MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పటాస్, టెంపర్, జనతా గ్యారేజ్ చిత్రాలు హరికృష్ణకి ఎంతో స్పెషల్.. ఎందుకో తెలుసా, తండ్రికి తారక్ ఇచ్చిన గిఫ్ట్

పటాస్, టెంపర్, జనతా గ్యారేజ్ చిత్రాలు హరికృష్ణకి ఎంతో స్పెషల్.. ఎందుకో తెలుసా, తండ్రికి తారక్ ఇచ్చిన గిఫ్ట్

నందమూరి హరికృష్ణ ముక్కుసూటి వ్యక్తి అనే విషయం అందరికి తెలుసు. హరికృష్ణ ప్రమాదంలో మరణించి చాలా ఏళ్ళు గడుస్తోంది. కానీ ఆయన గురించి తరచుగా అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ అయన రాణించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 03 2024, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR

NTR

నందమూరి హరికృష్ణ ముక్కుసూటి వ్యక్తి అనే విషయం అందరికి తెలుసు. హరికృష్ణ ప్రమాదంలో మరణించి చాలా ఏళ్ళు గడుస్తోంది. కానీ ఆయన గురించి తరచుగా అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ అయన రాణించారు. హరికృష్ణ గంభీరంగా కనపడతారు కానీ మనసు పరంగా సుతిమెత్తని వ్యక్తి అని సన్నిహితులు చెబుతుంటారు. కాకపోతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేయడం ఆయన అలవాటు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఒక సందర్భంలో తన తనయులు నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వల్ల ఏర్పడిన మధురమైన జ్ఞాపకాలని హరికృష్ణ గుర్తు చేసుకున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇజం చిత్ర ఆడియో లాంచ్ కి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటికి హరికృష్ణ వయసు 60 ఏళ్ళు. 

36
NTR

NTR

ఇజం ఆడియో లాంచ్ లో హరికృష్ణ మాట్లాడుతూ పటాస్, టెంపర్, జనతా గ్యారేజ్ చిత్రాలని గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రాలు తనకి ఎంతో స్పెషల్ అని తెలిపారు. నా 59 వ ఏటలో కళ్యాణ్ రామ్ నటించిన పటాస్, ఎన్టీఆర్ నటించిన టెంపర్ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. 

46

ఇప్పుడు 60 వ ఏటలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రం సూపర్ హిట్ అయింది. త్వరలో కళ్యాణ్ రామ్ ఇజం చిత్రం సూపర్ హిట్ కాబోతోంది అని ఆశించారు. అయితే ఇజం చిత్రం హిట్ కాలేదు కానీ యావరేజ్ గా నిలిచింది. తన తండ్రి ఎన్టీఆర్ తో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలతో ఇవి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. 

56

మీరు 60 లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి నా తరుపున జనతా గ్యారేజ్ చిత్రం ఒక గిఫ్ట్ అని ఎన్టీఆర్ చెప్పాడు. అది మరచిపోలేని ఆనందం అని హరికృష్ణ అన్నారు. ఈ ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గురించి చెప్పిన హరికృష్ణ.. తన పెద్ద కొడుకు జానకి రామ్ ని కూడా గుర్తు చేసుకున్నారు. 

66

జానకి రామ్ మరణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన హరికృష్ణ.. అతడి ఆశీస్సులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పై ఉంటాయని తెలిపారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ హిట్స్ కొడతారు డాడీ అని జానకి రామ్ తనతో చెప్పినట్లు హరికృష్ణ ఎమోషనల్ అయ్యారు. కానీ అర్జెంట్ పని మీద బయలుదేరి ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved