మెగా ఎఫెక్ట్.. ఆ వెబ్ సిరీస్ కు నో చెప్పిన లావణ్య ట్రిపాఠి, కారణం అదేనట..?
మెగాఫ్యామిలీ ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. కాబోయే కోడలు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా ఫ్యామిలీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. చేసే సినిమాలు.. వెబ్ సిరీస్ ల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది.
Lavanya Tripathi and Varun Tej all set to enter wedlock on this date
మూడో కంటికి తెలియకుండా.. ఐదేళ్లు ప్రేమాయణం నడిపించారు.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి. వీరిపై అనుమానంతో ఎన్ని వార్తలు బయటకు వచ్చినా.. వీరు మాత్రం ఏమాత్రం బయట పడలేదు. హింట్ ఇవ్వలేదు. వాళ్ళంతటవాళ్లు అనౌన్స్ చేసేవరకూ.. ఈ విషయాన్ని ఎవరూ నిరూపించలేకపోయారు కూడా.
ఇక మెగా ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్లడం అంటే మాటలు కాదు. ఇప్పటికే కోట్లకు అదిపతి అయినా.. ఉపాసన మెగా ఇంటి కోడలిగా ఎలా ఉంటుందో చూశాం. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ ను పెళ్లాడబోతూ.. లావణ్య కూడా మెగా కోడలు కాబోతోంది. ఈక్రమంలో ఆమ్ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటుంది.
వరుణ్‌తేజ్, లావణ్యల నిశ్చితార్థం ఈమధ్యే జరిగింది. ఈ విషయం అందరికి తెలిసిందే... ఈ కారణంగా ఆమె సినిమాలు కూడా తగ్గించి చిన్నగా మానేయాలని కూడా అనుకుంటుందట. ప్రస్తుతం తమిళ్‌లో ఓ సినిమా మినహా ఆమె చేతిలో సినిమాల్లేవు. అయితే కొన్ని నెలల క్రితం కథ నచ్చటంతో ఆమె ఓ వెబ్ సిరీస్‌కి ఓకే చెప్పారు.
Lavanya Tripathi
స్కైలాబ్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఈమధ్యనే వచ్చిన ఈసినిమా కాస్త ఫన్నీగా మంచి పేరు మూటగట్టుకుంది. ఇఖ ఆసినిమాను డైరెక్ట్ చేసిన విశ్వక్ ఖండేరావ్ దర్శకుడిగా.. ఓ వెబ్ సిరీస్ లు తెరెక్కించాలి అనుకున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ను ముందు చేస్తానని ఒప్పుకున్న లావణ్య ఇప్పుడు ససేమిరా అనేసిందట.
కథ రీత్యా ఇందులో హీరోయిన్ పాత్ర కాస్తంత బోల్డ్‌గా ఉంటుందని తెలిసింది. పైగా ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుందట. అందుకే ఆ వెబ్‌సిరీస్ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్‌ని చూసుకోమని చెప్పేశారట లావణ్య. నిశ్చితార్థం అయిన తర్వాత ఇక నేను కొణిదలవారి కోడల్ని. ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పి పంపించేశారట.
Lavanya Tripathi
ఇక ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ తెగ ముచ్చట పడిపోతున్నారు. లావణ్య నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.ఇక త్వరలో వీరి పెళ్ళి జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇటలీలో ఈ పెళ్లి ఈవెంట్ ప్లాన్ చేశారట. అంతే కాదు. ఈ పెళ్లి తరువాత ఆమె నటిస్తుందా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ రావల్సి ఉంది.