MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Amarnath Yatra 2026: లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే.. హైదరాబాద్ టు అమర్‌నాథ్ యాత్ర ఫుల్ ట్రైన్ ప్లాన్ ఇదిగో !

Amarnath Yatra 2026: లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే.. హైదరాబాద్ టు అమర్‌నాథ్ యాత్ర ఫుల్ ట్రైన్ ప్లాన్ ఇదిగో !

Amarnath Yatra 2026: సనాతన ధర్మంలో అమర్‌నాథ్ యాత్రకు అత్యున్నత స్థానం ఉంది. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే. హైదరాబాద్ నుండి అమర్‌నాథ్ యాత్ర 2026కు వెళ్లే భక్తుల కోసం పూర్తి ట్రైన్ రూట్ ప్లాన్, బాబా బర్ఫానీ క్షేత్ర విశేషాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 02 2026, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Amarnath Yatra 2026: హైదరాబాద్ టు అమర్‌నాథ్.. ట్రైన్ రూట్ ప్లాన్, రిజిస్ట్రేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇవే !
Image Credit : Pinterest

Amarnath Yatra 2026: హైదరాబాద్ టు అమర్‌నాథ్.. ట్రైన్ రూట్ ప్లాన్, రిజిస్ట్రేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇవే !

హిమాలయాల మంచు శిఖరాల మధ్య వెలసిన అమర్‌నాథ్ యాత్ర ప్రతి హిందువుకూ ఒక కల, పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గుహలో ప్రతి ఏటా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చంద్రుని మార్పులకు అనుగుణంగా ఈ లింగం పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.

ఇది కేవలం శివక్షేత్రమే కాదు, 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి గొంతు భాగం పడిందని నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని మహామాయ అని పిలుస్తారు. మంచు కొండలు, జలపాతాలు, లోయల గుండా సాగే ఈ ప్రయాణం శారీరక శ్రమతో కూడుకున్నదైనా, మనసుకు ఎనలేని ప్రశాంతతను ఇస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జీవితంలో ఒక్కసారైనా అమర్‌నాథ్ యాత్రకు ఎందుకు వెళ్లి రావాలి?
Image Credit : Gemini

జీవితంలో ఒక్కసారైనా అమర్‌నాథ్ యాత్రకు ఎందుకు వెళ్లి రావాలి?

సనాతన ధర్మంలో అమర్‌నాథ్ యాత్రకు అత్యున్నత స్థానం ఉంది. హిమాలయాల్లోని తీవ్రమైన చలిని, కఠినమైన దారిని అధిగమించి అక్కడికి చేరుకున్నప్పుడు మనిషిలో అహంకారం నశించి, వైరాగ్యం, భక్తిభావం కలుగుతాయి. జీవన గమనాన్ని మార్చే ఆధ్యాత్మిక పరిణతి ఈ యాత్ర ద్వారా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఎంత కష్టమైనా లైఫ్‌లో ఒక్కసారైనా ఆ బాబా బర్ఫానీని దర్శించుకోవాలని భక్తులు తపిస్తుంటారు.

36
అమర్‌నాథీశ్వరుని మహిమలు.. పురాణ గాథలు ఏమిటి?
Image Credit : others

అమర్‌నాథీశ్వరుని మహిమలు.. పురాణ గాథలు ఏమిటి?

పార్వతీదేవి కోరిక మేరకు పరమశివుడు ఆమెకు సృష్టి రహస్యాన్ని, తనకు మరణం లేని అమరత్వాన్ని ప్రసాదించిన కథను వినిపించడానికి ఎంచుకున్న పరమ పవిత్ర స్థలమే ఈ గుహ. ఈ రహస్యాన్ని వేరెవరూ వినకూడదని, గుహకు వెళ్లే దారిలో శివుడు తనకున్న సమస్తాన్ని ఒక్కొక్కటిగా వదిలిపెట్టాడు. ఈ ప్రదేశాలన్నీ నేటికీ యాత్రలో ముఖ్యమైన మైలురాళ్లుగా నిలిచాయి.

  • తన వాహనమైన నందిని వదిలిన చోటు - పహల్గామ్
  • జటాజూటం నుండి చంద్రుడిని విడిచిన చోటు - చందన్ వాడీ
  • ఒంటిపై ఉన్న పాములను వదిలిన చోటు - శేషనాగ్ సరస్సు
  • తన కుమారుడైన వినాయకుడిని ఉంచిన చోటు - మహాగుణాస్ పర్వతం
  • పంచభూతాలను విడిచిపెట్టిన చోటు - పంచతరణి

పరమశివుడు పార్వతీదేవికి కథ చెబుతున్నప్పుడు, కూర్చున్న ఆసనం కింద ఉన్న ఒక పక్షి గుడ్డు నుండి పుట్టిన రెండు పావురాలు ఆ కథను విన్నాయట. ఆ కథ మహిమ వల్ల అవి అమరత్వాన్ని పొందాయని పురాణాలు చెబుతున్నాయి. నేటికీ, ఆ అత్యంత శీతల వాతావరణంలో, గడ్డకట్టే మంచు గుహలో భక్తులకు రెండు తెల్లటి పావురాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇది ఇక్కడి అతిపెద్ద మహిమగా, అద్భుతంగా నమ్ముతారు.

46
అమర్‌నాథ్ యాత్ర : హైదరాబాద్ నుంచి ట్రైన్ ప్లాన్ వివరాలు ఇవే
Image Credit : Asianet News

అమర్‌నాథ్ యాత్ర : హైదరాబాద్ నుంచి ట్రైన్ ప్లాన్ వివరాలు ఇవే

హైదరాబాద్ నుండి అమర్‌నాథ్ వెళ్లడానికి నేరుగా జమ్మూ వరకు లేదా దిల్లీ మీదుగా వెళ్లేందుకు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. యాత్రకు బేస్ క్యాంప్ అయిన జమ్మూ తావి కి రైలు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది.

నేరుగా వెళ్లే రైళ్లు (హైదరాబాద్ నుండి జమ్మూ తావి)

• Himsagar Express (Train No: 16317): ఇది వారానికి ఒకరోజు (శుక్రవారం) సికింద్రాబాద్ మీదుగా వెళ్తుంది.

• Navyug Express (Train No: 16687): ఇది కూడా వారానికి ఒకరోజు (సోమవారం) అందుబాటులో ఉంటుంది.

ఢిల్లీ మీదుగా ప్రయాణం

నేరుగా వెళ్లే రైళ్లలో సీట్లు దొరకడం కష్టమైతే, ఢిల్లీకి వెళ్లి అక్కడి నుండి జమ్మూకి వెళ్లడం చాలా సులువైన మార్గం.

• స్టెప్ 1: సికింద్రాబాద్ నుండి ఢిల్లీకి రోజువారీ నడిచే రాజధాని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, లేదా దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి వేగవంతమైన రైళ్లలో వెళ్లవచ్చు.

• స్టెప్ 2: ఢిల్లీ నుండి జమ్మూ తావి కి ప్రతిరోజూ చాలా రైళ్లు ఉన్నాయి.

56
జమ్మూ నుండి అమర్‌నాథ్ గుహ వరకు ప్రయాణ మార్గాలు ఏమిటి?
Image Credit : Getty

జమ్మూ నుండి అమర్‌నాథ్ గుహ వరకు ప్రయాణ మార్గాలు ఏమిటి?

జమ్మూ చేరుకున్నాక, అక్కడ నుంచి శ్రీనగర్ మీదుగా బేస్ క్యాంప్‌లకు బస్సులు లేదా టాక్సీలు ఈజీగా దొరుకుతాయి. యాత్రకు రెండు మార్గాలు ఉన్నాయి:

1. పహల్గామ్ మార్గం: ఇది సాంప్రదాయక మార్గం. సుమారు 46 కిలోమీటర్ల నడక ఉంటుంది. కొంచెం నిదానంగా, 3 నుండి 4 రోజులు పడుతుంది. కానీ ఇక్కడ ప్రకృతి అందాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి.

2. బాల్తాల్ మార్గం: ఇది కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే. చాలా నిటారుగా ఉంటుంది, 1-2 రోజుల్లో పూర్తి చేయవచ్చు. హెలికాప్టర్ సర్వీసులు ఈ రూట్ నుండే ఎక్కువగా నడుస్తాయి.

66
అమర్‌నాథ్ యాత్ర 2026 ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
Image Credit : our own

అమర్‌నాథ్ యాత్ర 2026 ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుండి ఆగస్టు 28 వరకు ఉంటుంది. అమర్‌నాథ్ బోర్డు (SASB) నియమాల ప్రకారం యాత్రకు వెళ్లే ముందు ఆథరైజ్డ్ డాక్టర్ నుండి హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ బ్యాంకుల ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. 13 ఏళ్ల లోపు వారు, 70 ఏళ్లు పైబడిన వారు ఈ యాత్రకు అనర్హులు. వాతావరణ పరిస్థితులను బట్టి తేదీలు మారవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ప్రయాణం
భారత దేశం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
America: అమెరికాలో ఇళ్ల ముందు కరెంటు స్తంభాలు, వైర్లు ఎందుకు కనిపించవు?
Recommended image2
Coins in River: నదుల్లో నాణేలు వేయడం వెనుక అసలు నిజం ఇది.. ఇకనైనా వేయడం ఆపండి
Recommended image3
Snake Venom Medicines: ప్రాణాలు తీసే పాముల విషమే ఇప్పుడు సంజీవని !
Related Stories
Recommended image1
Hyderabad Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సునామీ.. పక్కనే మరో భాగ్యనగరం !
Recommended image2
Marakata Shiva Lingam: ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే చాలు.. మీ బాడీలోని రోగాలన్నీ సెట్ ! తెలంగాణ వైద్యనాథుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved