కీర్తిసురేష్‌ పెళ్లి సందడి షురూ, స్పెషాలిటీ ఏంటంటే? ఈ రహస్యానికి కారణమదేనా?

మహానటి కీర్తిసురేష్‌ పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. రేపు డిసెంబర్‌ 12న ఆమె వివాహం జరగబోతుంది. అయితే మ్యారేజ్‌ విషయంలో సమంతనే ఫాలో అవుతుందట కీర్తి. 
 

keerthy suresh busy in marriage with antony thattil here wedding speciality arj

తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు, సౌత్‌ ఆడియెన్స్ మొత్తం కీర్తి సురేష్‌ని `మహానటి`గానే పిలుచుకుంటున్నారు. ఆమె `మహానటి` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సావిత్రి బయోపిక్‌ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రిలా జీవించింది కీర్తి. దీంతో అప్పట్నుంచి సౌత్‌ ఆడియెన్స్ కి మహానటి అయిపోయింది కీర్తిసురేష్‌. తాజాగా ఆమె మ్యారేజ్‌ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. 

కీర్తిసురేష్‌ పెళ్లి చేసుకుంటుంది. రేపే ఆమె వివాహం. తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్‌ని డిసెంబర్‌ 12న ఆమె మ్యారేజ్‌ చేసుకుంటుంది. అందుకు గోవా వేదిక కాబోతుంది. చాలా గ్రాండ్‌గా   గోవాలో జరిగే ఈ పెళ్లి వేడుకలో ఈ ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యినట్టు తెలుస్తుంది. అయితే పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌ స్టార్ట్ చేసింది కీర్తి సురేష్‌. ఈ మేరకు ఓ ఫోటోని పంచుకుంది. `హియర్‌ వీ గో మ్యాడ్‌నెస్‌ బిగిన్‌` అంటూ తెలిపింది. 

ఇందులో బ్యాక్ సైడ్‌ నుంచి తన పిక్ ని పంచుకుంది కీర్తిసురేష్‌. తన టాప్‌ వెనకాల కిట్టీ అని ఉంది. ఆమె పెళ్లికి ముస్తాబవుతున్నట్టుగా ఉంది. మరోవైపు పెళ్లి ఏర్పాట్లకి సంబంధించిన మరికొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు పెద్దగా బయటకు రాకపోవడంతో చాలా ప్రైవేట్‌గా కీర్తి సురేష్‌ వివాహం చేసుకోబోతుందని అర్థమవుతుంది. ఈ పెళ్లికి వారి ఫ్యామిలీ మెంబర్స్, బంధుమిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారట. అందుకే ఎలాంటి హంగామా లేకుండా చాలా సైలెంట్‌గా ఈ వివాహ వేడుక జరుగుతుందని సమాచారం. 

ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరూ ఆమె పెళ్లిలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. ఇలా చాలా రహస్యంగానే తమ వివాహ వేడుకని కీర్తిసురేష్‌ ప్లాన్‌ చేసుకుందట. అయితే అబ్బాయి ఆంటోనీ తట్టీల్‌ సారథ్యంలోనే ఈ వివాహ వేడుక ఉంటుందట. వాళ్ల కంట్రోల్‌లోనే ఉంటుందని సమాచారం. అందుకే కీర్తి కూడా పెద్దగా హడావుడి చేయడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మ్యారేజ్‌ విషయంలో సమంత-నాగచైతన్యలనే కీర్తి ఫాలో కాబోతుందని తెలుస్తుంది. 

ఆంటోనీ క్రిస్టియన్‌, కీర్తిసురేష్‌ హిందూ. దీంతో మొదటి క్రిస్టియన్‌ ట్రెడిషన్‌ లో మ్యారేజ్‌ జరుగుతుందని, ఆ తర్వాత హిందీ సాంప్రదాయంలో మ్యారేజ్‌ చేసుకుంటారట. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇద్దరి ట్రెడిషన్‌కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. కీర్తి సురేష్‌ మ్యారేజ్‌ విషయంలోనూ అదే జరుగుతుందని తెలుస్తుంది. ఆంటోనీ, కీర్తి 15ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. ఆంటోని బిజినెస్‌ మేన్‌గా రాణిస్తున్నాడు. ఆయనకు చెన్నై, కొచ్చిల్లో పలు బిజినెస్‌లున్నాయట.   

ఇక కీర్తిసురేష్‌ తెలుగులో చివరగా `భోళా శంకర్‌`లో మెరిసింది. ప్రస్తుతం ఆమె తమిళంలో `రివాల్వర్‌ రీటా`, `కన్నెవేడి` సినిమాల్లో నటిస్తుంది. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `బేబీ జాన్‌` సినిమాలో నటిస్తుంది.  ఈ మూవీ ఈ డిసెంబర్‌ 25న విడుదల కాబోతుంది. ఇందులో గ్లామర్‌ పరంగా హద్దులు చెరిపేసింది కీర్తి. దీంతో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు పెళ్లికి రెండు రోజుల ముందే ఆమె ఓ నేషనల్‌ మేగజీన్‌ కోసం గ్లామర్‌ ఫోటో షూట్‌ చేసింది.ఆ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios