MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ‘లైగర్’ జోడీని ఆశీర్వదించిన విజయ్ దేవరకొండ తల్లి.. ఆనందంలో మునిగితేలుతున్న అనన్య పాండే..

‘లైగర్’ జోడీని ఆశీర్వదించిన విజయ్ దేవరకొండ తల్లి.. ఆనందంలో మునిగితేలుతున్న అనన్య పాండే..

‘లైగర్’ (Liger) జోడీని తాజాగా విజయ్ దేవరకొండ తల్లి నిండు మనస్సుతో దీవించింది. కొద్ది రోజుల్లో సినిమా విడుదల సందర్భంగా విజయ్ ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలో బాలీవుడ్ బ్యూటీ అనన్య కూడా పాల్గొంది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 17 2022, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) మరికొద్ది రోజుల్లో సౌత్ లో అడుగుపెట్టబోతోంది. వరుస హిందీ చిత్రాలతో తన మార్క్ చూపించిన ఈ సుందరి ఇకపై తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ బ్యూటీ ‘లైగర్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సెన్సెషన్ స్టార్ విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా నటించిన  స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘లైగర్’. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్టు 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగు, హిందీలో రూపొందించగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. 
 

36

విడుదలకు దగ్గరవుతున్న ఈ చిత్రాన్ని మేకర్స్ క్రేజీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో విజయ్ దేవరకొండ (Vijaya Deverakonda), అనన్య పాండే కలిసి పాల్గొనడంతో పాటు.. క్రేజీ  ఫొటోషూట్లతోనూ అదరగొడుతున్నారు. ఇప్పటికే నార్త్, సౌత్ అంతటా కలియ తిరుగుతున్న ఈ జంట తాజాగా హైదరాబాద్ లోనే ప్రత్యక్షమైంది.
 

46

తొలిసారిగా  పాన్ ఇండియా సినిమా  ‘లైగర్’తో విజయ్  ప్రేక్షకుల ముందుకు వస్తుండటం.. అటు అనన్య పాండే కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుండటంతో విజయ్ దేవరకొండ ఇంట్లో సినిమా ఘన విజయం సాధించాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో విజయ్ కుటుంబ సభ్యులతో పాటు అనన్య పాండే కూడా పాల్గొంది. 
 

56

ఈ సందర్భంగా విజయ్ తల్లి మాధవి పూజానంతరం ‘లైగర్’ జోడీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనన్య పాండే తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. విజయ్ ఇంట్లో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నట్టు తెలిపింది. ఆశీర్వదించిన విజయ్ అమ్మగారికి ‘థ్యాంక్యూ ఆంటీ’ అంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. 
 

66

రీసెంట్ గా ‘లైగర్’ జంట ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ముంబై ట్రెయిన్ లో జర్నీ చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకోగా..  ఇటీవల పంజాబ్ సంప్రదాయ దుస్తుల్లో పచ్చని పంట పొలాల్లో ఫొటోషూట్ చేసి ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నారు. క్రేజీగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తూ చిత్రంపై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved