MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Mutton: మటన్ కర్రీ జ్యూసీగా , రుచిగా రావాలా? ఇదొక్కటి వేస్తే చాలు

Mutton: మటన్ కర్రీ జ్యూసీగా , రుచిగా రావాలా? ఇదొక్కటి వేస్తే చాలు

Mutton: ఇంట్లో మటన్ వండినప్పుడు.. సరిగా ఉడకలేదని, కూర లేతగా లేదని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. మటన్ మృదువుగా, జ్యూసీగా ఉడుకుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 10 2026, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మటన్ కర్రీ..
Image Credit : Getty

మటన్ కర్రీ..

నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే ఒక ఎమోషన్. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ మటన్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే… మటన్ తో వచ్చిన సమస్య ఏమిటంటే.. తొందరగా ఉడకదు. ఉడకడానికి చాలా సమయం పడుతుంది. కుక్కర్ లో పెట్టి ఉడికించినా కూడా ఒక్కోసారి సరిగా ఉడకదు. దీంతో కూర రుచి ఉండదు. అలా జరగకుండా.. కూర ఎప్పుడు వండినా.. రుచిలో అద్భుతంగా ఉండటంతో పాటు.. ముక్క మెత్తగా, జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా చేయచ్చు. దీని కోసం ఒకే ఒక్క సింపుల్ చిట్కా వాడితే సరిపోతుంది.

24
ఇదొక్కటి చేర్చితే చాలు....
Image Credit : Getty

ఇదొక్కటి చేర్చితే చాలు....

కూర వండటానికి ముందు.. మటన్ లో పచ్చి బొప్పాయిని చేర్చితే సరిపోతుంది.  పచ్చి బొప్పాయిలో.. పపైన్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది మటన్ లోని ఫైబర్ ని విడగొట్టి, మాంసం త్వరగా ఉడికేలా చేస్తుంది. దాంతో మటన్ మెత్తగా, జ్యూసీగా తయారౌతుంది.

పచ్చి బొప్పాయి ఎలా చేర్చాలి..?

పచ్చి బొప్పాయితో మటన్‌ లో చేర్చడానికి  ముందుగా బొప్పాయి తొక్క తీసి తురమాలి లేదా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఒక కిలో మటన్‌కు ఒకటి లేదా ఒకటిన్నర చెంచాల బొప్పాయి పేస్ట్ సరిపోతుంది. ఒక గిన్నెలో మటన్ తీసుకుని, దానికి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, బొప్పాయి పేస్ట్ వేసి బాగా కలపాలి.

Related Articles

Related image1
Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు
Related image2
Chanakya Niti: ‘అతి వినయం ధూర్త లక్షణం’కి అర్థమేంటి? చాణక్యుడు ఏం చెప్పాడు..?
34
మటన్‌ను ఎంతసేపు మేరినేట్ చేయాలి?
Image Credit : Getty

మటన్‌ను ఎంతసేపు మేరినేట్ చేయాలి?

మటన్‌ను కనీసం అరగంట నుంచి గంటసేపు మేరినేట్ చేయాలి. దీనివల్ల మసాలాలు ముక్కలకు బాగా పట్టి, బొప్పాయి పేస్ట్ వల్ల మటన్ మెత్తగా, జ్యూసీగా మారుతుంది. ఇలా మేరినేట్ చేసిన మటన్‌తో మీరు కర్రీ, కుర్మా, ఫ్రై లేదా బిర్యానీ చేసుకోవచ్చు.

44
మటన్‌ను మేరినేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
Image Credit : Getty

మటన్‌ను మేరినేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చి బొప్పాయితో మటన్‌ను మేరినేట్ చేయడం వల్ల అది త్వరగా ఉడుకుతుంది. కుక్కర్‌లో వండితే తక్కువ విజిల్స్ సరిపోతాయి. మాంసం జ్యూసీగా, మెత్తగా ఉంటుంది. రుచిలో ఎలాంటి చేదు ఉండదు. రెస్టారెంట్‌లో తిన్న అనుభూతి కలుగుతుంది. మటన్ మేరినేషన్ కోసం ఎప్పుడూ పచ్చి బొప్పాయి మాత్రమే వాడాలి. బొప్పాయి పేస్ట్ ఎక్కువగా వేయొద్దు, లేదంటే మటన్ ముక్కలు విరిగిపోతాయి. గంటకు మించి ఎక్కువసేపు నానబెట్టవద్దు. ఫ్రోజెన్ మటన్‌కు కూడా ఈ చిట్కాను ప్రయత్నించవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Recommended image2
Oats benefits: వారంలో రెండుసార్లు ఓట్స్ తిని చూడండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులివే
Recommended image3
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు
Recommended image2
Chanakya Niti: ‘అతి వినయం ధూర్త లక్షణం’కి అర్థమేంటి? చాణక్యుడు ఏం చెప్పాడు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved