ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ధమనుల్లో ఫలకం పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఓట్స్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పప్పు ధాన్యాలు రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
చియా విత్తనాల్లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
అవిసె గింజలు కరిగే ఫైబర్‌కు గొప్ప మూలం. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.
ఆపిల్స్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ధమనుల్లో ఫలకం పేరుకుపోకుండా సహాయపడుతుంది.
అవకాడోలో హెల్తీ కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించి, ధమనుల పనితీరును మెరుగుపరుస్తాయి.
క్యారెట్లలో ఫైబర్, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
Oats: ప్రతిరోజు ఓట్స్ తినడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే!
Apple: రోజూ ఒక యాపిల్ తింటే ఏమౌతుందో తెలుసా?
అవకాడో తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా?
కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?