Samantha : ముంబైలో సమంత కొత్త ఇల్లు.. ఖరీదు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత జోరు పెంచింది. వరుస చిత్రాలకు సైన్ చేస్తోంది. సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో వరుస చిత్రాలు ఉన్నాయి.

Samantha
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత జోరు పెంచింది. వరుస చిత్రాలకు సైన్ చేస్తోంది. సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో వరుస చిత్రాలు ఉన్నాయి. బాలీవుడ్ లో సమంత సినిమాలు మాత్రమే కాక వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
Samantha
దీనితో సమంత హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా ఎక్కువ రోజులు స్టే చేయాల్సి ఉంటుంది. దీనితో సమంత చైతో విడిపోయినప్పటి నుంచి ముంబైలో ఒక మంచి హౌస్ కొనేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో సమంత ఇటీవల బాలీవుడ్ ప్రముఖులతో క్లోజ్ గా ఉంటోంది.
Samantha
ఇదిలా ఉండగా సమంత కొత్త ఇంటి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్లు తెలుస్తోంది. ముంబైలో సమంత రెండు సీ ఫేసింగ్ ఫ్లాట్స్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలో ఒక దానిని సమంత కొనబోతోందట. ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ. 3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు ఫ్లాట్స్ ఇంకా కంట్రక్షన్స్ జరుగుతున్నాయట.
Samantha
దీనితో సమంత అప్పటి వరకు రెంట్ హౌస్ లో ఉండనుంది. నిర్మాణం పూర్తయ్యాక తన కొత్త ఇంటికి షిప్ట్ కానున్నట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలోకి వెళ్లేందుకు సమంత చాలా ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంత ఇప్పటికే హిందిలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది.
Samantha
ప్రస్తుతం కొన్ని హిందీ ప్రాజెక్ట్స్ కి, పాన్ ఇండియా చిత్రాలని సమంత సైన్ చేసింది. రానున్న రోజుల్లో సమంత బాలీవుడ్ లో బాగా బిజీ కానుంది. దీనితో అవసరం కొద్దీ ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Samantha
సమంత నాగ చైతన్య గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకున్నారు. వీళ్లేందుకు విడిపోయారు అనేది కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే తెలియాలి. విడిపోయాక ఇద్దరూ ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు. నాగ చైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు.