మూడో భర్తకి బ్రేకప్ చెప్పి.. స్టయిలీష్ లుక్‌లో కేకపెట్టిస్తున్న వనితా విజయ్ కుమార్
First Published Dec 4, 2020, 3:13 PM IST
నటి వనితా విజయ్ కుమార్ ఆ మధ్య తన మూడో భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాగుబోతు భర్తని భరించలేనని తెలిపి తాను బ్రేకప్ చెప్పినట్టు వెల్లడించి టాక్ ఆఫ్ దిటౌన్ అయ్యింది. ఆ బాధ నుంచి త్వరగానే తేరుకున్నట్టు కనిపిస్తుంది. తాజాగా స్టయిలీష్ లుక్‌లోకి మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలతోపాటు టెలివిజన్‌లోనూ పాపులర్ అయ్యింది వనితా విజయ్ కుమార్ ఈ ఏడాది జూన్‌లో పీటర్ పాల్‌ని వివాహం చేసుకుంది. ఆయన తన భార్యకి విడాకులు ఇవ్వకుండానే వనితా మ్యారేజ్ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.

అయితే నాలుగు నెలల్లోనే పీటర్ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించింది. సిగరేట్‌కి, ఆల్కాహాల్‌కి బానిసైన పీటర్‌ని భరించలేనని, తనని అతడు మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆయన్నుంచి విడిపోయింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?