MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Bad Breath: ఈ డ్రింక్ తాగితే నోరు దుర్వాసన రాదు..!

Bad Breath: ఈ డ్రింక్ తాగితే నోరు దుర్వాసన రాదు..!

లవంగాలలో క్రిమి నాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.రోజూ ఈ టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, నోటి దుర్వాసన సమస్య అనేదే ఉండదు. 

3 Min read
Author : ramya Sridhar
Published : May 27 2025, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నోటి దుర్వాసనకు చెక్ పెట్టేదెలా?
Image Credit : our own

నోటి దుర్వాసనకు చెక్ పెట్టేదెలా?

ఈ రోజుల్లో నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. రోజుకి రెండు సార్లు బ్రష్ చేసినా, మార్కెట్లో దొరికే మౌత్ ఫ్రెషనర్ వాడినా కూడా చాలా మందికి ఈ సమస్య తగ్గదు. ఈ సమస్య ఉన్నవారు ఇతరులతో మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు. ఒకవేళ మాట్లాడినా.. వారి నోటి నుంచి వచ్చే దుర్వాసన ఇతరులకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? అయితే.. దీనికి పరిష్కారం మీ ఇంట్లో కిచెన్ లోనే ఉంది. మీరు చదివింది నిజమే.. మార్కెట్లో దొరికే హెర్బల్ డ్రింక్స్ అవసరం లేకుండా.. ఇంట్లోనే ఒక హెర్బల్ డ్రింక్ తయారు చేసుకొని రోజూ తాగితే.. ఈ నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. వరసగా 10 రోజులు ఈ డ్రింక్ తాగితే.. మీ నోరు ఫ్రెష్ గా మారిపోతుంది. మరి, ఆ డ్రింక్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిల్క్ టీ కి బదులు లవంగం టీ
Image Credit : Getty

మిల్క్ టీ కి బదులు లవంగం టీ

ప్రతి ఒక్కరి కిచెన్ లో లవంగాలు ఉంటాయి. ఈ లవంగాలను మనం కొన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తాం. ఇదే లవంగం మన నోటి దుర్వాసన సమస్యను తగ్గిస్తుందని మీకు తెలుసా? ప్రతిరోజూ ఉదయాన్నే చాలా మంది వేడి వేడిగా టీ తాగుతూ ఉంటారు. అయితే.. నార్మల్ టీకి బదులుగా ఈ లవంగం టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ లవంగం టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. లవంగాలలో క్రిమి నాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.రోజూ ఈ టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, నోటి దుర్వాసన సమస్య అనేదే ఉండదు.

Related Articles

Related image1
Hair Care: ఇవి రాస్తే, 15రోజుల్లో ఊడిన జుట్టు మళ్లీ పెరుగుతుంది..!
Related image2
Health: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే!
36
లవంగం టీ తో ప్రయోజనాలు
Image Credit : Getty

లవంగం టీ తో ప్రయోజనాలు

ప్రస్తుత కాలంలో దాదాపు అందరూ ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగా జీర్ణవ్యవస్థలోని సమస్యలు , పేగు పూత, కడుపు పూత సమస్యలు మాత్రమే కాకుండా, నోటి దుర్వాసన కూడా కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. మనం రోజుకు రెండుసార్లు, ఉదయం సాయంత్రం పళ్ళు తోముకున్నప్పటికీ ఈ సమస్య తగ్గదు. మరి, లవంగాల టీ ఎలా తాగితే నోటి దుర్వాసన తగ్గుతుందో తెలుసుకుందాం..

46
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది
Image Credit : Getty

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది

లవంగా టీలోని యాంటీఆక్సిడెంట్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, మీరు సాధారణ ఇన్ఫెక్షన్లు, జలుబు , ఫ్లూ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులలో, ఈ టీ సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది.

జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది

మీకు గ్యాస్, అజీర్ణం లేదా ఎసిడిటీ వంటి సమస్యలు ఉంటే, లవంగం టీ ఒక అద్భుతమైన నివారణగా ఉంటుంది. ఈ టీ కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. భోజనం తర్వాత దీనిని తాగడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

56
దుర్వాసన, దంత సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది
Image Credit : Getty

దుర్వాసన, దంత సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది

రాత్రిపూట బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల ఉదయం నిద్రలేచినప్పుడు నోటి దుర్వాసన వస్తుంది. ఇది చాలా కామన్. కానీ కొంతమందికి నిరంతర దుర్వాసన ఉంటుంది. బ్రష్ చేసినా నోటి దుర్వాసన వస్తుంది అంటే అది చాలా ఇబ్బందికరమైన సమస్య. దుర్వాసన లేదా హాలిటోసిస్ అనేది నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల వస్తుంది, ఇది దుర్వాసన కలిగించే వాయువులను ఉత్పత్తి చేస్తుంది. మనం తినే ఆహారాలలోని చక్కెరలు,పిండి పదార్ధాలను బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేసినప్పుడు దుర్వాసన సాధారణంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో, ఇది చిగుళ్ల వ్యాధి లేదా దంత క్షయం వంటి తీవ్రమైన దంత సమస్యలను కూడా సూచిస్తుంది. దుర్వాసనను వదిలించుకోవడానికి లవంగం టీ తాగితే సరిపోతుంది.

66
లవంగం టీ ఎలా తయారు చేయాలి?
Image Credit : Getty

లవంగం టీ ఎలా తయారు చేయాలి?

ముందుగా, 1 టేబుల్ స్పూన్ లవంగాలను తీసుకొని మెత్తగా పొడి చేయండి.ఒక గిన్నెలో 1 కప్పు నీరు పోసి, దానికి లవంగం పొడి వేసి బాగా కలపండి.లవంగాల పొడి కలిపిన నీటిని సుమారు 3 నుండి 4 నిమిషాలు బాగా మరిగించనివ్వండి.తర్వాత దానిని వడకట్టి వేడిగా త్రాగండి. కావాలంటే ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు. వరసగా పది రోజులు తాగితే, మీ నోటి దుర్వాసన సమస్య పూర్తిగా తగ్గుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Hair Care: ఇవి రాస్తే, 15రోజుల్లో ఊడిన జుట్టు మళ్లీ పెరుగుతుంది..!
Recommended image2
Health: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved