MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Sweet Corn Idli: పప్పు నానబెట్టే పనిలేకుండా క్షణాల్లో రెడీ అయిపోయే స్వీట్ కార్న్ ఇడ్లీ

Sweet Corn Idli: పప్పు నానబెట్టే పనిలేకుండా క్షణాల్లో రెడీ అయిపోయే స్వీట్ కార్న్ ఇడ్లీ

Sweet Corn Idli: రోజూ చేసే ఇడ్లీతో బోర్ కొడుతోందా? అయితే కాస్త వెరైటీగా ఈ స్వీట్ కార్న్ ఇడ్లీ ట్రై చేయండి. స్వీట్ కార్న్ తో తయారయ్యే ఈ ఇడ్లీ రుచిగా ఉండటమే కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌కు మంచి ఆప్షన్. దీన్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం.

3 Min read
Author : Nandini Arava
Published : Nov 17 2026, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
స్వీట్ కార్న్ ఇడ్లీ రెసిపీ చూసేయండి
Image Credit : Gemini Ai

స్వీట్ కార్న్ ఇడ్లీ రెసిపీ చూసేయండి

రోజూ తినే ఇడ్లీ, దోశలకు కాస్త బ్రేక్ ఇచ్చి కొత్త రకం బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేద్దామా? తీయటి స్వీట్ కార్న్, కరకరలాడే జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి.. వీటన్నింటి కలయికతో వచ్చే అద్భుతమైన రుచే ఈ స్వీట్ కార్న్ ఇడ్లీ. సాధారణ బియ్యం ఇడ్లీలా పిండి రుబ్బి పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే రవ్వ, పెరుగు, స్వీట్ కార్న్‌తో దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కాదు, సాయంత్రం స్నాక్స్‌లా కూడా ఇవ్వొచ్చు. పిల్లలకు మొక్కజొన్న ఇష్టం లేకపోయినా ఇలా ఇడ్లీలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మరి ఈ రుచికరమైన స్వీట్ కార్న్ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
కావాల్సిన పదార్థాలు
Image Credit : Gemini Ai

కావాల్సిన పదార్థాలు

స్వీట్ కార్న్ - 2 కప్పులు, రవ్వ - 1 కప్పు, పెరుగు - 1 కప్పు, తురిమిన క్యారెట్ - 1/2 కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం - చిన్న ముక్క, ఆవాలు - 1/2 టీస్పూన్, మినపప్పు - 1 టీస్పూన్, జీడిపప్పు - 8 నుంచి 10, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - 1 నుంచి 2 టీస్పూన్లు.
39
స్వీట్ కార్న్ ఇడ్లీ ఎలా చేయాలి?
Image Credit : Gemini Ai

స్వీట్ కార్న్ ఇడ్లీ ఎలా చేయాలి?

ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్‌ని మిక్సీ జార్‌లో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. మిగిలిన ఒక కప్పు కార్న్‌ని అలాగే ఉంచుకోవచ్చు. దీనివల్ల ఇడ్లీలో అక్కడక్కడా స్వీట్ కార్న్ తగులుతూ తినేటప్పుడు మంచి రుచి ఇస్తుంది.
49
రవ్వ వేయించుకోవాలి
Image Credit : Gemini Ai

రవ్వ వేయించుకోవాలి

ఒక కడాయిని పొయ్యి మీద పెట్టి వేడయ్యాక రవ్వ వేసి సన్నటి మంట మీద సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వ రంగు మారాల్సిన అవసరం లేదు. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.
59
పోపు పెట్టుకోవాలి
Image Credit : Gemini Ai

పోపు పెట్టుకోవాలి

అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడాక మినపప్పు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తురిమిన అల్లం, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత తురిమిన క్యారెట్, పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసి ఒకట్రెండు నిమిషాలు వేయించాలి.
69
ఇప్పుడు మిశ్రమాన్ని కలుపుకోవాలి
Image Credit : Gemini Ai

ఇప్పుడు మిశ్రమాన్ని కలుపుకోవాలి

ఒక వెడల్పాటి గిన్నెలో వేయించిన రవ్వను వేయాలి. అందులో రుబ్బిన స్వీట్ కార్న్ పేస్ట్, పెరుగు, పోపు మిశ్రమం, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ పిండికి తగినట్లుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 15 నుంచి 20 నిమిషాలు నాననివ్వాలి. అప్పుడు రవ్వ పెరుగును పీల్చుకుని బాగా నానుతుంది.
79
స్వీట్ కార్న్ ఇడ్లీ రెడీ
Image Credit : Gemini Ai

స్వీట్ కార్న్ ఇడ్లీ రెడీ

ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి తయారు చేసుకున్న పిండిని అందులో వేయాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించి, ఇడ్లీ ప్లేట్లను లోపల పెట్టి మూత పెట్టాలి. సన్నటి మంట మీద సుమారు 12 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. ఇడ్లీ ఉడికిందో లేదో ఒక పుల్లతో గుచ్చి చూస్తే తెలుస్తుంది. పిండి అంటుకోకపోతే ఇడ్లీ తయారైనట్లే.
89
స్వీట్ కార్న్ ఇడ్లీకి సరైన కాంబినేషన్స్
Image Credit : Gemini Ai

స్వీట్ కార్న్ ఇడ్లీకి సరైన కాంబినేషన్స్

ఇడ్లీ ఉడికిన తర్వాత పొయ్యి ఆపేయాలి. ఆ తర్వాత ఒక గరిటెతో మెల్లగా తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. రుచికరమైన, మృదువైన స్వీట్ కార్న్ ఇడ్లీ రెడీ.

ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, పుదీనా చట్నీ, కారం చట్నీ, సాంబార్‌తో వడ్డించవచ్చు. ముఖ్యంగా కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో కలిపి తిన్నప్పుడు స్వీట్ కార్న్ కాస్త తీయటి రుచితో అద్భుతంగా ఉంటుంది.

99
స్వీట్ కార్న్ ఇడ్లీ తయారీకి ముఖ్యమైన చిట్కాలు
Image Credit : Gemini Ai

స్వీట్ కార్న్ ఇడ్లీ తయారీకి ముఖ్యమైన చిట్కాలు

రవ్వను కాస్త వేయించి ఉపయోగిస్తే ఇడ్లీ రుచి, సువాసన పెరుగుతాయి. స్వీట్ కార్న్‌ను పూర్తిగా రుబ్బకుండా కొంత భాగం అలాగే వేస్తే మంచి రుచి వస్తుంది. పిండిని 15 నుంచి 20 నిమిషాలు నాననివ్వడం ముఖ్యం. పిండి మరీ గట్టిగా ఉంటే ఇడ్లీ కఠినంగా మారుతుంది. అందుకే సరైన పదునులో నీళ్లు కలుపుకోవాలి. ఎక్కువసేపు ఉడికిస్తే ఇడ్లీ ఎండిపోయే అవకాశం ఉంది. పిల్లలకు చేసేటప్పుడు పచ్చిమిర్చిని తగ్గించుకోవచ్చు.

స్వీట్ కార్న్, రవ్వ, పెరుగు, క్యారెట్ లాంటి పదార్థాలు ఉండడం వల్ల రుచితో పాటే పోషకాలను ఇస్తుంది. స్వీట్ కార్న్‌లో ఫైబర్ ఉంటుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. పెరుగు కాల్షియం, ప్రొటీన్లను అందిస్తుంది. రవ్వ శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. దీన్ని పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టొచ్చు. వెరైటీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒకసారి ఇంట్లో ట్రై చేయండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
పండ్ల మీద స్టిక్కర్లు, నంబర్లు ఎందుకుంటాయి? ఏ అంకె ఏం చెబుతుంది?
Recommended image2
భూమి లోపల దాగి ఉండే అద్భుతం.. ఎల్లేరు గడ్డ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Egg Ponganalu: ఇడ్లీ, దోశె బోర్ కొట్టిందా?..ఈ రెసిపీ ట్రై చేయండి..పిల్లలు ఇష్టంగా లాగించేస్తారు
Related Stories
Recommended image1
Stainless Steel: మన ఇంట్లో మెరిసే స్టీల్ పాత్రలు ఒరిజనలేనా? ఎలా గుర్తించాలి?
Recommended image2
Hair care: చలికాలంలో జుట్టుకు ఏ నూనె మంచిది? ఆవ నూనె, కొబ్బరి నూనె? నూనె రాయకపోయినా పర్లేదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved