MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Insects: ఇదొక్కటి కలిపితే..బియ్యం పిండి, గోధుమ పిండికి చిన్న పురుగు కూడా పట్టదు..!

Insects: ఇదొక్కటి కలిపితే..బియ్యం పిండి, గోధుమ పిండికి చిన్న పురుగు కూడా పట్టదు..!

వేసవిలో వేడి కి, గాలిలో తేమకు లేదా గదిలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా బియ్యం, పప్పులు, పిండ్లకు పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది

2 Min read
Author : ramya Sridhar
Published : May 24 2025, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బియ్యం, పప్పులు, పిండ్లకు పరుగులు పట్టొద్దంటే..
Image Credit : pinterest

బియ్యం, పప్పులు, పిండ్లకు పరుగులు పట్టొద్దంటే..

ప్రతి ఒక్కరి వంటింట్లో బియ్యం పిండి, గోధుమ పిండి, శెనగ పిండి లాంటివి ఉంటూనే ఉంటాయి. చాలా మంది ఈ పిండ్లను చాలా తక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే ఎక్కడ పురుగులు పట్టేస్తాయో అని భయపడతారు. ఈ మధ్య అయితే చాలా మంది ఎక్కడ ఈ పప్పులు, పిండ్లకు పురుగులు పడుతున్నాయి కదా అని అన్నీ ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసేస్తున్నారు.కానీ, అలా అందరూ దాచుకోలేరు కదా.. అసలు బియ్యం, పప్పులు, పిండ్లకు పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏం కలపాలి?
Image Credit : unsplash

ఏం కలపాలి?

వేసవిలో వేడి కి, గాలిలో తేమకు లేదా గదిలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా బియ్యం, పప్పులు, పిండ్లకు పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ, కేవలం ఒకే ఒక్కటి వీటిలో చేర్చడం వల్ల సంవత్సరాలపాటు స్టోర్ చేసుకోవచ్చు. అది మరేంటో కాదు.. రాతి ఉప్పు. ప్రతి ఒక్కరి ఇంట్లో రాతి ఉప్పు కచ్చితంగా ఉంటుంది. దీనిని కనుక కొద్దిగా మీరు పప్పు, బియ్యం, పిండి నిల్వ చేసిన డబ్బాలో వేస్తే చాలు.

35
రాతి ఉప్పు ఎలా కలపాలి?
Image Credit : Freepik

రాతి ఉప్పు ఎలా కలపాలి?

ముందుగా..గాలి చొరబడని డబ్బాలో బియ్యం పిండి లేదా ఇతర పదార్థాన్ని వేసుకోవాలి. (ప్లాస్టిక్ కంటే గాజు లేదా స్టీల్ కంటైనర్ ఉత్తమం)

అందులో ½ టీ స్పూన్ రాతి ఉప్పు (సాధారణ వంట ఉప్పు కాకుండా, పెద్దగడ్డలుగా ఉండే ఉప్పు మంచిది) వేసి బాగా కలపాలి. తర్వాత డబ్బాకి గాలి తగలకుండా మూత పెట్టాలి. ఉప్పు కలిపితే పిండి పాడౌతుందనే భయం అక్కర్లేదు. తిరిగి వాడుకొనేటప్పుడు పప్పు, బియ్యం లాంటివి కడిగేస్తే ఆ ఉప్పు పోతుంది. ఇక.. పిండిలో అయితే రాతి ఉప్పే కాబట్టి ఏరేయవచ్చు. అలా ఏరడం కుదరదు అనుకున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మనం దాదాపు 2, 3 కేజీల పిండిలో ఒక స్పూన్ మాత్రమే రాతి ఉప్పు కలుపుతాం కాబట్టి.. ఉప్పు ఎక్కువ అవుతుందనే భయం ఉండదు. పిండి కలుపుకొనేటప్పుడు కాస్త చూసుకొని కలుపుకుంటే చాలు.

45
రాతి ఉప్పే ఎందుకు కలపాలో తెలుసా?
Image Credit : Getty

రాతి ఉప్పే ఎందుకు కలపాలో తెలుసా?

రాతి ఉప్పు తేమను పీల్చుకుని పొడి పదార్థాన్ని పొడిగా ఉంచుతుంది.ఇది కీటకాలను ఆకర్షించకుండా చేస్తుంది.సహజమైన యాంటీ ఫంగల్ , యాంటీ ఇన్సెక్ట్ గుణాలు కలిగి ఉంటుంది.

55
ఉప్పు కలపడం ఇష్టం లేకపోతే..
Image Credit : Getty

ఉప్పు కలపడం ఇష్టం లేకపోతే..

ఉప్పును నేరుగా పదార్థంలో కలపకడం ఇష్టం లేకుంటే..ఉప్పును ఒక చిన్న కవర్‌లో వేసి, అదే డబ్బాలో ఉంచవచ్చు. నెలరోజులకి ఒకసారి ఈ ప్యాకెట్ మార్చుకుంటే సరిపోతుంది.ఇలా చేసినా కూడా పప్పు, బియ్యం, పిండ్లకు పురుగులు పట్టకుండా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది!
Recommended image2
Summer Food: వేసవిలో పిల్లలకు కచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved