MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు

Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు

Food: అంగ‌న్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం బాలామృతం ఇస్తుంటార‌ని తెలిసిందే. చాలా మంది వీటిని ఉప‌యోగించ‌కుండా చెత్త‌లో ప‌డేస్తుంటారు. అయితే వీటితో ఎంతో రుచిక‌ర‌మైన రెసిపీల‌ను చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.? అలాంటి ఒక మంచి రెసెపీ గురించి మీకోసం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 10 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలామృతంతో బిస్కెట్స్
Image Credit : SreeRaj styles & vlogs/YT

బాలామృతంతో బిస్కెట్స్

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారంగా ఇచ్చే బాలామృతం పిండి ఇంట్లోనే రుచికరమైన బిస్కెట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పిండిలో అవసరమైన ధాన్యాలు, తీపి పదార్థాలు ముందే ఉండటంతో అదనపు చక్కెర అవసరం ఉండదు. కొద్దిగా నెయ్యి, నీరు ఉంటే సరిపోతుంది.

25
బిస్కెట్స్ కోసం అవసరమైన పదార్థాలు
Image Credit : SreeRaj styles & vlogs/YT

బిస్కెట్స్ కోసం అవసరమైన పదార్థాలు

ఈ బిస్కెట్స్ తయారీకి ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే సులభంగా చేయొచ్చు.

బాలామృతం పిండి – 3 కప్పులు

ఉప్పు – ఒక చిటికెడు

కరిగించిన నెయ్యి లేదా బటర్ – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

నీళ్లు లేదా కాచి చల్లార్చిన పాలు – అవసరమైనంత

బాదం ముక్కలు – పైకి డెక‌రేష‌న్‌ కోసం

Related Articles

Related image1
Home Hacks: ఖాళీ బియ్యం సంచుల‌ను ప‌డేస్తున్నారా.? ఇలా చేస్తే అంద‌మైన బ్యాగులు ర‌డీ
Related image2
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
35
పిండి సిద్ధం చేసే విధానం
Image Credit : SreeRaj styles & vlogs/YT

పిండి సిద్ధం చేసే విధానం

ముందుగా ఒక వెడల్పైన గిన్నెలో బాలామృతం పిండి వేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్లీ గిన్నెలోకి తీసుకుని, కొద్దిగా కొద్దిగా నీళ్లు లేదా పాలు పోస్తూ గట్టిగా ఉండేలా పిండి ముద్ద తయారు చేయాలి. ఈ ముద్దను 10–15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

45
బిస్కెట్ ఆకారం కోసం
Image Credit : SreeRaj styles & vlogs/YT

బిస్కెట్ ఆకారం కోసం

నానిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత చేత్తో లేదా గ్లాస్‌తో బిస్కెట్ ఆకారంలో నొక్కాలి. అన్నీ ఒకే సైజులో ఉంటే బేక్ అవ్వడం సులభంగా ఉంటుంది. పైభాగంలో బాదం ముక్కలు పెట్టి తేలికగా నొక్కాలి.

55
బేక్ చేసే విధానం
Image Credit : SreeRaj styles & vlogs/YT

బేక్ చేసే విధానం

మందపాటి కడాయిలో కొద్దిగా ఉప్పు వేసి, లోపల స్టాండ్ పెట్టి మూత మూసి 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలి.

తర్వాత నెయ్యి రాసిన ప్లేట్‌లో బిస్కెట్స్ అమర్చి కడాయిలో పెట్టాలి. మూత పెట్టి లో-టు-మీడియం మంటపై 25–30 నిమిషాల పాటు బేక్ చేయాలి. కింద భాగం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే బిస్కెట్స్ క్రంచీగా ఉంటాయి. బిస్కేట్స్ తయారీకి సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ చూడండి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Oats benefits: వారంలో రెండుసార్లు ఓట్స్ తిని చూడండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులివే
Recommended image2
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Heart Health: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ గుండె పదిలం!
Related Stories
Recommended image1
Home Hacks: ఖాళీ బియ్యం సంచుల‌ను ప‌డేస్తున్నారా.? ఇలా చేస్తే అంద‌మైన బ్యాగులు ర‌డీ
Recommended image2
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved