బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ A, ఫైబర్, పపైన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో ఇది సహజ సౌందర్య టానిక్‌గా పనిచేస్తుంది.
బొప్పాయి పండులోని పపైన్ చనిపోయిన కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఇది కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది, చర్మ స్థితిస్థాపకతను పెంచి ముడతలను తగ్గిస్తుంది.
బొప్పాయి గుజ్జు, పెరుగు కలిపి ముఖం, మెడపై అప్లై చేసుకుని, 20 నిమిషాల తర్వాత కడిగితే చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది, తేమతో నిండి సహజ మెరుపు పొందుతుంది
బొప్పాయి గుజ్జులో ఒక చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనె చర్మానికి అదనపు తేమను అందిస్తుంది. దానిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి.
పిసికిన బొప్పాయిలో పెరుగు, పసుపు కలిపి ముఖానికి రాయండి. 15 నిమిషాల తర్వాత కడిగితే చర్మం వెలిగిపోతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా నల్ల మచ్చలను తగ్గిస్తాయి.
బొప్పాయి, పెరుగు, ఓట్స్ లను పేస్ట్ లా తయారు చేసి, ముఖానికి అప్లై చేయండి. మృదువుగా మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత కడిగితే.. చర్మం శుభ్రంగా, తాజాగా కనిపిస్తుంది. చనిపోయిన కణాలు పోతాయి.
పండిన బొప్పాయిలో పెరుగు, నిమ్మరసం కలిపి పేస్ట్‌గా తయారుచేసి, మచ్చలపై రాయండి. 10 నిమిషాల తర్వాత కడిగితే పిగ్మెంటేషన్ తగ్గుతుంది.
ఈ ఫేస్ మాస్క్‌లను వారంలో 1-2 సార్లు వాడండి. ఊహించని ఫలితాలు చూస్తారు.
సెన్సిటివ్ చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి ఉపయోగించాలి. కొందరికి పెరుగు, నిమ్మరసం పడవు.