MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా

Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా

Egg Business: ల‌క్ష‌ల్లో సంపాదించాల‌ని చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం ర‌క‌ర‌కాల మార్గాల‌ను ఎంచుకుంటారు. త‌క్కువ రిస్క్‌తో భారీగా ఆదాయం ఆర్జించే అలాంటి ఒక బెస్ట్ ఐడియా లేయ‌ర్ కోడి ఫామ్‌. ఈ బిజినెస్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 07 2026, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లేయర్ కోడి ఫారం అంటే ఏంటి?
Image Credit : Gemini AI

లేయర్ కోడి ఫారం అంటే ఏంటి?

లేయర్ కోడి ఫారం అంటే గుడ్లు పెట్టే కోళ్లను పెంచి వాణిజ్యంగా గుడ్ల ఉత్పత్తి చేయడం. లేయర్ కోళ్లు ఒక రోజు వయస్సు నుంచే పెంచాలి. ఇవి సుమారు 18–19 వారాలకే గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. 72–78 వారాల వరకు నిరంతరం గుడ్లు ఇస్తాయి. ఒక ఆరోగ్యకరమైన లేయర్ కోడి వారానికి కనీసం 4–6 గుడ్లు పెడుతుంది. సంవత్సరానికి 300–325 గుడ్లు పెడుతుంది.

25
సరైన జాతి ఎంపిక – ఇదే లాభానికి కీలకం
Image Credit : ANI

సరైన జాతి ఎంపిక – ఇదే లాభానికి కీలకం

లేయర్ కోళ్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి.

వైట్ ఎగ్ లేయర్స్: చిన్న పరిమాణం, తక్కువ ఫీడ్ తింటాయి. గుడ్లు తెల్లగా ఉంటాయి

బ్రౌన్ ఎగ్ లేయర్స్: ఈ కోడి గుడ్లు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. ఫీడ్ ఎక్కువ తింటాయి, గుడ్లు పెద్ద సైజ్‌లో, బ్రౌన్ రంగులో ఉంటాయి. వాణిజ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

Related Articles

Related image1
కోటి రూపాయ‌లు ఇచ్చినా స‌రే.. ఈ 7 ప్ర‌దేశాల‌కు అస్స‌లు వెళ్ల‌కండి. చాణ‌క్య ఇలా ఎందుకు చెప్పారంటే
Related image2
రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.
35
ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.?
Image Credit : Getty

ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.?

ఈ కోళ్ల ఫారంను నివాస ప్రాంతాలకు దగ్గరగా కాకుండా, పట్టణాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నీరు, రవాణా సౌకర్యం ఉండాలి. ప్రభుత్వం అనుమతులు లభించే ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకోవాలి. బ్యాటరీ కేజ్ సిస్టమ్ లేయర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు.

45
ఎంత పెట్టుబ‌డి అవుతుంది.?
Image Credit : Pixabay

ఎంత పెట్టుబ‌డి అవుతుంది.?

ప్రారంభంలో ఉదాహ‌ర‌ణ‌కు 1000 కోళ్లు కొనుగోలు చేశార‌నుకుందాం. సాధారణంగా వీటికి డే ఓల్డ్ చిక్స్ (Day Old Chicks) కొనుగోలు చేస్తారు. ఒక్క లేయర్ కోడి (డే ఓల్డ్ చిక్) ధర సుమారు రూ. 40 నుంచి రూ. 55 వరకు ఉంటుంది. మంచి బ్రాండ్ హ్యాచరీ (Isa Brown, BV-380 లాంటి జాతులు): ₹50 – ₹60 మధ్య ఉంటాయి. అంటే 1000 కోళ్లకు సుమారు రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఇతర ఖర్చులకు రూ. 1 లక్ష నుంచి రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి అవ‌స‌ర‌ప‌డుతుంది.

55
లాభాలు ఎలా ఉంటాయి.?
Image Credit : our own

లాభాలు ఎలా ఉంటాయి.?

20 వారాలకు 5% కోళ్లు గుడ్లు పెడతాయి. 26–30 వారాల మధ్య గరిష్ట ఉత్పత్తి జ‌రుగుతుంది. లాభాల విష‌యానికొస్తే గుడ్ల సైజ్ ఆధారంగా ధర మారుతుంది. రోజుకు సగటు 800–900 గుడ్లు పెట్టినా ఒక్క గుడ్డు రూ. 5–7 ప‌లుకుతుంద‌ని అనుకుందాం. ఈ లెక్క‌న చూసుకుంటే నెల‌కు లక్షల రూపాయల టర్నోవర్ పొందే అవకాశం ఉంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలను కేవ‌లం ప్రాథ‌మిక సమాచారంగానే భావించాలి. ఈ వ్యాపారం మొద‌లు పెట్టే ముందు ఇందులో అనుభ‌వం ఉన్న వారిని నేరుగా సంప్ర‌దించడం ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఏడాదికి ఒక్కసారే రీచార్జ్, అన్‌లిమిటెడ్ కాల్స్..
Recommended image2
Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 40 లక్షలు పైమాటే..! ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌పై ఓ లుక్కేయండి..
Recommended image3
వడ్డీ రేటు తగ్గకున్నా.. రూ. 50 లక్షల హోం లోన్‌పై డబ్బు ఆదా చేయండిలా..
Related Stories
Recommended image1
కోటి రూపాయ‌లు ఇచ్చినా స‌రే.. ఈ 7 ప్ర‌దేశాల‌కు అస్స‌లు వెళ్ల‌కండి. చాణ‌క్య ఇలా ఎందుకు చెప్పారంటే
Recommended image2
రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved