eating food with hands చేతులతో తినే అలవాటు.. దీని వెనక ఇంత సైన్స్ ఉందా.. ఇన్ని లాభాలా?
Eating Food with hands: ‘అన్నం పరబ్రహ్మస్వరూపం’ అంటారు భారతీయులు. తినే భోజనాన్ని సైతం దేవుడిలా భావించే మనం.. ఆత్మీయ స్పర్శ కోసం అన్నాన్ని చేతులతోనే తింటుంటాం. విదేశీయులు మాత్రం భోజనాన్ని చెంచాలు, ఫోర్క్ లతో మాత్రమే తీసుకుంటారు. మనం భోజనాన్ని చేతులతో తినడం వెనక కేవలం సెంటిమెంట్, ఆధ్యాత్మిక కోణాలే కాదు.. బోలెడంత సైన్స్ కూడా ఉంది.

ఆధ్యాత్మిక కోణం
పూర్వకాలం నుంచి భారతీయులది చేతితో తినే అలవాటే. దీనికి కారణం మనిషికి, ఆహారానికి మనకి మధ్య ఆత్మీయ స్పర్శ ఉండాలనే. చేతితో ఆహార పదార్థాలను తాకుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక ఎమోషన్ మొదలవుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చేయి ఐదు వేళ్లకు ఐదు కీలకమైన నాడులు ఉంటాయి. అన్నం ముద్ద కలిపిన, నోట్లోకి వెళ్లిన ప్రతిసారీ ఇవి ప్రేరేపితవుతాయి. ఇది మనిషిని చురుగ్గా ఉండేలా చేస్తాయి. పైగా మనం ఆహారాన్ని దేవుడిలా చూడటం వెనక అది మన పల్లెంలోకి రావడం వెనక కొందరు పడ్డ కష్టం తెలియజేస్తుంది. పనిని భగవంతుడిలా భావించే రైతుల శ్రమ కనిపిస్తుంది. అందుకే అన్నాన్ని గౌరవించాలనే విషయాన్ని బోధపడుతుంది.
సైన్స్ సంగతులు
అన్నాన్ని మనం చేతులతో ముట్టుకోగానే.. వేలి కొనల్లో ఉండే నాడులు మనం అన్న తినడానికి సిద్ధం అవుతున్నాము అనే విషయాన్ని మెదడుకు తెలియజేస్తాయి. దాంతో వెంటనే మెదడు జీర్ణ ప్రక్రియకు కావాల్సిన ఎంజైమ్ లు, జీర్ణ రసాయనాలు విడుదల చేయాల్సిందిగా పొట్టకి సంకేతాలు పంపిస్తుంది. దాంతోపాటు మనం భోజనాన్ని చేతులతో పట్టుకున్నప్పడు అది ఎంత పరిణామం, ఎలాంటి ఆహారమో గ్రహించి, దానికి అనుగుణంగానే రసాయనాలు విడుదల చేయాల్సిందిగా ఆదేశాలిస్తుంది.
మనసుకి నచ్చినట్టుగా..
భోజనాన్ని చేతులతో తీసుకున్నప్పుడు మెదడు, శరీరం మధ్య సమన్వయం ఉంటుంది. ఎంత తినాలి, ఎక్కువ తింటే ఏమవుతుంది? పొట్ట నిండిందా, లేదా.. ఇలాంటి అవగాహన వచ్చేస్తుంది. మీకు చెంచాతో తినే అలవాటు ఉంటే ఆహారం ఎంత తీసుకుంటున్నామో తెలియదు. పైగా చెంచాతో తిన్నప్పడు కొంచెం పరిమాణం నోట్లోకి వెళ్తుంది కాబట్టి ముద్దకి ముద్దకి మధ్య గ్యాప్ ఉండదు. గబగబా తినేస్తాం. ఎక్కువే తింటాం. అలా కాకుండా చేతితో కలుపుకున్నప్పడు మనకు మనకు నచ్చిన పరిమాణంలో కలుపుకోవచ్చు. సంత్రుప్తికరంగా తినొచ్చు. దీనినే మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు.