శంకర్ కి పుష్ప 2 డైరెక్టర్ సాయం.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ లో బిగ్ ట్విస్ట్ ?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. పుష్ప 2 తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ఇదే. శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ తొలిసారి నటించిన చిత్రం ఇది.
Game Changer
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. పుష్ప 2 తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ఇదే. శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ తొలిసారి నటించిన చిత్రం ఇది. శంకర్ గతంలో తెరకెక్కించిన పొలిటికల్ చిత్రాల స్టైల్ లో గేమ్ ఛేంజర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. రీసెంట్ గా రాంచరణ్ బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేలో పాల్గొని గేమ్ ఛేంజర్ విశేషాలు కొన్ని రివీల్ చేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎలాంటి చిత్రం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు శంకర్ గారి దర్శకత్వంలో నటించడం అద్భుతమైన అవకాశంగా అనిపించినట్లు రాంచరణ్ తెలిపారు.
త్వరలో అమెరికాలోని డల్లాస్ నగరంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. ఈ ఈవెంట్ లోనే గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారట. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ గెస్ట్ ఎవరో కాదు పుష్ప 2 చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని కుదిపేస్తున్న డైరెక్టర్ సుకుమార్ అని సమాచారం.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ చేత ట్రైలర్ లాంచ్ చేయించబోతున్నారు. అంటే గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ తో పాటు సుకుమార్ కూడా యుఎస్ వెళ్లనున్నారు. శంకర్ సినిమాకి సుకుమార్ ఈ రకంగా సాయం అందిస్తుండడం చెప్పుకోదగ్గ విషయమే.
దిల్ రాజుకి, సుకుమార్ కి మంచి రిలేషన్ ఉంది. సుకుమార్ కి దర్శకుడిగా తొలిసారి అవకాశం ఇచ్చింది దిల్ రాజే. ఇక రాంచరణ్ తో కూడా సుక్కుకి మంచి బాండింగ్ ఉంది. రంగస్థలం తర్వాత వీరిద్దరూ మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. సుకుమార్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయితే గేమ్ ఛేంజర్ కి మరింత బజ్ వస్తుందని చెప్పడంలో సందేహం లేదు.