MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • వైసీపీ నేతకు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీ మండి పడుతుందా? ఓపెన్ గా చెప్పేసిన నిహారిక!

వైసీపీ నేతకు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీ మండి పడుతుందా? ఓపెన్ గా చెప్పేసిన నిహారిక!

వైసీపీ  నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ సతీసమేతంగా వెళ్లడం దుమారం రేపింది. ఈ ఘటనతో అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య అగాధం మరింత పెద్దది అయ్యిందనే వాదన వినిపించింది. తాజాగా ఈ ఘటనపై నిహారిక స్పందించింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 30 2024, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Allu Arjun

Allu Arjun


కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ 2024 ఏపీ ఎన్నికల్లో పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపుకోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని చిరంజీవి వీడియో బైట్ విడుదల చేశాడు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


నాగబాబు, ఆయన సతీమణి సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా రామ్ చరణ్ పిఠాపురం వెళ్ళాడు. అదే రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రధాన ప్రత్యర్థి పార్టీ వైసీపీకి అల్లు అర్జున్ పరోక్షంగా మద్దతు తెలిపాడు. నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ తరఫున  పోటీ చేసిన శిల్పా రవి రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళాడు. 
 

35

శిల్పా రవికి ఓటు వేసి గెలిపించాలని కోరాడు. అల్లు అర్జున్ చేసిన పని మెగా హీరోలకు మింగుడు పడలేదు. కానీ మౌనం వహించారు. మే 13న పోలింగ్ ముగిశాక నాగబాబు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ వేశాడు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే అని ఒక కామెంట్ పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో దాన్ని డిలీట్ చేశాడు.

45
Allu Arjun

Allu Arjun

అనంతరం సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా అకౌంట్స్ లో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మీద మెగా హీరోలు మండిపడుతున్నారనే కథనాలు వెలువడ్డాయి. ఇండస్ట్రీలో టాక్ నడిచింది. మెగా ఫ్యాన్స్ చేసే డ్యామేజ్ కి భయపడే పుష్ప 2 వాయిదా వేశారని కూడా ఊహాగానాలు వినిపించాయి.

55
Allu Arjun

Allu Arjun


అసలు వైసీపీ నేతకు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ విషయంలో మెగా హీరోల ఆలోచన ఏంటీ? అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై నిహారిక క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అన్నారు. అల్లు అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆయన వ్యక్తిగత విషయం. దానిపై మెగా ఫ్యామిలీలో ఎలాంటి వ్యతిరేకత లేదు, అన్నట్లు ఆమె పరోక్షంగా చెప్పింది.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Recommended image3
Folk Song: ప్యారడైజ్‌ మూవీలో దుమ్ములేపుతున్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌.. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved