Kalonji Seeds: పరగడుపున నల్లజీలకర్ర తింటే ఏమౌతుంది?
నల్ల జీలకర్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ నల్ల జీలర్రను ప్రతిరోజూ పరగడుపున తీసుకోవడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడం, షుగర్ పేషెంట్స్ కి రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడతాయి.

నల్ల జీలకర్ర ప్రయోజనాలు
మనం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారాలను ఎంచుకోవడం చాలా అవసరం. సరైన ఆహారాలను తీసుకోవడమే కాదు, సరైన పరిమాణంలో, సరైన సమయంలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే, ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలం. అలా అని దీని కోసం మనం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిరోజూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నల్ల జీలకర్ర ( కళోంజీ గింజలు)ను మన డైట్ లో భాగం చేసుకుంటే చాలు. వీటిని తినడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు మన దరిచేరకుండా కాపాడుకోవచ్చు. మరి, ఈ నల్ల జీలకర్రను ప్రతిరోజూ పరగడుపున తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...
నల్ల జీలకర్రను ఎలా తినాలి?
నల్ల జీలకర్రను మీరు పొడిగా చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఉదయం నిద్రలేచని వెంటనే ఒక టీ స్పూన్ నల్ల జీలకర్ర పొడిని ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి పరగడుపున తాగొచ్చు. కావాలంటే, అందులో ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
బరువు తగ్గించే నల్లజీలకర్ర..
నల్ల జీలకర్రలోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. నల్ల జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్లు ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి నల్ల జీలకర్ర తీసుకోవాలని చాలా మంది నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు.
రక్తపోటును నియంత్రిస్తుంది
నల్ల జీలకర్రలోని లక్షణాలు శరీర రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి.
మధుమేహాన్ని నివారించే నల్ల జీలకర్ర
ఈ రోజుల్లో, చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సందర్భంలో, మధుమేహాన్ని నివారించడానికి, షుగర్ పేషెంట్స్ వారి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి నల్ల జీలకర్ర తీసుకోవచ్చు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
నల్ల జీలకర్రలోని లక్షణాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇది మీ మెదడు చురుకుగా, అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు
తరచుగా జలుబు, దగ్గు వంటి కొన్ని సాధారణ ఇన్ఫెక్షన్లను నివారించడానికి నల్ల జీలకర్రను ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఆస్తమాతో బాధపడేవారికి కూడా నల్ల జీలకర్ర చాలా మంచిది.
కీళ్ల నొప్పులను నయం చేస్తుంది
కీళ్ల నొప్పులతో బాధపడేవారు తమ రోజువారీ ఆహారంలో నల్ల జీలకర్రను చేర్చుకోవచ్చు. ఈ అద్భుతమైన గింజలు మెడ, వీపు , కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంలోనూ సహాయపడుతుంది.
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే నల్ల జీలకర్ర
మూత్రపిండాల్లో రాళ్లు, వాటి వల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి నల్ల జీలకర్రను నీటితో తీసుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నల్ల జీలకర్ర సహాయపడుతుంది.
తక్షణ శక్తిని ఇస్తుంది
నల్ల జీలకర్ర గింజలను నీరు, తేనెతో కలిపి తాగడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది. దీన్ని తాగడం వల్ల మీకు అలసట లేదా నీరసం రాదు. దీనితో పాటు, నల్ల జీలకర్రను జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు, ఇది మీకు అందమైన, మందపాటి, నల్లటి జుట్టును పొందడానికి సహాయపడుతుంది.
మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మీ ఆహారంలో నల్ల జీలకర్రను చేర్చే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.