MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cooler: ఫైబర్ లేదా ఐరన్ బాడీ... ఈ రెండింటిలో ఏ కూలర్ కొనడం మంచిది.?

Cooler: ఫైబర్ లేదా ఐరన్ బాడీ... ఈ రెండింటిలో ఏ కూలర్ కొనడం మంచిది.?

Cooler: మండుతోన్న ఎండ‌ల‌కు కూల‌ర్ల‌తో ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు. ప్రతి ఒక్కరికీ AC కొనుగోలు చేసే అవకాశం ఉండకపోవడంతో కూలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఐర‌న్ బాడీ కూల‌ర్ కొనుగోలు చేయాలా.? ఫైబ‌ర్ బాడీ కూల‌ర్ కొనుగోలు చేయాలా.? అనే సందేహం వస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 09 2026, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐరన్ బాడీ కూలర్ అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

ఐరన్ బాడీ కూలర్ అంటే ఏమిటి?

ఐరన్ లేదా మెటల్ బాడీ కూలర్లు చాలా కాలంగా మార్కెట్‌లో ఉన్న సంప్రదాయ మోడళ్లు. ఇవి బలంగా, ఎక్కువకాలం మన్నే విధంగా తయారు చేస్తారు. పెద్ద గదులు, హాల్స్ వంటి ప్రదేశాల్లో ఇవి మంచి గాలి ఇస్తాయి. వాటర్ ట్యాంక్ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. గాలి వేగంగా, దూరం వరకు వెళ్లేలా పనిచేస్తాయి. కానీ ఈ కూలర్లు బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఒకచోట నుంచి మరోచోటికి మార్చడం కాస్త కష్టం. అలాగే కాలక్రమేణా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శబ్దం కూడా ఎక్కువగా వస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఫైబర్ బాడీ కూలర్ ప్రత్యేకతలు ఏంటి?
Image Credit : Gemini AI

ఫైబర్ బాడీ కూలర్ ప్రత్యేకతలు ఏంటి?

ఫైబర్ బాడీ కూలర్లు ప్రస్తుతం కొత్త టెక్నాలజీతో వస్తున్న మోడళ్లు. ఇవి పూర్తిగా ఐరన్‌తో కాకుండా ప్రత్యేక ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఇవి తేలికగా ఉండటంతో సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. తుప్పు పట్టే సమస్య ఉండదు. డిజైన్ కూడా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఆధునిక మోటార్లు, కొత్త టెక్నాలజీ వాడటం వల్ల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

Related Articles

Related image1
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Related image2
Alcohol: మందును గాజు బాటిళ్ల‌లోనే ఎందుకు అమ్ముతారు.? ప్లాస్టిక్ ఎందుకు వాడ‌రంటే.
35
ఏ కూలర్ తక్కువ కరెంట్ ఖర్చు చేస్తుంది?
Image Credit : Gemini AI

ఏ కూలర్ తక్కువ కరెంట్ ఖర్చు చేస్తుంది?

కరెంట్ బిల్లు తగ్గించాలని భావించే వారికి ఫైబర్ బాడీ కూలర్లు మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఎందుకంటే వీటిలో తక్కువ పవర్ తీసుకునే మోటార్లు ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ కూలర్లు కూడా తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. అయితే ఐరన్ బాడీ కూలర్లు కొంచెం ఎక్కువ కరెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద మోటార్, భారీ ఫ్యాన్ ఉండటం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది.

45
కూలింగ్ పరంగా ఏది బెస్ట్?
Image Credit : Gemini AI

కూలింగ్ పరంగా ఏది బెస్ట్?

కూలింగ్ అనేది కేవలం బాడీ మెటీరియల్‌పై మాత్రమే ఆధారపడదు. మోటార్ పవర్, ఫ్యాన్ సైజ్, కూలింగ్ ప్యాడ్స్, వాటర్ కెపాసిటీ వంటి అంశాలు కూడా ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా పెద్ద గదులు, ఓపెన్ హాల్స్ కోసం ఐరన్ బాడీ కూలర్లు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి గాలి వేగంగా పంపగలవు. చిన్న లేదా మధ్యస్థ గదుల్లో ఫైబర్ బాడీ కూలర్లు మంచి పనితీరు ఇస్తాయి. తక్కువ శబ్దంతో చల్లదనం అందిస్తాయి.

55
ఇంత‌కీ ఏ కూలర్ కొనాలి?
Image Credit : Gemini AI

ఇంత‌కీ ఏ కూలర్ కొనాలి?

మీ అవసరాన్ని బట్టి కూలర్ ఎంపిక చేయాలి. పెద్ద గదికి, ఎక్కువ గాలి కావాలంటే ఐరన్ బాడీ కూలర్ మంచిది. తక్కువ కరెంట్ ఖర్చు, స్టైలిష్ డిజైన్, తక్కువ బరువు కావాలంటే ఫైబర్ బాడీ కూలర్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగదారులు ఫైబర్ బాడీ కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ విద్యుత్ వినియోగం, తుప్పు సమస్య లేకపోవడం, ఆధునిక డిజైన్ కావడమే దీనికి కార‌ణాలుగా చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Eyelash: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image2
Earrings: పింక్ స్టోన్ ఇయర్ రింగ్స్.. ట్రెడిషనల్ వేర్ కి పర్ఫెక్ట్
Recommended image3
Hyderabad: మెంట‌ల్ హెల్త్‌ బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్న‌ట్లు.. అవి కూడా అనారోగ్య స‌మ‌స్య‌లే
Related Stories
Recommended image1
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Recommended image2
Alcohol: మందును గాజు బాటిళ్ల‌లోనే ఎందుకు అమ్ముతారు.? ప్లాస్టిక్ ఎందుకు వాడ‌రంటే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved