స్కూల్‌లో ఎగ్జామ్స్ రాయమంటే ఫ్రెండ్ తో కలిసి అవినాష్ చేసిన దొంగ పని ఏంటో తెలుసా? హిలేరియస్
బిగ్ బాస్ తెలుగు 8 ఎండింగ్‌కి చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే బుధవారం ఎపిసోడ్‌లో వాళ్ల మెమొరీస్‌ని పంచుకున్నారు
బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ఈ సీజన్ పూర్తి కాబోతుంది. దీంతో షో రోజు రోజుకి మరింత రసవత్తరంగా మారింది. ఈ వారం షోని మోస్ట్ ఎంటర్‌టైనింగ్‌గా మార్చుతున్నాడు బిగ్ బాస్. స్టార్ మా సీరియల్స్ జంటలను బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొస్తూ వారి చేత కంటెస్టెంట్లని గేమ్ ఆడిస్తూ, ఫన్నీ టాస్క్ లు ఇస్తూ అలరిస్తున్నార. ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈ వారం మొత్తం వినోదాత్మకంగా మార్చేశాడు. అంతేకాదు బెస్ట్ మెమొరీస్ కూడా పంచుకునేలా చేస్తున్నారు.
అందులో భాగంగా బుధవారం ఎపిసోడ్‌లో స్టార్ మా పరివార్ నుంచి `వంటలక్క` సీరియల్ జంట వైష్ణవి, కృష్ణ వచ్చారు. వీరు తమ సీరియస్ స్టోరీ చెప్పారు. అనంతరం హౌజ్‌మేట్స్ తో సరదాగా గడిపారు. ఫన్నీ టాస్క్ లు ఆడించారు. ఈ క్రమంలో అవినాష్ ఎప్పటికీ మర్చిపోలేని మెమోరీని పంచుకున్నారు. స్కూల్ టైమ్‌లో ఫ్రెండ్‌తో కలిసి చేసిన దొంగ పనిని బయటపెట్టాడు అవినాస్.
ఎగ్జామ్స్ సమయంలో చదివి ఎగ్జామ్స్ రాయలేక ఓ దొంగ పని చేశారు. ఎగ్జామ్స్ రాస్తూ ఎక్కువగా అడిషనల్ పేపర్స్ తీసుకునే వారట. అవన్నీ దారంతో కట్టి టీచర్‌కి ఇచ్చేవారట. ఇక రాత్రి సమయంలో నెమ్మదిగా ఎగ్జామ్ పేపర్స్ ఉండే రూమ్‌లోకి వెళ్లి బాగా చదివే క్లవర్ స్టూడెంట్ పేపర్ తీసి ఎగ్జామ్ రాసేవాళ్లట. కొన్ని సార్లు అతని కంటే తమకే ఎక్కువగా మార్కులు వచ్చేవన్నాడు. అయితే తన ఫ్రెండ్ కి అత్యాశ అని, వాడు లేనివి కూడా రాసేవాడని, దీంతో వందకంటే పైగా మార్కులు వచ్చేవని, తీరా ఆరా తీస్తే దొరికిపోయామని దీంతో తమని బాగా కొట్టారని, అప్పట్నుంచి వాటి జోలికెళ్లలేదన్నారు అవినాష్.
ప్రేరణ కూడా తన మెమొరీని పంచుకుంది. కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక `వంటలక్క` టీమ్ కాసేపు గేమ్‌లతో అలరించారు. ప్రైజ్ మనీ గేమ్‌లో బీబీ టీమ్ విజయం సాధించింది. ప్రైజ్ మనీ యాడ్ అయ్యింది. ఇలా వారిని కూడా అవినాష్ బాగా అలరించారు. అనంతరం `మగువా మగువా` సీరియల్ నుంచి ఆ జంట చంటి, సింధూర కూడా సందడి చేశారు. వీరితో కలిసి ఓ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది. జంతువులుగా బిహేస్ చేసే టాస్క్ అయితే మరింతగా నవ్వించింది. ఇందులో అవినాష్ కింగ్ అనిపించుకోవాలి. అంత బాగా మ్యానేజ్ చేశాడు. బిగ్ బాస్ షో చివరి వారం కావడంతో హౌజ్‌లో పెద్దగా టాస్క్ లేక డల్‌గా ఉంది. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్ పెంచాడు. ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.