MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశ క్రిస్పీగా , టేస్టీగా రావాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు

Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశ క్రిస్పీగా , టేస్టీగా రావాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు

Crispy Dosa: దక్షిణ భారతదేశంలో దోశ చాలా ఫేమస్ టిఫిన్. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు, పూర్తి భోజనంగా కూడా తింటారు. కానీ ఇంట్లో చేసుకునేప్పుడు హోటల్ మాదిరి క్రిస్పీ దోశలు రావు. కరకరలాడే దోశ కావాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయిపోండి.

2 Min read
Author : Nandini Arava
Published : Feb 27 2026, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ 5 తప్పులు చేయొద్దు
Image Credit : Getty

ఈ 5 తప్పులు చేయొద్దు

రుచికరమైన, కరకరలాడే దోశను బియ్యం, మినపప్పు పిండితో చేస్తారు. ఇప్పుడు దోశల్లో చాలా రకాలు వచ్చేశాయి. అందుకే చాలామంది ఇంట్లోనే చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ, హోటల్‌లో లాగా క్రిస్పీగా, గోల్డెన్ కలర్‌లో రావు. దీనికి మనం చేసే కొన్ని తప్పులే కారణమని చెఫ్ సంజీవ్ కపూర్ అంటున్నారు. 

26
1. పిండి పులిస్తేనే దోశ పర్ఫెక్ట్
Image Credit : Getty

1. పిండి పులిస్తేనే దోశ పర్ఫెక్ట్

దోశ అసలు సీక్రెట్ పిండిలోనే ఉందని చెఫ్ సంజీవ్ కపూర్ అంటున్నారు. చాలామంది పిండిని సరిగ్గా పులియబెట్టరు (Ferment) లేదా మరీ ఎక్కువగా పులియబెట్టేస్తారు. తక్కువ పులిస్తే దోశ గట్టిగా వస్తుంది. ఎక్కువ పులిస్తే దోశ పుల్లగా అవుతుంది, టెక్స్‌చర్ పాడవుతుంది. పిండి తేలికగా, నురగగా కనిపించాలి. వాతావరణాన్ని బట్టి 8 నుంచి 12 గంటల పాటు పిండిని పులియబెట్టడం మంచిది.

Related Articles

Related image1
Dosa Batter Storage tips: ఫ్రిజ్ లేకపోయినా దోశ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
Related image2
Dosa Tips: దోశ పెనం కి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
36
2. పెనం వేడి సరిగ్గా ఉండాలి
Image Credit : Getty

2. పెనం వేడి సరిగ్గా ఉండాలి

చాలామంది కంగారులో పెనం సరిగ్గా వేడెక్కకముందే దోశ పిండి వేసేస్తారు. పెనం మరీ వేడిగా ఉంటే పిండి సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు. పెనం చల్లగా ఉంటే దోశ పెనానికి అంటుకుపోతుంది. పెనం మీడియం వేడి మీద ఉండాలి. టెస్ట్ చేయడానికి కొన్ని నీళ్లు చిలకరించండి. నీటి చుక్కలు వెంటనే ఆవిరైపోతే, పెనం సరైన వేడితో ఉన్నట్టు. ప్రతి దోశ వేసే ముందు కొద్దిగా నూనె రాసి, గుడ్డతో లేదా సగం ఉల్లిపాయతో పెనాన్ని తుడవాలి.

46
3. పిండి కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం
Image Credit : Getty

3. పిండి కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం

పిండి కన్సిస్టెన్సీ సరిగ్గా లేకపోయినా దోశలు సరిగ్గా రావు. గట్టిగా ఉంటే దోశ మందంగా వస్తుంది. మరీ పల్చగా ఉంటే దోశ వేస్తుండగానే విరిగిపోతుంది. గరిటెతో పిండిని కిందకు జార్చినప్పుడు, అది సన్నని ధారలా పడాలి. పిండి గట్టిగా అనిపిస్తే, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ సరైన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి.

56
4. దోశను స్ప్రెడ్ చేసే పద్ధతి
Image Credit : Getty

4. దోశను స్ప్రెడ్ చేసే పద్ధతి

చాలామంది పిండి వేసి మళ్లీ మళ్లీ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల దోశ పైభాగం పాడవుతుంది, జాలీలాగా (రంధ్రాల్లాగా) రాదు. పిండిని పెనం మధ్యలో వేసి, తేలికపాటి చేతులతో ఒకే డైరెక్షన్‌లో గుండ్రంగా తిప్పాలి. ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దు. చేతిని ఎంత తేలికగా వాడితే, దోశ అంత పల్చగా, క్రిస్పీగా వస్తుంది.

66
5. నూనె లేదా నెయ్యి వాడకంలో తప్పు
Image Credit : Getty

5. నూనె లేదా నెయ్యి వాడకంలో తప్పు

కొంతమంది దోశ వేసిన వెంటనే ఎక్కువ నూనె వేసేస్తారు. దీనివల్ల దోశ నూనెలో వేయించినట్టు కనిపిస్తుంది కానీ, క్రిస్పీగా మారదు. దోశ కొద్దిగా పొడిగా అవ్వడం మొదలయ్యాక, దాని అంచులపై, పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయాలి. దీనివల్ల అంచులు వాటంతట అవే పైకి లేస్తాయి, దోశ మంచి గోల్డెన్ కలర్‌లోకి మారుతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Recommended image2
Summer Health Tips: ఎండాకాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన 5 రకాల ఫుడ్స్ ఇవే!
Recommended image3
Dosa: దోశకు పప్పు, బియ్యం ఇలా రుబ్బుతున్నారా? మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే
Related Stories
Recommended image1
Dosa Batter Storage tips: ఫ్రిజ్ లేకపోయినా దోశ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
Recommended image2
Dosa Tips: దోశ పెనం కి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved