Rice Water: బియ్యం నీటిలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది!
బియ్యం కడిగిన నీళ్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అయితే బియ్యం నీటిలో ఈ ఒక్క పదార్థాన్ని కలిపి జుట్టుకు రాస్తే, మీ జుట్టు చాలా తక్కువ సమయంలో నల్లగా, పొడవుగా మారుతుంది. మరి ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకుందామా..
- FB
- TW
- Linkdin
Follow Us
)
జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దానికోసం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్, షాంపూ, సీరం వంటివి వాడుతుంటారు. కానీ వాటిలో ఉండే రసాయనాలు జుట్టుకు మేలు చేయకపోగా.. హాని చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సహజ పద్ధతిలో జుట్టు ఎలా పెంచుకోవాలో ఇక్కడ చూద్దాం.
బియ్యం నీళ్లు, లవంగం
ఇంట్లో దొరికే రెండు పదార్థాలతో జుట్టును పొడవుగా చేసుకోవచ్చు. అవే బియ్యం నీళ్లు, లవంగం. బియ్యం నీటిలో లవంగం కలిపి జుట్టుకు రాస్తే, జుట్టు చాలా తక్కువ సమయంలో పొడవుగా పెరుగుతుంది. బియ్యం, లవంగం నీటిని ఎలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- బియ్యం 2 స్పూన్లు
ఒక కప్పు వాటర్
లవంగాలు- 8 నుంచి 10
టోనర్ తయారీ..
ఒక పెద్ద గిన్నెలో 2 టీస్పూన్ల బియ్యం, నీరు, లవంగం వేసి 4-5 గంటలు నానబెట్టాలి. నీరు పసుపు రంగులోకి మారుతుంది. టోనర్ అయిన తర్వాత స్ప్రే బాటిల్‌లో పోసి జుట్టుకు స్ప్రే చేయండి. దీనికి వాసన ఉండదు. ఎప్పుడైనా రాసుకోవచ్చు. తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. రాత్రి పడుకునే ముందు రాసుకోవడం మంచిది.
లవంగం, బియ్యం నీటి ఉపయోగాలు
లవంగం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మం పొడిబారడాన్ని నివారిస్తాయి. జుట్టు వేర్లను బలపరుస్తాయి. బియ్యం నీటిలో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టుకు మెరుపును ఇస్తుంది. జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది.