- Home
- Entertainment
- అవును.. నేను డేటింగ్‌లో ఉన్నా.. నెటిజన్లకి శృతి హాసన్ బోల్డ్ రిప్లై.. గూగుల్ సెర్చింగ్‌లో కమల్ తనయ ఆస్తులు
అవును.. నేను డేటింగ్‌లో ఉన్నా.. నెటిజన్లకి శృతి హాసన్ బోల్డ్ రిప్లై.. గూగుల్ సెర్చింగ్‌లో కమల్ తనయ ఆస్తులు
కమల్ తనయ శృతి హాసన్ ఇటీవల వరుసగా నెటిజన్లకి కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె తన డేటింగ్ గురించి ఓపెన్‌గా చెప్పేసింది. అధికారికంగా ప్రకటించింది. బోల్డ్ రిప్లైతో షాకిస్తుంది.

శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఏమాత్రం సమయం దొరికినా అభిమానులతో చాట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొన్ని కొంటెప్రశ్నలను ఎదుర్కోవల్సి వస్తుంటుంది. వాటికి కూడా ఓపికగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా శృతి హాసన్ విషయంలో అదే జరిగింది.
అయితే ఇటీవల కాలంలో శృతి హాసన్ గురించి ఆరా తీసిన ప్రశ్నలపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ, వాటికి సమాధానాలు చెప్పింది. అందులో చాలా మంది శృతి ఫోన్ నెంబర్ అడగ్గా.. 100కి డయల్ చేయండి అని, అయితే ఇది ఆల్‌రెడీ చెప్పానని తెలిపింది. రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి చెప్పాలనే ప్రశ్నకి సమాధానం చెప్పని శృతి, ఆ తర్వాత ప్రశ్న ఏంటో తనకు తెలుసు అని చెప్పడం విశేషం.
శృతి హాసన్ ప్రియుడు శాంతను హజారిక ఎవరు? అనేది తాను కూడా గూగుల్ చేశానని చెప్పిన శృతి తనని అడిగిన మిగిలిన ప్రశ్నలను చూసి తెగ నవ్వుకుందట. కాసేపు ఈ విషయాన్ని ఊరించిన కమల్ తనయ ఎట్టకేలకు సమాధానం చెప్పింది. అవును నేను డేటింగ్‌లో ఉన్నానని బోల్డ్ గా చెప్పేసింది. దీంతో వందల ప్రశ్నలకు, అనేక రూమర్స్ కి చెక్ పెట్టినట్టయ్యింది.
ఇదిలా ఉంటే ఈ క్రమంలో శృతిహాసన్‌కి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. చాలా మంది శృతి హాసన్ ఆస్తుల వివరాలను సెర్చ్ చేశారట. `నీ ఆస్తి మొత్తంఎంత ఉంటుంది?` అనేప్రశ్నకి ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆమె దాన్ని కనుకొనే పనిలో ఉన్నానని, కానీ దాన్ని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నా` అని సమాధానం చెప్పింది శృతి హాసన్.
ఇక కమ్ బ్యాక్ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది శృతి హాసన్. `క్రాక్`తో గతేడాది మంచి కమ్‌బ్యాక్ అయ్యింది కమల్ తనయ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో `వకీల్‌సాబ్`తోనూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రం `సలార్`లో నటిస్తుంది. అలాగే బాలయ్యతో గోపీచంద్ మలినేని సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది.
ఇదిలా ఉంటే శృతి హాసన్ గతేడాది నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ సారి బ్రేకప్ చెప్పిన శృతి.. కొంత గ్యాప్‌తో శాంతను ప్రేమలో పడింది. వరుసగా వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఓపెన్‌గానే డేటింగ్ చేస్తూ ఫ్యాన్స్ కి షాక్‌లతోపాటు సర్‌ప్రైజ్‌లిస్తున్నారు. ముద్దులు, హగ్గులతోనూ రెచ్చిపోతుండటం విశేషం.