ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.? మాములు క్రేజ్ కాదు..
Guess The Actress: సినిమా రంగం చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఎవరిని ఎలా పైకి తీసుకొస్తుందో అర్థం కాదు. కెరీర్ తొలినాళ్లలోనే స్క్రీన్‌ను దూరమైన వారు కొందరైతే, కెరీర్ చివరి రోజుల్లో లైమ్ లైట్‌లోకి వచ్చే వారు మరికొంత మంది ఉంటారు. ముఖ్యంగా నటీమణుల విషయంలో వయసు పెరిగినా కొద్దీ అవకాశాలు తగ్గుతాయి, స్క్రీన్‌కు దూరమవుతుంటారు. కానీ ఓ అందాల తార మాత్రం కెరీర్ ప్రారంభ రోజుల కంటే ఆ తర్వాతే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
పైన ఫొటోలో కనిపిస్తున్న అందాల తార ఎవరో కనిపెట్టారా.? దాదాపు 22 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి ఇచ్చిన ఈ బ్యూటీ మొదట్లో కేవలం సైడ్ క్యారెక్టర్లకు మాత్రమే పరిమితమైంది. హీరోయిన్ ఫ్రెండ్, కాలేజీలో స్టూడెంట్స్‌లో ఒకరిలా కనిపించింది. అయితే అప్పట్లో ఈమెను పెద్దగా ఎవరు గుర్తించలేదు. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఒక కామెడీ షో ద్వారా ఆడియన్స్‌కు బాగా చేరువైంది. ఈ పాటికే ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలిసిపోయి ఉండొచ్చు. అవును ఈమె మరెవరో కాదు అందాల యాంకర్ అనసూయే.
కెరీర్‌లో విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన వారిలో అనసూయ ఒకరు. ఒక చిన్న యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి నటిగా రాణిస్తున్నారు. బుల్లి తెర యాంకర్‌గా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న అనసూయ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఓ వైపు కీలక పాత్రల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లోనూ మెప్పించించారు. యాత్ర, క్షణం, రంగస్థలం, రజాకార్ వంటి చిత్రాల్లో తన నటనతో మెస్మరైజ్ చేశారు.
ఇక సినిమాలు, రియాలిటీ షోలతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియా వేదికగా కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో పలు కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ ఇస్తూ కూడా వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం అనసూయ కాస్త వివాదాలకు దూరంగా ఉంటున్నట్లు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. 2024 ఏడాదికి గుడ్ బై చెప్తోన్న సమయంలో ఈ ఏడాది తనకు నేర్పిన పాఠాలు అంటూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
హార్ట్ సింబల్‌ను చూపిస్తూ ఫేస్ బ్లర్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసిన అనసూయ.. "మిమ్మల్ని మీరు మార్చుకునే మీ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి, అలాఅని ఎక్కువ కూడా ఊహంచుకోకండి. అలాగే మీ ప్రేమకున్న శక్తిని ఎప్పుడూ మర్చిపోకండి. ఎందుకంటే మీరు గులాబీలను ఎంత ప్రేమిస్తారో వాటికున్న ముళ్లను కూడా అంతే ప్రేమించగలుగుతారు. ఫలితంగా మీరు మరింత శక్తివంతంగా మారుతారు' అంటూ రాసుకొచచారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కొటేషన్ అనసూయ కెరీర్‌కు సరిగ్గా సూట్ అవుతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఓటీటీలోకి అనసూయ కొత్త చిత్రం..
కాగా అనసూయ నటించిన రజాకర్ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మార్చిలో థియేటరల్లో విడుదలైన రజాకర్ మూవీ సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమైందని ఇటీవల అధికారిక ప్రకటన చేశారు. అయితే స్ట్రీమింగ్ తేదీకి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంటుంది. డిసెంబర్ 2 లేదా 26 నుంచి ్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.