MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Food: రోజూ ఒకే ర‌క‌మైన ఆహారం తింటున్నారా.? శ‌రీరంలో జ‌రిగేది ఇదే

Food: రోజూ ఒకే ర‌క‌మైన ఆహారం తింటున్నారా.? శ‌రీరంలో జ‌రిగేది ఇదే

Food: చాలామంది రోజూ ఒకే విధమైన ఆహారం తినడం అలవాటు చేసుకుంటారు. ఉదయం అదే టిఫిన్‌, మధ్యాహ్నం అదే భోజనం, రాత్రి కూడా దాదాపు అదే మెనూ. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 09 2026, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పేగుల ఆరోగ్యం దెబ్బ‌తినే ప్ర‌మాదం
Image Credit : Gemini AI

పేగుల ఆరోగ్యం దెబ్బ‌తినే ప్ర‌మాదం

మన కడుపులో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. వీటినే “గట్ బ్యాక్టీరియా” అంటారు. ఇవి ఆహారం జీర్ణం కావడంలో, రోగనిరోధక శక్తి పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మంచి బ్యాక్టీరియా బలంగా ఉండాలంటే రకరకాల పోషకాలు అవసరం. ఒకే రకమైన ఆహారం ఎక్కువకాలం తింటే శరీరానికి కావాల్సిన అన్ని రకాల ఫైబర్‌, పోషకాలు అందవు. దీంతో పేగుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒకే ఆహారం తింటే వచ్చే సమస్యలు ఇవే
Image Credit : Getty

ఒకే ఆహారం తింటే వచ్చే సమస్యలు ఇవే

రోజూ ఒకే మెనూ ఫాలో అవుతూ ఉంటే మొదట్లో పెద్దగా సమస్య కనిపించకపోవచ్చు. కానీ కొంతకాలానికి జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం, కడుపు బరువుగా అనిపించడంతో పాటు కొన్ని ఆహారాలు జీర్ణం కాకపోవడం వంటి స‌మ‌స్య‌లు రావొచ్చు. మన ప్లేట్‌లో పప్పు, అన్నం, కూర ఉన్నాయంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతి ధాన్యం, కూరగాయ, పండులో వేర్వేరు రకాల పోషకాలు ఉంటాయి. అవే పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచుతాయి.

Related Articles

Related image1
Cooler: ఫైబర్ లేదా ఐరన్ బాడీ... ఈ రెండింటిలో ఏ కూలర్ కొనడం మంచిది.?
Related image2
Mini Speaker: జ‌స్ట్ రూ. 500 మాత్ర‌మే.. ఈ స‌మ్మ‌ర్‌లో మీ పిల్ల‌లకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే
35
పరిశోధనల్లో బయటపడిన నిజాలు
Image Credit : Getty

పరిశోధనల్లో బయటపడిన నిజాలు

నిపుణుల పరిశోధనల ప్రకారం.. వారంలో రకరకాల మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకునే వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా, బలంగా ఉంటోంది. అంటే కేవలం ఒకే ఆహారం కాకుండా.. వేర్వేరు కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

45
ఒకే ఆహారం వల్ల కొంత లాభం కూడా ఉంది
Image Credit : Getty

ఒకే ఆహారం వల్ల కొంత లాభం కూడా ఉంది

అయితే ప్రతిరోజూ ఒకే టైమ్‌కు ఒకే విధమైన ఆహారం తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బరువు నియంత్రణ సులభం అవడం, ఆహారపు అలవాట్లు క్రమబద్ధంగా ఉండడం, శరీరానికి సమయానికి ఆహారం అందడం వంటి లాభాలుంటాయి. కానీ నెలలు, సంవత్సరాల పాటు ఎలాంటి మార్పులు లేకుండా అదే ఆహారం కొనసాగిస్తే సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది.

55
ఆహారంలో చిన్న మార్పులు చేస్తే చాలు
Image Credit : CHATGPT.COM

ఆహారంలో చిన్న మార్పులు చేస్తే చాలు

నిపుణులు చెబుతున్నదేమిటంటే.. ఒక్కసారిగా మొత్తం డైట్ మార్చాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు చేసినా సరిపోతుంది. ఉదాహరణకు.. తెల్ల బియ్యం బదులు అప్పుడప్పుడు చిరుధాన్యాలు తినడం, సీజన్‌కు తగ్గ కూరగాయలు మార్చడం, రకరకాల పప్పులు తీసుకోవడం, పెరుగు, మజ్జిగను ఆహారంలో చేర్చడం, రోజూ వేర్వేరు పండ్లు తినడం వంటి అలవాట్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కడుపు నింపుకోవడం సరిపోదు. శరీరానికి అవసరమైన రకరకాల పోషకాలు అందేలా ఆహారంలో వైవిధ్యం ఉండటం చాలా ముఖ్యం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆరోగ్యం
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Cooler: ఫైబర్ లేదా ఐరన్ బాడీ... ఈ రెండింటిలో ఏ కూలర్ కొనడం మంచిది.?
Recommended image2
Mini Speaker: జ‌స్ట్ రూ. 500 మాత్ర‌మే.. ఈ స‌మ్మ‌ర్‌లో మీ పిల్ల‌లకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved