తెలంగాణలో హరిత విప్లవం దిశగా రేవంత్ మార్క్ పాలన.. విప్లవాత్మక నిర్ణయాలు..
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్‌ను చూపిస్తున్నారు. పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదారబాద్‌లో చెరువులను సంరక్షించే దిశగా హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి విజన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణలో హరిత విప్లవం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారుతోన్న ప్రస్తుత తరుణంలో రేవంత్ రెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వాతావరణ సమస్యలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. పునరుత్పాదక ఇంధనం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరుద్ధరణతో తెలంగాణకు పచ్చదనంతో పాటు స్థిరమైన భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తున్నారు.
Revanth Reddy
రేవంత్ రెడ్డి తీసుకున్న ముఖ్యమైన ప్రాజెక్టుల్లో సరస్సుల పునరుద్దరణ ప్రధానమైంది. ఒకప్పుడు చెరువులకు, సరస్సులకు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో కబ్జాల కారణంగా సరస్సులు ఉనికిని కోల్పోయాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే 75 సరస్సుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. మొత్తం 2000 సరస్సులు రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్జీవమైన నీటి వనరులను పునరుద్ధరించనున్నారు. జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు భూగర్భ జలాలు నిండేలా ప్రణాళికలు వేస్తున్నారు. వసలు పక్షులను తిరిగి తెలంగాణకు తీసుకురావడంలో హైడ్రా ప్రాజెక్ట్ ఎంతో సహాయపడింది. సరస్సులకు కొత్త శోభ రావడంతో ఫ్లెమింగోలు, రెడ్ బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్ వంటి జాతులకు చెందిన పక్షులు తిరిగిరావడం పర్యావరణ పునరుద్ధరణతో పాటు మానవాళికి ఎంతో ప్రయోజం చేకూర్చనుందని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ సరస్సు వద్ద కనిపించిన అరుదైన రెడ్ ఫ్లైక్యాచర్‌కు సంబంధించిన విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. పర్యావరణ పునరుద్ధరణ కోసం సాగుతోన్న కార్యక్రమాలకు ఇది సాక్ష్యమని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
పర్యావరణ తెలంగాణ కోసం తీసుకున్న కొన్ని నిర్ణయాలు..
విద్యుత్ వాహనాల వాడకం..
హైదరాబాద్ ప్రజా రవాణా విద్యుదీకరణలో అగ్రగామిగా నిలిచింది. కాలుష్యకారక డీజిల్ బస్సుల స్థానంలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల (EVలు)తో ప్రభుత్వం నగరంలో వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించింది. అయితే కేవలం వాహనాలకే పరిమితం కాకుండా సైక్లింగ్ చేసే వారికి నడిచి వెళ్లే వారికి అనుకూలమైన జోన్‌లు ఏర్పాటు చేస్తూ, పర్యావరణ హితంగా హైదరాబాద్‌ను మోడల్ గ్రీన్ సిటీగా మార్చుతుంది.
మొక్కల పెంపకం..
తెలంగాణలో అటవీ ప్రాంతాల పెంపకం జోరుగుతో సాగుతోంది. అదే విధంగా పట్టణాలతో పాటు సెమీ అర్బన్ ప్రాంతాల్లో మొక్కలను పెంచే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా హైదరాబాద్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. హీట్‌వేవ్ సమస్య రాకుండా అత్యుత్తమ విధానాలతో హైదరాబాద్‌ను మోడల్ గ్రీన్ సిటీగా రూపుదిద్దుతున్నారు.
సోలార్ ఎనర్జీ వినియోగం..
సోలార్ ఎనర్జీ వినియోగం..
తెలంగాణ ఎనర్జీ గ్రిడ్‌లో సోలార్ ప్లాంట్‌ల అనుసంధానం కర్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంతో సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా భవిష్యత్ తరాలకు ఇంధన భద్రతకు భరోసా కల్పిస్తోంది.
ఎకో టూరిజం..
తెలంగాణ ప్రభుత్వం ఎకో టూరిజానికి కూడా పెద్ద పీట వేస్తోంది.. ఇందులో భాగంగానే బాపూ ఘాట్ వంటి స్థలాలను పర్యావరణ-పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టులు సుస్థిరతను, పర్యావరణ బాధ్యతతో సాంస్కృతిక వారసత్వాన్ని మిళితం చేస్తాయి. ఈ ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు ప్రకృతి, చరిత్రతో పాటు పర్యావరణ సంరక్షణకు సంబంధించిన బాధ్యతలు తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
నీటి కొరతను తట్టుకునేలా..
నీటి కొరతను తట్టుకునేలా..
భవిష్యత్తులో నీటి కొరత అనే సమస్య రాకుండా ఉండే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.
వేస్ట్ మేనేజ్‌మెంట్..
పర్యావరణ పరిరక్షణలో వేస్ట్ మేనేజ్‌మెంట్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులోని భాగంగానే సమగ్ర వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
దేశానికి ఆదర్శంగా..
పర్యావారణ సమస్యల పరిష్కార దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడడమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని నిపుణులు అంటున్నారు. పర్యావరణ పునరుద్ధరణ, పునరుత్పాదక ఇంధనం, స్థిరమైన పట్టణ ప్రణాళికలపై రేవంత్ రెడ్డికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి.