MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Ginger: ప్రతిరోజూ పరగడుపున పచ్చి అల్లం తింటే ఏమౌతుంది?

Ginger: ప్రతిరోజూ పరగడుపున పచ్చి అల్లం తింటే ఏమౌతుంది?

ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఔషధాలలో అల్లం కూడా ఒకటి. వంట గదిలో సులభంగా లభించే ఈ ఔషధం.. ఆరోగ్యపరంగా మనకు ఎన్నో అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 08 2025, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లం ప్రయోజనాలు..
Image Credit : Getty

అల్లం ప్రయోజనాలు..

నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువ కూర్చొని పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. దీని వల్ల ఉబకాయం, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. చిన్న చిన్న మార్పులతోనే ప్రారంభించాలి. ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఔషధాలలో అల్లం కూడా ఒకటి. వంట గదిలో సులభంగా లభించే ఈ ఔషధం.. ఆరోగ్యపరంగా మనకు ఎన్నో అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా పరగడుపున ఉదయాన్నే పచ్చి అల్లం నమలడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

25
రోగనిరోధక శక్తిని పెంచే అల్లం..
Image Credit : Getty

రోగనిరోధక శక్తిని పెంచే అల్లం..

ప్రముఖ డైటీషియన్, డాక్టర్ భరద్వాజ్, ఆయుర్వేద నిపుణురాలు శ్వేతా తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిన్న అల్లం ముక్క తినడం వల్ల జీర్ణశక్తిని పెంచి, శరీరాన్ని జీవక్రియకు సిద్ధం చేస్తుంది. అల్లం నమలడం వల్ల లాలాజలం, జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అజీర్ణం, వికారం, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

అల్లంలో ఉండే జింజెరోల్, షోగోల్ అనే సమ్మేళనాలు కడుపు నొప్పి, ఉదయం వికారం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లా పనిచేస్తుంది. అంతేకాదు, అల్లం యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో నిండి ఉంటుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Related Articles

Related image1
Iron Rich Food: రక్తం తక్కువగా ఉందా? రోజూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్!
Related image2
Food Tips: ఇలా చేశారంటే..కేవలం 15 నిమిషాల్లో కుక్కర్లో కొబ్బరిపాల అన్నం రెడీ!
35
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే అల్లం..
Image Credit : Pinterest

చెడు కొలెస్ట్రాల్ తగ్గించే అల్లం..

అల్లం శరీరాన్ని డిటాక్స్ చేయడంలోనూ సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమలడం ద్వారా లివర్ పనితీరు మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం, PCOS ఉన్నవారికి అల్లం ఉపశమనం ఇస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

45
అలసటను తగ్గించేస్తుంది..
Image Credit : freepik

అలసటను తగ్గించేస్తుంది..

ఇంకా ముఖ్యంగా, అల్లం మానసిక స్పష్టతను పెంచుతుంది. ఉదయాన్నే దీన్ని తీసుకుంటే అలసట తగ్గి, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. ఇది కెఫిన్ లాంటి తాత్కాలిక శక్తి బూస్టర్లకు బదులుగా సహజ శక్తిని అందిస్తుంది. అల్లం ఆకలి తగ్గించే గుణం కలిగి ఉండడం వలన మధ్యాహ్నం అనవసరమైన చిరుతిండిని నివారించవచ్చు. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడుతుంది.

55
అల్లంని దేనితో కలిపి తీసుకోవాలి?
Image Credit : Getty

అల్లంని దేనితో కలిపి తీసుకోవాలి?

నిపుణుల సలహా ప్రకారం, అల్లం ముక్కను కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు రాక్ సాల్ట్ తో కలిపి నమలితే  జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఉదయాన్నే అల్లం తినడం అనేది చిన్న అలవాటు అయినా… దీని ఫలితాలు చాలా గొప్పవిగా ఉంటాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి అల్లం నమలడం ప్రారంభించండి – మీ ఆరోగ్యం, శక్తి, మానసిక స్పష్టతలో వచ్చే మార్పును మీరు స్వయంగా చూస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఇలా చేస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ పాడవ్వవు..
Recommended image2
Cooking Tips: వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేస్తే రుచి ఇంకా అదిరిపోద్ది
Recommended image3
Curd: పెరుగు పులవకుండా తాజాగా ఉండాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Related Stories
Recommended image1
Iron Rich Food: రక్తం తక్కువగా ఉందా? రోజూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్!
Recommended image2
Food Tips: ఇలా చేశారంటే..కేవలం 15 నిమిషాల్లో కుక్కర్లో కొబ్బరిపాల అన్నం రెడీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved