Weight Loss: బరువు తగ్గాలి కానీ, స్వీట్ తినాలని ఉందా...? ఇవి బెస్ట్ ఆప్షన్
Weight Loss: చలికాలంలో చాలా మందికి ఎప్పుడూ ఎనర్జీ తక్కువగా ఉన్న అనుభూతి ఉంటుంది. దీని కారణంగా... ఎక్కువగా స్వీట్ తినాలనే కోరిక కలుగుతుంది. కానీ, బరువు తగ్గాలని అనుకునేవారికి ఇవి కరెక్ట్ కాదు. అలాంటివారు ఈ హెల్దీ ఫుడ్స్ తినవచ్చు.

weight loss
ఈరోజుల్లో బరువు తగ్గాలని ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు. ఆ బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. చలికాలంలో బరువు తగ్గడం కాస్త కష్టంగా ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామాన్నా కూడా స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేక స్వీట్స్ తినేస్తూ ఉంటాం. దీంతో.. బరువు తగ్గడం సాధ్యం కాదు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా? అయితే.. ఆ స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి మీరు కొన్ని రకాల ఫుడ్స్ తినవచ్చు. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం....
1.చిలగడదుంపలు...
ఈ సీజన్ లో చిలకడ దుంపలు పుష్కలంగా లభిస్తాయి. మన స్వీట్ క్రేవింగ్స్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ గట్ హెల్త్ కి చాలా మంచిది. దీనిలో ఉండే సంక్లిష్ట కార్బో హైడ్రేట్స్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఇది తియ్యగా ఉంటుంది కాబట్టి... మళ్లీ వేరే షుగర్ ఫుడ్స్ తినాల్సిన అవసరం ఉండదు.
2.ఖర్జూరాలు...
మీరు బరువు పెరగకుండా.. షుగర్ క్రేవింగ్స్ తీర్చుకోవాలి అనుకుంటే ఖర్జూరం బెస్ట్ ఆప్షన్. దీనిలో నేచురల్ షుగర్స్ తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు శరీరానికి కావాల్సిన ఎనర్జీ లభిస్తుంది. షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ లో ఉంటాయి.
3.నట్స్ అండ్ సీడ్స్...
బాదం, వాల్ నట్, చియా సీడ్స్, అవిసె గింజలను కూడా మీరు తినవచ్చు. వీటిలో హెల్దీ ఫ్యాట్స్, మంచి ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి.
4.సీతాఫలం...
శీతాకాలంలో సీతాఫలం మనకు చాలా సులభంగా లభిస్తాయి. నేచురల్ స్వీట్స్ మనకు ఈ పండు నుంచి లభిస్తాయి. ఆకలి తీరడంతో పాటు... ఆరోగ్యానికి కూడా సపోర్ట్ చేస్తాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిని మీరు టీ, ఓట్ మీల్ లేదా వేడి పాలల్లో కలుపుకొని తాగొచ్చు. షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ లో ఉంటాయి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ ని కూడా తినవచ్చు. అలా అని ఎక్కువ కాకుండా... చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవచ్చు. షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో గుండె ఆరోగ్యానికి సపోర్ట్ ఇచ్చే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి కానీ మితంగా తినాలి.
ఓట్స్
ఓట్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. షుగర్ క్రేవింగ్స్ ని కూడా తీరుస్తుంది. దీనిలో.. పండ్లు, నట్స్ లాంటివి ఏదో ఒకటి మిక్స్ చేసుకొని తినవచ్చు.
యోగర్ట్
ఇది ప్రోటీన్ , ప్రోబయోటిక్‌లను కలిగి ఉంటుంది, ఇది పేగు ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. మీరు దీనిలో పండ్లు, నట్స్ లాంటివి కలిపి తీసుకోవచ్చు. కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.

