MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ కి అతిపెద్ద అవమానం, అడ్వాన్స్ ఇవ్వకపోతే మేకప్ వేసుకోవా? వెళ్ళిపో! సూపర్ స్టార్ పరువు తీసిన నిర్మాత

రజినీకాంత్ కి అతిపెద్ద అవమానం, అడ్వాన్స్ ఇవ్వకపోతే మేకప్ వేసుకోవా? వెళ్ళిపో! సూపర్ స్టార్ పరువు తీసిన నిర్మాత

రజినీకాంత్ ఇండియాలోనే అతిపెద్ద హీరో. అలాంటి సూపర్ స్టార్ ని ఓ ప్రొడ్యూసర్ దారుణంగా అవమానించాడట. నువ్వు నా సినిమాలో నటించాల్సిన అవసరం లేదు పో అన్నాడట...  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 02 2024, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rajinikanth

Rajinikanth

సిల్వర్ స్క్రీన్ పై రజినీకాంత్ ఒక సెన్సేషన్. ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏ హీరోకి సాధ్యం కానివి. స్టైల్ ఐకాన్ గా ఒక ట్రెండ్ సెట్ చేశారు. వృత్తిరీత్యా కండక్టర్ అయిన రజినీకాంత్ మిత్రుడు సలహా మేరకు నటన వైపు అడుగులు వేశారు. చెన్నై వచ్చి యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు. 


 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

లెజెండరీ దర్శకుడు కే బాలచందర్ రజినీకాంత్ కి మొదటి అవకాశం ఇచ్చాడు. 1975లో విడుదలైన అపూర్వ రాగంగళ్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో విలన్, సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. పాత్ర ఏదైనా తన మార్క్ మేనరిజమ్స్ తో రజినీకాంత్ ఆకట్టుకునేవాడు. 

37
Rajinikanth

Rajinikanth

రజినీకాంత్ హీరోగా మొదట చేసింది తెలుగులోనే. చిలకమ్మ చెప్పింది మూవీలో పూర్తి స్థాయి హీరో రోల్ చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. 80ల నాటికి రజినీకాంత్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక 90లలో రజినీకాంత్ ఫేమ్ ఇండియా వైడ్ పాకింది. ముత్తు, అరుణాచలం, నరసింహ, భాష చిత్రాలు రజినీకాంత్ స్టార్డం ని ఎక్కడికో తీసుకుపోయాయి. 
 

47

చెప్పాలంటే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ రజినీకాంత్. జపాన్ దేశంలో కూడా ఆయన చిత్రాలకు మార్కెట్ ఉండేది. ముత్తు చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఉంది. ముత్తు రికార్డుని ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ళు ముత్తు రికార్డును ఏ చిత్రం చేరుకోలేకపోయింది.

57

రజినీకాంత్ దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో. ఆయన గత చిత్రం జైలర్ వరల్డ్ వైడ్ రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి రజినీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 210 కోట్లు అని సమాచారం. ప్రభాస్, షారుక్, విజయ్ తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా ఎక్కువ. అలాంటి రజినీకాంత్ ని కేవలం రూ. 1000 కోసం అవమానించాడట ఓ ప్రొడ్యూసర్. 
 

67

రజినీకాంత్ హీరోగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఓ మూవీలో ఆఫర్ వచ్చిందట. రూ. 6000 రెమ్యూనరేషన్ గా మాట్లాడుకున్నారట. షూటింగ్ మొదటి రోజు రజినీకాంత్ సెట్స్ కి వెళ్ళాడట. హీరో వచ్చాడు మేకప్ వేయమని నిర్మాత మేకప్ మెన్ కి చెప్పాడట. తన రెమ్యునరేషన్ లో ఒక వెయ్యి రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వండని రజినీకాంత్... నిర్మాతను అడిగాడట. వెంటనే రజినీకాంత్ మీద నిర్మాత ఫైర్ అయ్యాడట. 
 

77
Rajinikanth

Rajinikanth

అడ్వాన్స్ ఇస్తే కానీ మేకప్ వేసుకోనంత పెద్ద స్టార్ వా నువ్వు? ఈ సినిమాలో నీకు ఛాన్స్ లేదు వెళ్ళిపో అని తీవ్రంగా అవమానించాడట. రజినీకాంత్ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడట. పట్టుదలతో రజినీకాంత్ వచ్చిన ప్రతి పాత్ర చేస్తూ, నటుడిగా నిరూపించుకుని స్టార్ హీరో అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో సూపర్ స్టార్ కి కూడా అవమానాలు తప్పలేదట.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Cannes: రాకుమారిలా అలియా భట్.. గ్రీన్ గౌను వేసుకుని కేన్స్‌లో మెరుపులు..
Recommended image2
Biggest Flop Movie: రూ.1400 కోట్లు పెట్టి తీస్తే, వచ్చింది రూ.6 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్
Recommended image3
Seerat Kapoor: నువ్వు అల్లు అర్జున్ ప్రాపర్టీ.. అన్న నెటిజన్, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved