Bottle Gourd: పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే ఏమౌతుంది?
Bottle Gourd: సొరకాయలో చాలా పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే నీరు శరీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచుతుంది. అంతేకాదు, దీనిలోని ఫైబర్ జీర్ణక్రియన మెరుగుపరిచి మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరుగుపరుస్తుంది

bottle gourd juice
ఆరోగ్యకరమైన కూరగాయల్లో సొరకాయ ముందు వరసలో ఉంటుంది. ఈ సొరకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ సొరకాయను జ్యూస్ రూపంలో రోజూ పరగడుపున తాగితే ఏమౌతుంది? నిజంగానే బరువు తగ్గుతారా? ఎలాంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
అధిక బరువు కంట్రోల్ లో ఉంచే సొరకాయ జ్యూస్....
సొరకాయ జ్యూస్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల ఎక్కువ సేపు ఆకలి అవ్వదు. దీంతో.... అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
2. జీర్ణక్రియ మెరుగుదల
సొరకాయలో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచుతుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు భారంగా అనిపించడం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చాలా రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
3. శరీర డీటాక్స్
సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రం ద్వారా శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. ఉదయం పరగడుపున తాగితే డీటాక్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
4. PCOD/PCOS ఉన్నవారికి ఉపయోగం
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే బరువు పెరుగుదల తగ్గేందుకు ఇది సహాయపడుతుంది.
5. జీవక్రియ (మెటబాలిజం) పెరుగుతుంది
పరగడుపున సొరకాయ జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం యాక్టివ్ అవుతుంది. దీని వల్ల శరీరం కేలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది.
సొరకాయ జ్యూస్ ఎలా తాగాలి..?
సొరకాయ జ్యూస్ తాజాగా మాత్రమే తాగాలి. చేసిన వెంటనే తాగాలి. రుచి కోసం అందులో నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. రోజుకి ఒక గ్లాసుకు మించి తాగకూడదు. అయితే... మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. ఈ జ్యూస్ తాగే ముందు జాగ్రత్త పడాలి. వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ జ్యూస్ ని మీ డైట్ లో భాగం చేసుకోవాలి.

