MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సుడిగాలి సుధీర్‌ అడ్డంగా బుక్కైన వేళ.. పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ షోలోనే నిలదీసిన గర్ల్ ఫ్రెండ్..

సుడిగాలి సుధీర్‌ అడ్డంగా బుక్కైన వేళ.. పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ షోలోనే నిలదీసిన గర్ల్ ఫ్రెండ్..

`జబర్దస్త్` కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ అంటే అందరిలోనూ ఓ ప్లేబాయ్‌ లాంటి ఇమేజ్‌ ఉంది. ఆయనకు చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ విషయం బట్టబయలైంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 10 2022, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సుడిగాలి సుధీర్‌ ని అందరి ముందు నిలదీసింది ఆయన ప్రియురాలు. ఇన్నాళ్లు కలిసి తిరిగాం. ఇప్పటికైనా మ్యారేజ్‌ చేసుకుంటావా? లేదా అంటూ అందరి ముందు ప్రశ్నించింది. హాట్‌ యాంకర్‌ అనసూయ సాక్షిగా సుడిగాలి సుధీర్‌ బండారం బయటపడింది. దీంతో ఇప్పుడిది చర్చనీయాంశమవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

`జబర్దస్త్` కామెడీ షోలో సుడిగాలి సుధీర్‌గా పాపులర్‌ అయ్యారు సుధీర్‌. సుడిగాలి టీమ్‌తో ఆయన బుల్లితెరపై రచ్చ చేశారు. ఇందులో రామ్‌ ప్రసాద్‌, గెటప్‌ శ్రీనులతో కలిసి ఆయన చేసిన కామెడీ ఆద్యంతం నవ్వులు పూయించింది. డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో కూడిన పంచ్‌లు బాగా పేలాయి. దీంతో ఈ టీమ్‌కి స్టార్‌ గుర్తింపు వచ్చింది. 
 

37

అయితే జబర్దస్త్ లోనే యాంకర్‌ రష్మితో ఆయన రిలేషన్‌షిప్‌ కూడా హాట్‌ టాపిక్‌ అవుతూ వస్తోంది. ఈ ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడటం, చాలా సార్లు ఈ షోలోనే పెళ్లిళ్లు చేసుకోవడం, లవ్‌ ప్రపోజ్‌ చేయడం, ఒకరిపై ఒకరు ప్రత్యేకమైన అభిమానం చూపించుకోవడం, ఒకరు లేకపోతే మరొకరు లేనరనేలా డైలాగులు చెప్పడంతో ఈ జంట పాపులర్‌ అయ్యింది. అభిమానులు సైతం వీరిని జంటగానే చూస్తున్నారు. అంతేకాదు ఈ జంటకి ప్రత్యేకమైన అభిమానగణం ఏర్పడింది. 
 

47

కానీ ఇటీవల ఊహించని విధంగా `జబర్దస్త్`ని వీడాడు సుధీర్‌. ఆయన స్టార్‌ మాలో `సూపర్‌ సింగర్‌ జూనియర్‌` షోకి అనసూయతో కలిసి యాంకర్‌గా చేస్తున్నారు. అనసూయ సైతం `జబర్దస్త్`ని వీడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు చిల్ర్డన్స్ సింగర్స్ షోని హోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు మధ్య మధ్యలో తనదైన డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో కూడిన కామెడీ స్కిట్లు ప్రదర్శిస్తూ అలరిస్తున్నారు. వినోదాన్ని పంచుతున్నారు. 
 

57

అందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన స్కిట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌ పెళ్లి మ్యాటర్‌ ఆసక్తికరంగా మారింది. అనసూయ, మనో, చిత్ర, హేమచంద్ర వంటి వారి సమక్షంలో ఓ అమ్మాయి సుడిగాలి సుధీర్‌ని నిలదీయడం విశేషం. ఆమె తనని పెళ్లి చేసుకుంటావా లేదా అని ప్రశ్నించడంతో సుడిగాలి సుధీర్‌ ఆయోమయంలో పడ్డారు. అదే సమయంలో బయట నుంచి ఫ్రెండ్స్, గర్‌ ఫ్రెండ్స్ ఫోన్‌ చేయడం, ఇంటికొస్తున్నావా? అని, ఎప్పుడు కలుద్దామని అడుగుతుండటంతో అసలు బండారం బయటపడింది. ఇది గ్రహించిన ప్రియురాలు సుధీర్‌ని నిలదీసింది. 
 

67

మరోవైపు తన చెల్లి సైతం తనకు పెళ్లి చేస్తావా లేదంటూ వెంటపడింది. ఇలా ఓ వైపు ప్రియురాలు, మరోవైపు చెల్లి పెళ్లి చేస్తావా? పెళ్లి చేసుకుంటావా? లేదా అంటూ ఒత్తిడి తేవడంతో ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు సుధీర్‌. ఆయన ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయాడు. దీంతో ఈ మ్యాటర్‌ పెద్దది కావడం గమనార్హం. 
 

77

దీంతో సుధీర్‌ తన గర్ల్ ఫ్రెండ్‌కి షాకిచ్చాడు. తనకింక పెళ్లి చేసుకునే వయసు రాలేదంటూ షాకిచ్చాడు. తానింకా చిన్న పిల్లాడినే అని, ఇప్పుడు పెళ్లి అంటే మా ఇంట్లో ఒప్పుకోరంటూ ఆమెని దాటవేసేప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి నుంచి బయటపడేందుకు అనేక రకంగాలుగా ట్రై చేశాడు సుధీర్‌. అయితే ఇదంతా యాంకర్‌ అనసూయ ప్లాన్‌ చేయడం విశేషం. ఎంటర్‌టైనింగ్‌ కోసం చేసిన ఈ స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించడం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved