MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం

Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం

Moringa Leaf Powder: మునగాకు పొడితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అధిక డిమాండ్ కారణంగా మార్కెట్ లో కల్తీ పెరుగుతోంది. అయితే, ఇంట్లోనే స్వచ్ఛమైన మునగాకు పొడిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 10 2026, 07:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మునగాకు పొడి ఇంట్లోనే ఎలా చేసుకోవాలి?
Image Credit : Getty

మునగాకు పొడి ఇంట్లోనే ఎలా చేసుకోవాలి?

మునగ చెట్టును మనం ఒక అద్భుతమైన 'సూపర్ ఫుడ్' అని పిలుస్తాం. దీని ఆకుల్లో ఉండే పోషకాలు మరెక్కడా దొరకవు. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం మునగాకు పొడిని క్రమంతప్పకుండా తింటున్నారు. రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకుంటున్నారు. అయితే చాలా మంది ఈ పొడిని మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తుంటారు. కానీ బయట దొరికే పొడిలో నాణ్యత విషయంలో సందేహాలు ఉంటాయి. అందుకే ఎలాంటి కల్తీ లేని, వంద శాతం ప్యూర్ మునగాకు పొడిని మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తి వివరాలతో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మునగాకు పొడికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు
Image Credit : Asianet News

మునగాకు పొడికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు

ఇంట్లో మునగాకు పొడి సిద్ధం చేయడానికి కొన్ని సాధారణ వస్తువులు ఉంటే సరిపోతుంది..

• తాజా, పచ్చని మునగాకులు

• శుభ్రమైన నీరు

• ఒక కాటన్ క్లాాాత్

• ఒక పెద్ద ట్రే లేదా జాలి ప్లేట్

• మిక్సీ గ్రైండర్

• ఒక సన్నని జల్లెడ

• ఎయిర్‌టైట్ జార్

Related Articles

Related image1
తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Related image2
Rainy Season Diet Tips: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? జాగ్రత్త !
36
మునగ ఆకుల ఎంపిక, శుభ్రం చేయడం ఎలాగంటే?
Image Credit : chatgpt

మునగ ఆకుల ఎంపిక, శుభ్రం చేయడం ఎలాగంటే?

ముందుగా మునగ చెట్టు నుండి మంచి తాజా, పచ్చగా ఉండే ఆకులను ఏరుకోవాలి. పురుగులు పట్టిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను అసలు తీసుకోకూడదు. నాణ్యమైన ఆకులు మంచి రుచితో పాటు సరైన పోషకాలను ఇస్తాయి. ఆ తర్వాత ఈ మునగాకులను 2 నుండి 3 సార్లు శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. దీనివల్ల ఆకులపై ఉన్న దుమ్ము, ధూళి, మట్టి సహా ఇతర వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి.

46
మునగ ఆకులను ఆరబెట్టే విధానం
Image Credit : Getty

మునగ ఆకులను ఆరబెట్టే విధానం

కడిగిన మునగ ఆకులను ఒక పొడి కాటన్ క్లాాత్ లేదా కిచెన్ టవల్ మీద పరచాలి. ఆకులపై ఉన్న అదనపు నీటిని మెల్లగా తుడిచి వేయాలి. ఆకులలో కాస్త తేమ ఉన్నా కూడా పొడి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆకులను ఒక పెద్ద ట్రేలో పలుచగా పరిచి, గాలి తగిలే శుభ్రమైన ప్రదేశంలో ఆరబెట్టాలి. మధ్యమధ్యలో ఆకులను కలుపుతూ ఉండాలి. అయితే ఆకులను వేడి ఎండలో ఆరబెట్టకూడదు. తీవ్రమైన ఎండ తగిలితే ఆకులలో ఉండే సహజ పోషకాలు తగ్గిపోతాయి.

56
మిక్సీలో గ్రైండింగ్.. జల్లించడం
Image Credit : Getty

మిక్సీలో గ్రైండింగ్.. జల్లించడం

మునగ ఆకులు బాగా ఎండిన తర్వాత అంటే నీరు లేకుండా ఆరిన తర్వాత, చేతితో నలిపితే సులభంగా విరిగిపోతాయి లేదా పొడిలా మారతాయి. ఆకులు ఈ స్థితికి వచ్చాయంటే అవి పౌడర్ తయారీకి సిద్ధంగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఈ ఎండిన ఆకులను మిక్సీ జార్‌లో వేసి సన్నగా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పొడిని సన్నని జల్లెడలో వేసి బాగా జల్లించాలి. జల్లించగా పైన మిగిలిపోయిన పెద్ద ముక్కలను మళ్లీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, తిరిగి జల్లించుకోవాలి.

66
మనగాకు పొడిని నిల్వ చేయడం
Image Credit : Getty

మనగాకు పొడిని నిల్వ చేయడం

ఇలా తయారైన ప్యూర్ మునగాకు పొడిని పూర్తిగా పొడిగా ఉన్న, ఎయిర్‌టైట్ గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ సీసాను చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి. తేమ తగలకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు కావలసినప్పుడు ఈ స్వచ్ఛమైన, ఇంట్లోనే తయారైన మునగాకు పొడిని మీ ఆహారంలో లేదా పానీయాలలో ఉపయోగించుకోవచ్చు.

మునగాకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బయట మార్కెట్లో దొరికే కెమికల్స్ కలిపిన పొడుల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే ఈ మునగాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది, ఎంతో సురక్షితమైనది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage Rules : ఈ అబ్బాయిలు పాాకిస్థాన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దా? ఎందుకో తెలుసా?
Recommended image2
సౌదీ అబ్బాయిలు ఈ 4 దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట, ఎందుకో తెలుసా?
Recommended image3
Jail Timings : ఫుడ్ నుండి బెడ్ వరకు... జైల్లో ఖైదీల దినచర్య ఎలా ఉంటుంది? 24 గంటల టైమ్ టేబుల్ ఇదే
Related Stories
Recommended image1
తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Recommended image2
Rainy Season Diet Tips: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? జాగ్రత్త !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved