Telugu

గుడ్డు ఎంతసేపట్లో పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది? ఏది తినాలి?

Telugu

గుడ్లను ఎలా ఉడికించాలి?

ముందుగా నీటిని మరిగించి, ఆ తర్వాత గుడ్లను వేసి టైమర్ సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. లోపలి పచ్చసొన కాస్త ద్రవ రూపంలో ఉండాలంటే 6 నిమిషాలు సరిపోతుంది. తెల్లసొన మాత్రం ఉడుకుతుంది.

Image credits: Getty
Telugu

మెత్తగా ఉడకాలంటే 8 నిమిషాలు

గుడ్డు మెత్తగా ఉడకాలంటే 8 నిమిషాలు మరిగించాలి. అప్పుడు పచ్చసొన సగం ఉడుకుతుంది. తెల్లసొన ముప్పావు వంతు ఉడుకుతుంది. ఇలా తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే.

Image credits: AI Image
Telugu

గట్టిగా ఉడకాలంటే 10 నిమిషాలు

గుడ్డును 10 నిమిషాల పాటు నీటిలో ఉడికిస్తే, తెల్లసొన, పచ్చసొన రెండూ బాగా ఉడుకుతాయి. ఇలా ఉడికించిన గుడ్డు తినడం చాలా ఉత్తమం.

Image credits: Getty
Telugu

15 నిమిషాల పాటు ఉడికిస్తే

గుడ్డును 15 నిమిషాల పాటు ఉడికిస్తే తినడానికి అంత అనువుగా ఉండదు. అందులోని పోషకాలన్నీ పోతాయి. అంతేకాకుండా పచ్చసొన పొడిపొడిగా మారి డ్రై అవుతుంది.

Image credits: Pixabay
Telugu

గుడ్డు ఉడికించేందుకు కొన్ని చిట్కాలు

గుడ్డు ఉడికించే ముందు నీటిని వేడి చేసి ఆ తర్వాత గుడ్లను వేయాలి. గుడ్డు పగలకుండా ఉండాలంటే నీటిలో కొద్దిగా ఉప్పు, వెనిగర్, ఉల్లిపాయ పొట్టు లేదా నిమ్మకాయ తొక్కను వేయాలి.

Image credits: Getty
Telugu

గుడ్డు పొట్టు ఈజీగా తీసేందుకు చిట్కాలు

గుడ్డు బాగా ఉడికిన తర్వాత పొట్టును సులభంగా తీయాలంటే, వాటిని చల్లటి నీళ్లలో లేదా ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లలో, లేదంటే ఫ్రిజ్ లో పెట్టిన నీళ్లలో కాసేపు ఉంచండి.

Image credits: Getty

Chicken Curry: ఈ స్పెషల్ వాటర్ కలిపితే చాలు..చికెన్ కర్రీ అదిరిపోద్ది

పండ్ల మీద స్టిక్కర్లు, నంబర్లు ఎందుకుంటాయి? ఏ అంకె ఏం చెబుతుంది?

Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు

Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..