MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • Hair Care: ఇవి రాస్తే, 15రోజుల్లో ఊడిన జుట్టు మళ్లీ పెరుగుతుంది..!

Hair Care: ఇవి రాస్తే, 15రోజుల్లో ఊడిన జుట్టు మళ్లీ పెరుగుతుంది..!

జుట్టు రాలడం ఆగాలంటే కెమికల్స్ ఉండే షాంపూలు, నూనెలు మాత్రమే వాడాలి అనే అభిప్రాయం ఉంటుంది. అవి వాడితేనే..జుట్టు రాలడం ఆగుతుంది అని అనుకుంటూ ఉంటారు.

3 Min read
Author : ramya Sridhar
Published : May 26 2025, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
జుట్టు బాగా రాలుతోందా?
Image Credit : Getty

జుట్టు బాగా రాలుతోందా?

ఈ రోజుల్లో దాదాపు అందరూ జుట్టు రాలే సమస్యతో బాధపడేవారే. కుప్పలు తెప్పలుగా జుట్టు ఊడిపోతుందని, ఖరీదైన నూనెలు, షాంపూలు వాడినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని చాలా మంది ఫీలౌతుంటారు.మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీ సమస్యకు పరిష్కారం మీ ఇంట్లోనే ఉంది. మీరు చదివింది నిజమే, మీ ఇంట్లో, మీ కిచెన్ లో ఉండే కొన్ని వస్తువులను వాడితే రాలిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది. అంతేకాదు.. మళ్లీ జుట్టు రాలుతుందనే భయం కూడా అక్కర్లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జుట్టు రాలడం తగ్గాలంటే...
Image Credit : freepik

జుట్టు రాలడం తగ్గాలంటే...

జుట్టు రాలడం ఆగాలంటే కెమికల్స్ ఉండే షాంపూలు, నూనెలు మాత్రమే వాడాలి అనే అభిప్రాయం ఉంటుంది. అవి వాడితేనే..జుట్టు రాలడం ఆగుతుంది అని అనుకుంటూ ఉంటారు. కొన్నింటిని వాడటం వల్ల నిజంగానే జుట్టు రాలడం ఆగొచ్చు. కానీ, మళ్లీ కొత్త వెంట్రుకలు వస్తాయి అనే గ్యారెంటీ ఇవ్వలేం. అయితే.. మన ఇంటి ఉత్పత్తులు వాడితే కచ్చితంగా మళ్లీ జుట్టు పెరగడం మొదలౌతుంది.మరి, అవేంటో తెలుసుకుందామా..

Related Articles

Related image1
Hair Care: మెంతుల్లో ఇదొక్కటి కలిపి రాస్తే, జుట్టు పొడుగ్గా పెరుగుతుంది..!
Related image2
Skin Care: పెరుగులో ఇవి కలిపి రాస్తే.. ఎండలో తిరిగినా ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
37
1.ఉల్లిరసం..
Image Credit : Getty

1.ఉల్లిరసం..

ఉల్లిరసం జుట్టు పెరుగుదలలో మనకు చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది.ఈ ఉల్లి రసాన్ని తలకు మంచిగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. దీని కోసం మీరు ఉల్లిపాయలను ఎంచుకొని, దానిని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వడకట్టి.. వచ్చిన రసాన్ని తలకు బాగా పట్టించి కనీసం 15 నిమిషాల పాటుు మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

47
2.గోరు వెచ్చని కొబ్బరినూనె..
Image Credit : Google

2.గోరు వెచ్చని కొబ్బరినూనె..

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కొబ్బరి నూనె సహజ చికిత్సగా పనిచేస్తుంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పోషకమైన మొలాసిస్ ఉంటాయి. ఇవి మన తల, జుట్టును ఆరోగ్యంగా చేస్తాయి. దీన్ని ఉపయోగించడానికి,ముందుగా, ఒక గిన్నె కొబ్బరి నూనెను గ్యాస్ మీద వేడి చేయండి. మరీ ఎక్కువగా వేడి చేయకూడదు.లైట్ గా వేడి చేయాలి. ఆ నూనెలో చేతులు పెడితే మన చెయ్యి కాలకూడదు. ఒకవేళ కాస్త ఎక్కువగా వేడి చేసినా... అది నార్మల్ వేడికి వచ్చేంత వరకు ఆగి.. దానితో తలకు మసాజ్ చేయాలి. కనీసం 30 నిమిషాలు అయినా మసాజ్ చేయాలి. తర్వాత తలస్నానం చేయవచ్చు. వారానికి రెండు సార్లు ఇలా చేసినా మీ జుట్టు మంచిగా మెరుస్తుంది. జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది.

57
3.కలబంద జెల్
Image Credit : our own

3.కలబంద జెల్

కలబంద జెల్ అనేది చర్మం నుండి జుట్టు వరకు ప్రతిదానికీ ప్రయోజనకరంగా ఉండే ఒక పదార్థం. ఇందులో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, చుండ్రును తగ్గించడానికి, తలపై చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పనిచేసే ఎంజైమ్‌లు ఉంటాయి.మీరు చేయాల్సిందల్లా 1-2 టీస్పూన్ల కలబంద జెల్‌ను మీ జుట్టు, తలపై చర్మానికి అప్లై చేసి, బాగా మసాజ్ చేసి, 30 నిమిషాలు ఆరనివ్వండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల మీ జుట్టు బలంగా, మందంగా పెరుగుతుంది.

67
 మెంతులు
Image Credit : Getty

మెంతులు

మెంతుల్లో ప్రోటీన్, ఐరన్ , నికోటినిక్ పుష్కలంగా ఉండటం వల్ల వాటిని అద్భుతమైన హెయిర్ టానిక్‌గా పరిగణిస్తారు. ఈ లక్షణాలన్నీ జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడంలో, మూలాలను బలోపేతం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.మీ జుట్టుకు మెంతులను అప్లై చేయడానికి, ముందుగా 2 టీస్పూన్ల మెంతులను ముందు రోజు రాత్రి ఒక గిన్నె నీటిలో నానబెట్టండి.

ఉదయం నిద్ర లేవగానే, ఒక పేస్ట్ తయారు చేసుకుని, దానిని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే, ఫలితం మీకే కనపడుతుంది.

77
ఆలివ్ ఆయిల్
Image Credit : Getty

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌లో ఒలీక్ యాసిడ్ ఉంటుంది, ఇది జుట్టును మృదువుగా , మెరిసేలా చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా 4-5 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా వేడి చేసి, ఆపై మీ జుట్టును 5-10 నిమిషాలు మసాజ్ చేయండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం ద్వారా, మీరు మీ జుట్టు కుదుళ్లు బలపడి, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Hair Care: మెంతుల్లో ఇదొక్కటి కలిపి రాస్తే, జుట్టు పొడుగ్గా పెరుగుతుంది..!
Recommended image2
Skin Care: పెరుగులో ఇవి కలిపి రాస్తే.. ఎండలో తిరిగినా ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved