Face Glow: ఖరీదైన క్రీములు అవసరం లేదు, ఇదొక్కటి రాసినా, ముఖం మెరిసిపోద్ది..!
చాలా మంది అమ్మాయిలు మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు.. కేవలం మన కిచెన్ లో లభించే కొన్ని ఉత్పత్తులను ముఖానికి రాస్తే.. మీ అందం రెట్టింపు అవుతుంది.

ముఖం సహజంగా మెరిసిపోవాలంటే...
తమ ముఖం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం, ఖరీదైన రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొందరికి ఎన్ని క్రీములు రాసినా కూడా ముఖంలో గ్లో రాదు. ముఖ్యంగా పొడి చర్మంతో బాధపడేవారికి.. ఫేస్ నిస్తేజంగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు..చాలా మంది అమ్మాయిలు మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు.. కేవలం మన కిచెన్ లో లభించే కొన్ని ఉత్పత్తులను ముఖానికి రాస్తే.. మీ అందం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా చర్మం ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది.
ఇవి రాస్తే చాలు...
ఓట్ మీల్ , పాలు: ఓట్స్ , పాలతో చేసిన ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి ముఖం మెరుస్తుంది. దీని కోసం, ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ పొడిని కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు అందులో పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ ప్రాంతంలో అప్లై చేసి 5 నిమిషాలు మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
పసుపు , పెరుగు: పసుపు , పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ ముఖాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడుతుంది. దీని కోసం, ఒక గిన్నెలో అర టీస్పూన్ పసుపు పొడి , 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి, ముఖం , మెడ ప్రాంతంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. మెరిసే ముఖం పొందడానికి వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించండి.
బొప్పాయి , తేనె ఫేస్ ప్యాక్:
ఒక గిన్నెలో బొప్పాయిని బాగా మెత్తగా చేసి, దానికి కొద్దిగా తేనె కలిపి, ముఖం , మెడ ప్రాంతంలో అప్లై చేసి 20 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత, మీ ముఖం కడుక్కోండి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాయండి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వాడండి, చర్మంలోని మురికిని పూర్తిగా తొలగించి ముఖం మెరుస్తుంది.
కలబంద ,కీర దోసకాయ:
కలబంద, కీర దోసకాయ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. మొటిమల వంటి చర్మ సమస్యలను నివారిస్తాయి. దీని కోసం, ఒక గిన్నెలో కలబంద జెల్ , కీర దోసకాయ పేస్ట్ కలిపి ముఖం , మెడ ప్రాంతంలో బాగా అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత మీ ముఖం కడుక్కోండి. అంతే... ముఖం మెరుస్తూ కనపడుతుంది.
ముల్తానీ మట్టి , టమాట:
ఈ రెండింటినీ చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మం బిగుతుగా ఉండటమే కాకుండా నల్లటి మచ్చలు తొలగించి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. దీని కోసం, 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి , టమోటా రసం ఒక గిన్నెలో కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాలు తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మంచి మార్పు పొందడానికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి.