MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Curd: వేసవిలో పెరుగు పుల్లగా మారుతోందా? ఈ చిట్కాతో వారం రోజులైనా తియ్యగా ఉంటుంది

Curd: వేసవిలో పెరుగు పుల్లగా మారుతోందా? ఈ చిట్కాతో వారం రోజులైనా తియ్యగా ఉంటుంది

Curd:  ఎండాకాలంలో పెరుగు తొందరగా పులుస్తుంది. పుల్లగా మారిన పెరుగు తినాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. వారం రోజులు అయినా పెరుగు తాజాగా ఉంటుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 26 2026, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తియ్యటి పెరుగు..
Image Credit : chatgpt.com

తియ్యటి పెరుగు..

ఎండాకాలం వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండాకాలం పెరుగు తొందరగా పుల్లగా మారుతుంది. ఒక్క రోజు కూడా తియ్యగా ఉండటం లేదని.. పెరుగు తినడం మానేస్తూ ఉంటారు చాలా మంది. కానీ.. ఈ ఎండాకాలంలో పెరుగు తినకపోతే శరీరం వేడి చేస్తుంది. మరి, అలా కాకుండా.. మనం ఫ్రిజ్ లో పెట్టకపోయినా.. వారం రోజులైనా పెరుగు తియ్యగా ఉండేలా చేసుకోవచ్చు.  అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉల్లిపాయ..
Image Credit : Getty

ఉల్లిపాయ..

మన దగ్గర ఉల్లిపాయ ఉంటే చాలు.. పెరుగు తియ్యగా మార్చుకోవచ్చు. దీనిని మన పూర్వీకులు వాడిన అద్భుతమైన చిట్కా. పెరుగు గడ్డకట్టిన తర్వాత.. అందులో పొట్టు తీసిన రెండు లేదా మూడు ఉల్లిపాయలు వేయాలి. ఇలా చేయడం వల్ల.. పెరుగులోని పులుపును ఆ ఉల్లిపాయలు పీల్చుకుంటాయి. దీని వల్ల పెరుగు తియ్యగా ఉంటుంది. పులుపు తెలీదు. తాజాగా కూడా ఉంటుంది.

34
ఈ టెక్నీక్ కూడా వాడొచ్చు..
Image Credit : Getty

ఈ టెక్నీక్ కూడా వాడొచ్చు..

పెరుగులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల కూడా అది త్వరగా పులుస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి, పెరుగులోని నీటిని పూర్తిగా తీసేయాలి. దీనికోసం, ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌లో పెరుగు వేసి నీటిని వడకట్టాలి. కాసేపు దాన్ని వేలాడదీస్తే, అదనపు నీరంతా పోతుంది. ఇప్పుడు మిగిలిన గట్టి పెరుగును గాలి చొరబడని (Air-tight) డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. నీరు లేకపోవడం వల్ల కిణ్వ ప్రక్రియ (fermentation) ఆగిపోతుంది. పెరుగు కనీసం వారం రోజుల పాటు తియ్యగా ఉంటుంది.
44
బెస్ట్ చిట్కా...
Image Credit : chatgpt.com

బెస్ట్ చిట్కా...

పెరుగు తీసేటప్పుడు ఎప్పుడూ పొడి స్పూన్‌నే వాడాలి. తడి స్పూన్ వాడితే బ్యాక్టీరియా పెరిగి పెరుగు త్వరగా పాడవుతుంది. అలాగే, గిన్నె మొత్తాన్ని కలపకుండా, కావాల్సినంత వరకే తీసుకోండి. పదేపదే కలపడం వల్ల నీరు ఊరి పులుస్తుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఊరగాయ వంటి ఘాటైన వాసన ఉండే పదార్థాలకు పెరుగును దూరంగా ఉంచితే, దాని అసలు రుచి మారకుండా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Kitchen Hacks: వెల్లుల్లి తొక్క తీయడం కష్టంగా ఉందా? ఈ చిట్కా వాడితే.. చాలా సింపుల్..!
Recommended image2
Soft Roti: పిండి ఇలా కలిపితే... చపాతీలు మెత్తగా వస్తాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved