MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Food
  • Food Tips: ఇలా చేశారంటే..కేవలం 15 నిమిషాల్లో కుక్కర్లో కొబ్బరిపాల అన్నం రెడీ!

Food Tips: ఇలా చేశారంటే..కేవలం 15 నిమిషాల్లో కుక్కర్లో కొబ్బరిపాల అన్నం రెడీ!

కొబ్బరి పాల అన్నం కుక్కర్‌లో కేవలం 15 నిమిషాల్లో తయారవుతుంది. సులభంగా తయారయ్యే ఈ వంటకం రుచికి రుచిగా లంచ్‌ బాక్స్‌కి బెస్ట్ ఆప్షన్.

2 Min read
Author : Bhavana Thota
Published : Jun 26 2025, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కొబ్బరి పాల అన్నం
Image Credit : AI Meta

కొబ్బరి పాల అన్నం

రోజూ ఒకేలా ఉండే లంచ్‌ బాక్స్‌ మీకు బోర్‌ కొడుతోందా? అన్నం, సాంబార్, రసం అన్నీ ఆల్రెడీ అయిపోయినట్టే అనిపిస్తోందా? అయితే ఈసారి కొద్దిగా మారుద్దాం. కొద్దిగా కొత్త రుచి, కొద్దిగా తీపి న్యూట్రిషన్‌తో పాటు స్పైసీ టచ్‌ ఇచ్చే ఆహారం కావాలనుకుంటే కొబ్బరి పాల అన్నం తప్పక ట్రై చేయాలి. ఇది కేవలం 15 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. అంతే కాదు, దీనికి కూరగాయల నుంచి చికెన్ దాకా ఏదైనా కాంబినేషన్‌ అదిరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కేవలం 15 నిమిషాల్లోనే
Image Credit : AI Meta

కేవలం 15 నిమిషాల్లోనే

ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అయినా, దాన్ని కొంచెం సింపుల్ పద్ధతిలో మార్చుకొని ప్రెజర్ కుక్కర్‌ లో చాలా ఈజీగా కేవలం 15 నిమిషాల్లోనే  రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంతో, ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇది రెడీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఈ కొబ్బరి పాల బియ్యం ఎలా తయారు చేయాలో.

ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని కనీసం 20 నిమిషాలపాటు నీటిలో నానబెట్టాలి. ఈ లోపల అవసరమైన కూరగాయలు, మసాలా పదార్థాలు రెడీ చేసుకోవాలి

36
వాసన పోయేవరకు
Image Credit : AI Meta

వాసన పోయేవరకు

ఒక కుక్కర్‌ ను స్టవ్‌పై పెట్టి, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి, రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేయాలి. ఇది వేడయ్యాక మొదట జీడిపప్పులు వేయించి కొంచెం గోల్డెన్ కలర్  వచ్చేవరకు కలపాలి. వెంటనే దాల్చిన చెక్క, అనాస పువ్వులు, యాలకులు, పలావ్ కులు వేసి అర నిమిషం సన్నని మంట మీద వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చిలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు నలుపు వచ్చేవరకు వేయించి, అల్లం వెల్లుల్లి ముద్ద కలపాలి. దీని వాసన పోయేవరకు మిక్స్ చేస్తూ ఉండాలి.

తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మరిగించాలి. ఇవి వాసన రావడమే కాకుండా అన్నానికి ఒక ఫ్రెష్ ఫ్లేవర్ కూడా ఇస్తాయి. వెంటనే టమోటా వేసి కొంచెం మగ్గే వరకూ ఉడికించాలి.

46
చికెన్‌తో లాగించేయోచ్చు
Image Credit : stockPhoto

చికెన్‌తో లాగించేయోచ్చు

ఇప్పుడు రెండు కప్పుల కొబ్బరి పాలను వేసి మరిగించాలి. ఇది మరిగిపోతున్నంతలో ముందు నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా కలపాలి. చివరగా ఉప్పు కొంచెం చెక్ చేసుకోవాలి. మూత వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు వేచి ఉండాలి.

విజిల్స్ వచ్చాక స్టవ్‌ను ఆఫ్ చేయాలి. ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్‌ ను తెరిచి, తక్కువగా కలిపిన తర్వాత పెరుగు, క్యారెట్ కూర లేదా చికెన్‌తో లాగించేయోచ్చు.ఈ వంటకం ప్రత్యేకత ఏమిటంటే... సాధారణ పదార్థాల వాడకంతోనే, స్పెషల్ ఫ్లేవర్ పొందే అవకాశం కలుగుతుంది. కొబ్బరి పాలు అన్నానికి తియ్యటి టోన్ ఇస్తాయి. అదే సమయంలో మసాలా స్పైసీ ఫ్లేవర్ మిక్స్ కావడంతో టేస్ట్ చాలా బాగుంటుంది.

ఇది రోజువారీ భోజనంగా మాత్రమే కాకుండా గెస్ట్‌లకు ప్రత్యేకంగా వడ్డించడానికి కూడా బాగుంటుంది. ప్రయాణాలు, పిక్నిక్‌లకు కూడా తీసుకెళ్లవచ్చు.

56
ఆరోగ్య ప్రయోజనాలు
Image Credit : stockPhoto

ఆరోగ్య ప్రయోజనాలు

ఇక దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే, కొబ్బరి పాలలో నెమ్మదిగా జీర్ణమయ్యే కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల ఇది శక్తినిస్తుంది. పుదీనా, కొత్తిమీర వాడటం వల్ల డైజెస్టివ్ ప్రాపర్టీస్ మెరుగవుతాయి. జీడిపప్పులు శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తాయి. పైగా ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా ఉంటుంది.

ఇలా రుచికి రుచిగా, సమయానికి తగ్గట్టు సింపుల్‌గా తయారు చేసుకునే ఈ కొబ్బరి పాల అన్నం, మీ రోజువారీ మెనూలో తప్పక ఒకసారి చేర్చండి. వారానికి ఒకసారి అయినా లంచ్‌బాక్స్‌కు ఇది బాగుంటుంది.

66
హెల్తీ ఛాయిస్
Image Credit : stockphoto

హెల్తీ ఛాయిస్

ఇది పిల్లల స్కూల్ బాక్స్‌కి కూడా హెల్తీ ఛాయిస్ అవుతుంది. రుచి బావుంటుంది, చూసినవాళ్లకే ఆకలేస్తుంది. పైగా చాలా తక్కువ టైంలో పూర్తి కావడం వంటింట్లో టైమ్ సేవ్ చేయడంలో సాయపడుతుంది.

చివరిగా చెప్పాలంటే, లంచ్‌ కి ఎప్పటికప్పుడు కొత్త రుచి కోసం వెతుకుతున్నవారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. మీ వంటింటి రొటీన్‌కి కొంచెం మార్పు, మీ భోజనానికి ప్రత్యేకత ఇవ్వాలంటే ఈ రెసిపీ తప్పక ట్రై చేయండి.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Recommended image2
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image3
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Related Stories
Recommended image1
Reheating Food: పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేయకూడదు..!
Recommended image2
Iron Rich Food: రక్తం తక్కువగా ఉందా? రోజూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved