MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Food
  • Healthy Food: బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఇది బెటర్..

Healthy Food: బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఇది బెటర్..

Healthy Food: చాలామందికి డైట్‌లో పెద్ద కష్టం స్వీట్. చక్కెర మానేస్తారు… కానీ కోరిక పోదు. ఆపుకోలేక ఎక్కువగా తినేస్తారు, డైట్ ట్రాక్ తప్పుతుంది. అందుకే చినీకి బదులు బెల్లం, ఖర్జూరం తీసుకుంటున్నారు. ఇవి నిజంగా వెయిట్ లాస్‌కి మేలేనా?… లేక కేవలం అపోహేనా ?

2 Min read
Author : Nandini Arava
Published : Feb 23 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డైట్ లో తీపి కోరిక ఆపుకోలేకపోతున్నారా?
Image Credit : Getty

డైట్ లో తీపి కోరిక ఆపుకోలేకపోతున్నారా?

చాలా మందికి ఇదే ప్రాబ్లం, స్వీట్స్ అంటే ఇష్టం. కానీ డైట్ వల్ల కోరికలను చంపేసుకుంటారు. డైట్‌లో ఉన్నాం… కానీ తీపి మానలేకపోతున్నామని బాధపడుతుంటారు. ఒక్కోసారి ఆపుకోలేక తినేస్తారు. కొంతమంది దొరికింది కదా ఇప్పుడే తినేద్దామని ఎక్కువ మొత్తంలో తినేస్తారు. దాని వల్ల డైట్ దారి తప్పుతుంది. శరీరంపై వెంటనే ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే చాలామంది ‘షుగర్ ని పక్కనపెట్టి బెల్లం వాడతారు. చక్కెరకు బదులు ఖర్జూరం తింటున్నారు. కానీ ఇవి నిజంగా వెయిట్ లాస్ ఫ్రెండ్లీనా? లేక మనల్ని మోసం చేస్తున్నాయా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఖర్జూరం మంచిదా? బెల్లం బెటరా?
Image Credit : Getty

ఖర్జూరం మంచిదా? బెల్లం బెటరా?

డైట్‌లో చక్కెర మానేశాం అంటే పని అయిపోయిందనుకోవడం పొరపాటు. తీపి తినాలనిపిస్తూనే బరువు తగ్గాలనుకునే వాళ్లు ఎక్కువగా అడిగే ప్రశ్న ఖర్జూరం తింటే బాగుంటుందా? లేక బెల్లం మంచిదా? రెండూ సహజమైనవే కాబట్టి ఆరోగ్యకరమే అనిపిస్తుంది. కానీ బరువు తగ్గే విషయంలో మాత్రం చిన్న తేడాలు పెద్ద ఫలితాలు ఇస్తాయి.

ఖర్జూరం: ఇది సహజంగా పండే పండు. ఇందులో ఫైబర్ బాగా ఉంటుంది. అదే అసలు ప్లస్ పాయింట్. ఫైబర్ ఉండటం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. రెండు ఖర్జూరాలు తింటేనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. మధ్య మధ్యలో ఏదో తినాలనిపించే అలవాటు కూడా తగ్గుతుంది. అదీ కాకుండా రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది.

Related Articles

Related image1
Sugar vs Jaggery: బెల్లం కంటే పంచదార తినడమే ఉత్తమమా? వైద్యులు ఏమంటున్నారో తెలుసా?
Related image2
Health: చికెన్‌లో ఈ పార్ట్స్ అస్స‌లు తిన‌కండి.. ఆరోగ్యానికి మంచిది కాదు.
35
బెల్లం ఓకే గానీ...
Image Credit : Getty

బెల్లం ఓకే గానీ...

బెల్లం: బెల్లం కూడా చక్కెర కంటే మంచిదే. ఐరన్, ఖనిజాలు ఇందులో ఉంటాయి. కానీ ఇది కూడా చివరికి స్వీటేనర్‌నే. ఫైబర్ ఉండదు. అందుకే ఇది త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర లెవల్స్ ఒక్కసారిగా పెంచుతుంది. తర్వాత మళ్లీ తగ్గిపోతాయి. దీంతో మళ్లీ తీపి తినాలనిపిస్తుంది. టీ లో, స్వీట్లలో, వంటల్లో తెలియకుండా ఎక్కువ అయిపోతుంది.

కేలరీల విషయానికి వస్తే రెండింట్లోనూ తక్కువ కాదు. కానీ ఖర్జూరం నమిలి తినాల్సి ఉంటుంది కాబట్టి పరిమితి సహజంగానే కంట్రోల్ అవుతుంది. బెల్లం అయితే చిన్న ముక్కలోనూ ఎక్కువ కేలరీలు ఇస్తుంది.

45
ఖర్జూరం సేఫ్ ఆప్షన్
Image Credit : Getty

ఖర్జూరం సేఫ్ ఆప్షన్

ఫైనల్‌గా చూస్తే.. బరువు తగ్గడమే మీ ప్రధాన లక్ష్యమైతే, ఖర్జూరాన్ని మితంగా తీసుకోవడం కొంచెం సేఫ్ ఆప్షన్‌. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. జీర్ణం సాఫీగా సాగుతుంది. దీంతో ఆకలి త్వరగా వేయదు. రెండు లేదా మూడు ఖర్జూరాలు తింటేనే తీపి తినాలనే కోరిక తగ్గుతుంది. మధ్య మధ్యలో అన్‌నెసెసరీ స్నాకింగ్ తగ్గే అవకాశం ఉంటుంది.

55
బెల్లం ఆచితూచి ఎంచుకోవాలి
Image Credit : Getty

బెల్లం ఆచితూచి ఎంచుకోవాలి

అయితే బెల్లం పూర్తిగా చెడ్డదని చెప్పలేం. అది కూడా తెల్ల చక్కెర కంటే మెరుగైనదే. కొన్ని ఖనిజాలు అందిస్తుంది. కానీ సమస్య ఎక్కడంటే… పరిమాణంలో. టీ లో, కాఫీలో, స్వీట్లలో, పాయసాల్లో తెలియకుండానే ఎక్కువ అయిపోతుంది. ఫైబర్ లేకపోవడం వల్ల త్వరగా జీర్ణమై మళ్లీ తీపి తినాలనే కోరిక పెంచుతుంది. ఇలా రోజుకు కొంచెం కొంచెంగా అదనపు కేలరీలు చేరుతుంటే బరువు తగ్గడం కష్టమవుతుంది. ఇప్పుడున్న కాలంలో బెల్లం కూడా కల్తీ అయిపోతుంది. పంచదారకే కోటింగ్ వేసి అమ్మేస్తున్నారు. కాబట్టి డైట్ లో బెల్లం తీసుకున్నప్పుడు ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం బెటర్.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఖర్జూరం అయినా, బెల్లం అయినా రెండింట్లోనూ చక్కెరే ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే శరీరంలో అదనపు కేలరీలుగా చేరతాయి.

కాబట్టి బరువు తగ్గడంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే...పరిమితి. మీరు ఎంత తీసుకుంటున్నారు? ఎంత తరచుగా తీసుకుంటున్నారు? అనేదే ముఖ్యం. తీపి పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కానీ నియంత్రణలో ఉంటేనే ఫలితం కనిపిస్తుంది. కంట్రోల్‌లో ఉంటేనే రిజల్ట్ కనిపిస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Sugar vs Jaggery: బెల్లం కంటే పంచదార తినడమే ఉత్తమమా? వైద్యులు ఏమంటున్నారో తెలుసా?
Recommended image2
Health: చికెన్‌లో ఈ పార్ట్స్ అస్స‌లు తిన‌కండి.. ఆరోగ్యానికి మంచిది కాదు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved