MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Beauty Tips: ముఖానికి రాయడం కాదు, రోజూ బీట్ రూట్ నీరు తాగితే, మీ ఫేస్ లో వచ్చే మార్పులు ఇవే

Beauty Tips: ముఖానికి రాయడం కాదు, రోజూ బీట్ రూట్ నీరు తాగితే, మీ ఫేస్ లో వచ్చే మార్పులు ఇవే

బీట్ రూట్ నీరు మీ చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాదు, మీ అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 17 2025, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బీట్ రూట్ తో సహజ సౌందర్యం..
Image Credit : Getty

బీట్ రూట్ తో సహజ సౌందర్యం..

తమ అందాన్ని పెంచుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే, అందం పెరగాలంటే..ఏవేవో క్రీములు, సీరమ్స్ ముఖానికి రాయాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ, లోపలి నుంచి అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలా మన అందాన్ని పెంచడంలో బీట్ రూట్ మనకు చాలా బాగా సహాయపడుతుంది. చాలా మంది బీట్ రూట్ ని రెగ్యులర్ గా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటారు. సలాడ్, సూప్, కూర ఇలా తింటూనే ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా బీట్ రూట్ నీటిని తాగారా? బీట్ రూట్ నీరు మీ చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాదు, మీ అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. మరి, ఈ నీటిని తాగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 బీట్‌ రూట్ నీరు చర్మానికి మంచిది
Image Credit : Getty

బీట్‌ రూట్ నీరు చర్మానికి మంచిది

బీట్‌ రూట్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త పరిమాణం పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీ చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడి ఆక్సిజన్ చర్మం ప్రతి మూలకు చేరుకున్నప్పుడు, మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది మీ చర్మానికి గులాబీ రంగును ఇస్తుంది. దీని వల్ల ఫేస్ మరింత గ్లో గా కనిపిస్తుంది.

బీట్‌ రూట్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , డీటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల, మీ ఆహారంలో బీట్‌రూట్ నీటిని జోడించడం వల్ల మీ శరీరం నుండి టాక్సిన్స్ తొలగించి, మీ చర్మాన్ని శుభ్రంగా , ఆరోగ్యంగా ఉంచుతుంది.

Related Articles

Related image1
Face Glow: ఖరీదైన క్రీములు అవసరం లేదు, ఇదొక్కటి రాసినా, ముఖం మెరిసిపోద్ది..!
Related image2
Beauty Tips: మచ్చలేని చర్మం కోసం.. ఈ ఫ్రూట్ ఫేస్ మాస్క్‌ ట్రై చేయండి..
34
యవ్వనంగా కనిపిస్తారు..
Image Credit : Getty

యవ్వనంగా కనిపిస్తారు..

బీట్‌ రూట్ విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండటం వలన పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్‌ను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. అంటే, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు. దీనితో పాటు, ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వలన చర్మానికి హానికరమైన క్రిములను కూడా చంపుతుంది.

44
బీట్‌ రూట్ నీటిని ఎలా తయారు చేయాలి..?
Image Credit : Freepik

బీట్‌ రూట్ నీటిని ఎలా తయారు చేయాలి..?

ముందుగా, బీట్‌ రూట్‌ను కడిగి, పై తొక్కను తొలగించాలి. తర్వాత బీట్ రూట్ ని మంచిగా తురుముకోవాలి. ఒక గిన్నెలో గ్లాసు నీరు తీసుకొని, అందులో తురిమిన బీట్‌ రూట్‌ను జోడించాలి. ఇప్పుడు స్టవ్ మీద ఈ పాత్రను ఉంచి 6 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత ఆ నీటిని వడ పోసుకోవాలి. అందులో కావాలంటే కొద్దిగా మిరియాల పొడి, నల్ల ఉప్పు కలుపుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగితే సరిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Face Glow: ఖరీదైన క్రీములు అవసరం లేదు, ఇదొక్కటి రాసినా, ముఖం మెరిసిపోద్ది..!
Recommended image2
Beauty Tips: మచ్చలేని చర్మం కోసం.. ఈ ఫ్రూట్ ఫేస్ మాస్క్‌ ట్రై చేయండి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved