ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టకూడదో తెలుసా?
. వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బులను ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ పెట్టకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…

Dhan Prapti Vastu upay
డబ్బు సంపాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బును దాచుకుంటూ.. మరింత కూడపెట్టాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. మనం ఇంట్లో డబ్బును ఏ మూలలో ఉంచుతున్నాం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. మనం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బును ఉంచడం వల్ల సంపద పెరగకపోగా.. అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బులను ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ పెట్టకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…
వాస్తు శాస్త్రం ప్రకారం..పొరపాటున కూడా సంపాందించిన డబ్బును సేఫ్ గా ఉంటాయి కదా అని.. చీకటి ప్రదేశంలో ఎప్పుడూ దాచిపెట్టకూడదట. ఇలా చేయడం వల్ల… సంపాదించిన మొత్తం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
ఇంట్లో బాత్రూమ్ కి దగ్గరల్లో.. దానితో సంబంధం ఉన్న ప్రదేశంలో కూడా డబ్బు దాచిపెట్టకూడదట. అలా పెట్టడం వల్ల.. ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోగా.. అనవసరపు ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుందట.
ఇంట్లోని నైరుతి భాగంలో పొరపాటున కూాడా ఎప్పుడూ డబ్బులు దాచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటికి అశుభం కలిగిస్తుందట. అంతేకాదు.. ఇంటి మూలల్లో కూడా డబ్బులు దాచిపెట్టకూడదు. ఇది కూడా మంచిది కాదు. నష్టాలను కలిగిస్తుంది.
మనం డబ్బును దాచే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అశుభ్రంగా ఉంచే ప్రదేశంలో డబ్బును ఎప్పుడూ స్టోర్ చేయకూడదు. దీని వల్ల కూడా నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇంటికి డబ్బు రావడమే ఆగిపోతుంది.
money
డబ్బును ఫ్లోర్ మీద డైరెక్ట్ గా ఎప్పుడూ పెట్టకూడదు. ఇది ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. అదేవిధంగా కిచెన్ కి దగ్గరలో. కిచెన్ లో కూడా ఎప్పుడూ సంపాదన ఉంచకూడదు. దీని వల్ల దాచిన డబ్బు ఎప్పుడూ నిల్వ ఉండదు.ఇంటి ముఖద్వారానికి సమీపంలో కూడా డబ్బులను దాచకూడదు. దీని వల్ల సంపాదించినది మొత్తం త్వరగా ఖర్చు అయిపోతుంది. చెత్త బుట్ట కు సమీపంలో కూడా ఉంచకూడదు.