స్ట్రెస్, ఆందోళన లేదా బాధలో ఉన్నప్పుడు చికెన్, మటన్ వంటి ఫుడ్స్ వైపు ఆకర్షితులవుతారు. ఇవి తిన్నప్పుడు తాత్కాలికంగా మానసిక సాంత్వన లభిస్తుంది. అయితే ఇదే అలవాటుగా మారితే మాత్రం దీర్ఘకాలంలో సమస్యలు తప్పవని నిపుణలు సూచిస్తున్నారు.
సైకాలజీ ప్రకారం.. అదే ముఖ్యం
"నాన్ వెజ్ తింటే ఇలా ఉంటారు, వెజ్ తింటే అలా ఉంటారు” అనే మాటలు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడంలో అడ్డంకిగా మారుతాయి. సమతుల్య ఆహారం, శరీర అవసరాలకు తగిన పోషకాలు, అలాగే మనసుకు అవసరమైన ప్రశాంతత వంటివి ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. చికెన్, మటన్ తినడం తప్పు కాదు. అలాగే వాటిని తినకపోవడం గొప్పతనం కాదు. ఆహారంతో పాటు మన ఆలోచనలు, భావోద్వేగాలు, జీవనశైలిని ఎంత సమతులంగా నిర్వహిస్తున్నామన్నదే ముఖ్యమని సైకాలజీ స్పష్టం చేస్తోంది.

